నిర్మాత కష్టాలతో... | Lakshmi Devi Samarpinchu Nede Chudandi Motion Poster | Sakshi
Sakshi News home page

నిర్మాత కష్టాలతో...

Published Sun, Jul 17 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

నిర్మాత కష్టాలతో...

నిర్మాత కష్టాలతో...

జాకీ అతిక్ దర్శకత్వంలో యం.సుబ్బారెడ్డి నిర్మిస్తోన్న సినిమా ‘లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి’. కృష్ణ, జనని, అఖిల్, భార్గవి, చరణ్, ప్రజ్ఙ హీరో హీరోయిన్లు. కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ - ‘‘మా (నిర్మాతల) జీవితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి సుబ్బారెడ్డి సరైన చిత్రం తీశాడు. ఎవరెన్ని చెప్పినా 1975-80 తర్వాత నిర్మాత చచ్చిపోయా డు. నిర్మాతగా మా విలువల్ని మేమే దిగజార్చుకుంటు న్నాం.
 
  మమ్మల్ని మేమే చంపుకున్నాం. ఈ సినిమా విడుదల తర్వాత నిర్మాతల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాని రూపొందించిన దర్శక-నిర్మాతలకు ఆల్‌ది బెస్ట్’’ అని సీనియర్ నరేశ్ అన్నారు. చిత్ర నిర్మాత యం.సుబ్బారెడ్డి మాట్లాడుతూ - ‘‘నిర్మాతల కష్టాలను చూపిస్తున్నాం తప్ప ఎవ్వరినీ కించపరిచే విధంగా సినిమా ఉండదు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రఘు.ఆర్.బళ్ళారి, సహనిర్మాత: సిరాజ్, సంగీతం: శ్రీకోటి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement