మరోసారి విలన్‌గా.. | Regina in negative role in Vishal next movie | Sakshi
Sakshi News home page

మరోసారి విలన్‌గా..

Published Sun, Sep 15 2019 12:32 AM | Last Updated on Sun, Sep 15 2019 12:32 AM

Regina in negative role in Vishal next movie - Sakshi

రెజీనా

ఇటీవల తెలుగులో విడుదలైన ‘ఎవరు’ సినిమాలో సమీర పాత్రలో రెచ్చిపోయారు రెజీనా. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న ఈ పాత్రలో రెజీనా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా మరోసారి అలాంటి పాత్రనే రెజీనా చేస్తున్నారని తెలిసింది. విశాల్‌ హీరోగా ఆనంద్‌ అనే కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. మిలటరీ ఆఫీసర్‌ పాత్రలో విశాల్, పోలీసాఫీసర్‌ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కోయంబత్తూరులో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ దాదాపు ఇరవై రోజులు జరుగుతుంది. నెక్ట్స్‌ షెడ్యూల్‌ను చెన్నైలో ప్లాన్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement