స్క్రీన్‌ టెస్ట్‌ | tollywood movies special screen test on 21 dec 2018 | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Dec 21 2018 6:02 AM | Last Updated on Fri, Dec 21 2018 6:02 AM

tollywood movies special screen test on 21 dec 2018 - Sakshi

సినిమా డైలాగ్‌ అనగానే  యన్టీఆర్‌ నటించిన ‘దానవీర శూర కర్ణ’ చిత్రంలో ‘ఆచార్య దేవా’ ఏమంటివీ.. ఏమంటివీ ... అనే డైలాగ్‌ ఇప్పటికీ గుర్తొస్తుంది.  40 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా మాటలు ఇప్పటికీ
వినిపిస్తున్నాయంటే డైలాగ్‌కి  ఉన్న పవర్‌ అది. 2018లో  విడుదలైన చిత్రాల్లోని పలు ఫేమస్‌ డైలాగ్‌లు ఈ వారం క్విజ్‌....

1. ‘‘ప్రతిభ ఇంటిపట్టునుంటే... ప్రపంచానికి పుట్టగతులుండవు’’ ఈ డైలాగ్‌ ‘మహానటి’ చిత్రంలోనిది. చిత్రంలో ఈ డైలాగ్‌ పలికిన నటుడెవరో తెలుసా?
ఎ) మోహన్‌బాబు  బి) ప్రకాశ్‌ రాజ్‌  సి) దుల్కర్‌ సల్మాన్‌   డి) నరేశ్‌

2. ‘ఇట్స్‌ షో టైమ్‌’ అనే డైలాగ్‌తో హల్‌చల్‌ చేసిన ప్రముఖ హీరో ఎవరో కనుక్కోండి. ఈ డైలాగ్‌ ఉన్న సినిమా 2019 ఆగస్టులో విడుదలవుతుంది?   
ఎ) మహేశ్‌బాబు బి) వెంకటేశ్‌  సి) ప్రభాస్‌ డి) రానా

3. ‘‘వయొలెన్స్‌ మా డీఎన్‌ఏ కాదు.. మా మీద పడ్డ అత్యవసర పరిస్థితి...’ అనే డైలాగ్‌ చెప్పిన హీరో ఎవరో తెలుసా? (చిన్న క్లూ:ఈ డైలాగ్‌ రైటర్‌ త్రివిక్రమ్‌)
ఎ) యన్టీఆర్‌    బి) బాలకృష్ణ  సి) నాగార్జున  డి) వెంకటేశ్‌
 
4. ‘‘ఇంకోసారి అమ్మాయిలు, ఆంటీలు, ఫిగర్లు అని తిరిగావంటే.. యాసిడ్‌ పోసేస్తా’’ అనే ఫేమస్‌ డైలాగ్‌ను విజయ్‌ దేవరకొండతో చెప్పిన హీరోయిన్‌ ఎవరో
గుర్తుపట్టండి?
ఎ) ప్రియాంక జవాల్కర్‌  బి) మెహరీన్‌     సి) షాలినీ పాండే  డి) రష్మికా మండన్నా

5. ‘‘క్యారెక్టర్‌ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే, చావురాక ముందు చచ్చిపోవటమే’’ ఈ డైలాగ్‌ చెప్పిన ప్రముఖ హీరో ఎవరో తెలుసా? (చిన్న క్లూ: ఈ డైలాగ్‌ను రాసింది వక్కంతం వంశీ)
ఎ) నాని    బి) విజయ్‌ దేవరకొండ  సి) కల్యాణ్‌ రామ్‌  డి) అల్లు అర్జున్‌

6. ‘‘యూనిఫామ్‌లో ఉంటే గన్‌లో ఆరే బుల్లెట్లు, యూనిఫామ్‌ తీసేస్తే దీనమ్మ రాయితో చంపుతానో, రాడ్‌తో చంపుతానో నాకే తెలియదు’’ ఈ డైలాగ్‌ చెప్పిన ప్రముఖ హీరో ఎవరో కనుక్కోండి? (ఈ చిత్రానికి విక్రమ్‌ సిరికొండ దర్శకుడు)
ఎ) బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌   బి) రవితేజ       సి) నాగచైతన్య   డి) గోపీచంద్‌

7. ‘‘ఆడోళ్లు భలే కఠినాత్ములు...’ ఈ డైలాగ్‌ను ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో హీరో నాని చెప్తాడు.  ఈ డైలాగ్‌ రైటర్‌ ఎవరు?
ఎ) వక్కంతం వంశీ   బి) మేర్లపాక గాంధీ  సి) పెంచల్‌ దాస్‌ డి) ఆకుల శివ

8. ‘వియ్‌ ఆర్‌ లివింగ్‌ ఇన్‌ ఏ సొసైటీ... ప్రతి ఒక్కరికీ బరువు, బాధ్యత ఉండాలి...’ అనే సోషల్‌ మెసేజ్‌ డైలాగ్‌ ఏ సినిమాలోనిదో కనిపెట్టండి?
ఎ) నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా  బి) భరత్‌ అనే నేను సి) టచ్‌ చేసి చూడు  డి) కవచం

9. ‘చేపలకి కూడా కన్నీళ్లుంటాయి బాస్‌... నీళ్లల్లో ఉంటాం కదా కనిపించవు అంతే’ ఈ డైలాగ్‌ను హీరో నాని ‘అ!’ చిత్రంలోని చేప పాత్ర ద్వారా చెప్పారు. ఈ చిత్రంలో కృష్ణవేణి పాత్రలో  నటించిన నటి ఎవరో కనిపెట్టండి?
ఎ) తమన్నా     బి) కాజల్‌ అగర్వాల్‌  సి) నిత్యామీనన్‌  డి) రెజీనా

10. ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రంలో హీరో నితిన్‌ చెప్పిన ‘‘వర్షాకాలంలో కలుసుకున్న మేము, శీతాకాలంలో ప్రేమించుకొని, వేసవికాలంలో విడిపోయాము’’ డైలాగ్‌ రాసిందెవరో తెలుసా?(ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్‌  ఓ నిర్మాత)
ఎ) చైతన్యకృష్ణ    బి) సత్యానంద్‌  సి) త్రివిక్రమ్‌        డి) యం.రత్నం

11. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌ ‘మహానటి’. ఈ చిత్రానికి మాటల రచయిత ఎవరో తెలుసా?
ఎ) కోన వెంకట్‌  బి) అబ్బూరి రవి  సి) నాగ్‌ అశ్విన్‌  డి) బుర్రా సాయిమాధవ్‌

12. ‘‘సల్మాన్‌ఖాన్‌ జిందాబాద్, షారుక్‌æఖాన్‌ జిందాబాద్, ఆమిర్‌ ఖాన్‌ జిందాబాద్, అబ్దుల్‌ కలాం జిందాబాద్, ఇన్‌సాన్‌ జిందాబాద్, మొహబ్బత్‌ జిందాబాద్, మేరీ మెహబూబా జిందాబాద్‌’’ ఈ డైలాగ్‌ ‘మెహబూబా’ చిత్రంలోనిది. ఈ డైలాగ్‌ చెప్పిన హీరో ఆకాష్‌ పూరి. డైలాగ్‌ రైటర్‌ ఎవరో చెప్పుకోండి?
ఎ)  పూరి జగన్నాథ్‌  బి) భాస్కరభట్ల  సి) కందికొండ   డి) వనమాలి

13 ‘‘కాలేజీలో ఉన్న ప్రతివాడికి రాఖీ కడతా, వాడికి తప్ప...  బికాజ్‌ ఐ లవ్‌ హిమ్‌’’ అని హీరోయిన్‌ రాశీ ఖన్నా ఏ హీరో గురించి  అంటుందో కనిపెట్టండి?
ఎ) వరుణ్‌ తేజ్‌  బి) సాయిధరమ్‌ తేజ్‌ సి) సందీప్‌ కిషన్‌  డి) నాగౖచైతన్య

14. ‘‘ఏయ్‌ లేవయ్యా లే.. ఏంటి ఫాలో చేస్తున్నావా అని హీరోయిన్‌ అంటే... ఆ మీకు తెలిసిపోయిందా. అయినా మీరు ఇలా దగ్గరికొచ్చి మాట్లాడటం ఏం బాలేదండి...’’ అని హీరో శర్వానంద్‌ ఏ హీరోయిన్‌ని ఉద్దేశించి అంటాడో కనుక్కోండి?
ఎ) లావణ్యా త్రిపాఠి  బి) అనుపమా పరమేశ్వరన్‌  సి) సాయి పల్లవి  డి) నిత్యామీనన్‌

15. ‘‘అబద్ధాలు చెబితే అమ్మాయిలు పుడతారో లేదో తెలియదు కానీ, అబద్ధాలు చెబితే అమ్మాయిలు కచ్చితంగా పడతారు...’ ఈ డైలాగ్‌ చెప్పిన హీరో ఎవరో తెలుసా?
ఎ) రామ్‌        బి) అఖిల్‌   సి) రాహుల్‌ రవీంద్రన్‌  డి) నవీన్‌ చంద్ర

16. ‘‘ఫణీంద్ర భూపతి నాయుడు.. నువ్వు భయపడాల్సింది మేకను చంపిన సింహాల గుంపును చూసి కాదు, సింహాల మందకు ఎదురు తిరిగిన మేక గురించి’’ అనే డైలాగ్‌ ‘రంగస్థలం’ చిత్రంలోనిది. ఫణీంద్ర నాయుడుగా నటించింది ఎవరు?
ఎ) ఆది పినిశెట్టి    బి) రాజీవ్‌ కనకాల సి) ‘జబర్దస్త్‌’ మహేశ్‌ డి) జగపతిబాబు

17. ‘‘అమ్మాయిలతో ప్రాబ్లమ్‌ ఇదేరా, మనం వాళ్లను చూసినా వాళ్లు మనల్ని చూసినా డిస్ట్రబ్‌ అయ్యేది మనమేరా’’ ఈ డైలాగ్‌ ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంలోనిది. డైలాగ్‌ రైటర్‌ ఎవరో తెలుసా?
ఎ) ప్రసన్నకుమార్‌ బెజవాడ  బి) విజయేంద్ర ప్రసాద్‌  సి) పోసాని కృష్ణమురళి  డి) వేగేశ్న సతీశ్‌

18. ‘‘సినిమా, సాహిత్యం బతికే ఉంటాయి. అంతే.. అని నరేశ్‌ అంటే, సాహిత్యం అన్నావ్‌ ఓకే, సినిమా...’ అని సుధీర్‌బాబు అనే డైలాగ్‌ ‘సమ్మోహనం’ చిత్రం లోనిది.  డైలాగ్‌ రైటర్‌ ఎవరో తెలుసా?
ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ  బి) తనికెళ్ల భరణి  సి) శ్రీనివాస్‌ అవసరాల  డి) జనార ్ధన మహర్షి

19. ‘ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా..  భాగమతి అడ్డా’’ అనే డైలాగ్‌ ‘భాగమతి ’ చిత్రంలోనిది. అనుష్క టైటిల్‌ రోల్‌ చేసిన ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ ఏది?
ఎ) గీతా ఆర్ట్స్‌ బి) వైజయంతీ మూవీస్‌ సి) యూవీ క్రియేషన్స్‌  డి) సురేశ్‌ ప్రొడక్షన్స్‌

20. ‘‘నేలటిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు’’ అనే డైలాగ్‌ ‘నేలటిక్కెట్టు’ చిత్రంలో హీరో రవితేజ చెబుతారు. ఈ చిత్రదర్శకుడెవరో తెలుసా?
ఎ) వీఐ ఆనంద్‌      బి) కల్యాణ్‌ కృష్ణ   సి) వీవీ వినాయక్‌  డి) శ్రీను వైట్ల

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!


సమాధానాలు
1) బి )2) సి 3) ఎ 4) డి 5) డి 6) బి 7) బి 8) బి9) సి 10) ఎ 11) డి
12) ఎ 13) ఎ 14) సి 15) ఎ 16) డి 17) డి 18) ఎ 19) సి 20) బి


నిర్వహణ: శివ మల్లాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement