Lakshmi Devi Samarpinchu Nede Chudandi
-
లక్ష్మీ దేవి సమర్పణలో...
నటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘లక్ష్మీదేవీ సమర్పించు నేడే చూడండి’. కృష్ణ, జనని, అఖిల్, భార్గవి, చరణ్, ప్రజ్ఞ, నరేశ్, ఆమని ముఖ్య తారలుగా జాకి అతిక్ దర్శకత్వంలో కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ çసంస్థ సమర్పణలో మేరువ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ‘‘సోషియో ఫాంటసీ నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ట్రైలర్, పాటలు బావున్నాయి. ఈ చిత్రాన్ని సుబ్బారెడ్డిగారు రిచ్‌గా నిర్మించారు. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు సీనియర్ నరేశ్. ‘‘హీరో కావాలనుకునే కుర్రాడి పాత్రలో నటించా. జాకీ ఈ చిత్రాన్ని ఎంటర్టైనింగ్గా తెరకెక్కించారు’’ అన్నారు కృష్ణ. నిర్మాత సీజే శోభారాణి, జనని, నటుడు గౌతంరాజు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం : శ్రీకోటి, సహ నిర్మాత : సిరాజ్. -
నిర్మాత కష్టాలతో...
జాకీ అతిక్ దర్శకత్వంలో యం.సుబ్బారెడ్డి నిర్మిస్తోన్న సినిమా ‘లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి’. కృష్ణ, జనని, అఖిల్, భార్గవి, చరణ్, ప్రజ్ఙ హీరో హీరోయిన్లు. కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ - ‘‘మా (నిర్మాతల) జీవితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి సుబ్బారెడ్డి సరైన చిత్రం తీశాడు. ఎవరెన్ని చెప్పినా 1975-80 తర్వాత నిర్మాత చచ్చిపోయా డు. నిర్మాతగా మా విలువల్ని మేమే దిగజార్చుకుంటు న్నాం. మమ్మల్ని మేమే చంపుకున్నాం. ఈ సినిమా విడుదల తర్వాత నిర్మాతల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాని రూపొందించిన దర్శక-నిర్మాతలకు ఆల్‌ది బెస్ట్’’ అని సీనియర్ నరేశ్ అన్నారు. చిత్ర నిర్మాత యం.సుబ్బారెడ్డి మాట్లాడుతూ - ‘‘నిర్మాతల కష్టాలను చూపిస్తున్నాం తప్ప ఎవ్వరినీ కించపరిచే విధంగా సినిమా ఉండదు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రఘు.ఆర్.బళ్ళారి, సహనిర్మాత: సిరాజ్, సంగీతం: శ్రీకోటి.