Negative Shade
-
ఆ పాత్ర చేయడానికి భయపడ్డా!
‘‘ఛాలెంజింగ్ రోల్స్ చేసినప్పుడే ఏ ఆర్టిస్ట్‌కైనా సంతృప్తి లభిస్తుంది. అందుకే ‘రుద్ర’ వెబ్ సిరీస్‌లో నాది కాస్త నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అయినప్పటికీ చేశాను’’ అన్నారు రాశీ ఖన్నా. అయితే ఈ క్యారెక్టర్ ఒప్పుకునే ముందు ఈ బ్యూటీ భయపడ్డారట. ఈ విషయం గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘సినిమాల్లో నన్ను పాజిటివ్ రోల్స్‌లో చూసిన ఫ్యాన్స్ నెగటివ్ షేడ్స్‌లో చూసి ఫీలవుతారేమోనని కాస్త భయపడ్డాను. నా మీద ఎంతో అభిమానం చూపిస్తున్న ఫ్యాన్స్‌కి నేను ఆన్సరబుల్. సౌత్‌లో నాకు పాజిటివ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఇక్కడివారు ఎలా రియాక్ట్ అవుతారో అని కొంచెం డౌట్ ఉండేది. కానీ ఆర్టిస్ట్‌గా చాలెంజింగ్ రోల్స్ చేయాలి కాబట్టి నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి ‘రుద్ర’ చేశాను. నా క్యారెక్టర్ చాలామందికి నచ్చింది. కొంతమందికి నచ్చలేదు. నచ్చక పోవడానికి కారణం నా మీద వారికున్న పాజిటివ్ ఇమేజ్. ఏది ఏమైనా నాకు ఫ్యాన్స్ సపోర్ట్ ఎప్పుడూ కావాలి. ఎందుకంటే ఒక యాక్టర్‌గా నేను డిఫరెంట్‌గా ట్రై చేసినప్పుడు వాళ్లు చూస్తేనే నేను మళ్లీ మళ్లీ అలాంటివి చేయగలుగుతాను. లేకపోతే ఒకే తరహా రోల్స్‌కి పరిమితం కావాల్సి వస్తుంది’’ అన్నారు. -
నన్ను తిట్టుకుంటారనుకున్నాను!
కొన్నిసార్లు సినిమాలోని పాత్రలు రిస్కీగా ఉంటాయి. అనుకున్న విధంగా తెరమీద కనిపించకపోతే నటులు విమర్శలపాలు కావాల్సి ఉంటుంది. అనుకున్నట్టే జరిగితే అన్నీ ప్రశంసలే. ‘సూపర్ డీలక్స్’ సినిమా అంగీకరించే ముందు సమంత కూడా ఇలాంటి సందర్భాన్నే ఎదుర్కొన్నారట. ఈ సినిమాలో సమంత పాత్ర బోల్డ్‌గా కొంచెం నెగటివ్ షేడ్స్‌తో ఉంటుంది. అయితే ఈ పాత్ర సమంతకు మంచి పేరు తీసుకొచ్చింది. బెస్ట్ యాక్టర్‌గా తమిళంలో అవార్డును కూడా అందుకున్నారు. ‘‘ఈ పాత్రను అంగీకరించే సమయంలో ప్రేక్షకులు నన్ను విపరీతంగా తిట్టుకుంటారు లేదా బాగా అభినందిస్తారు అనుకుంటూ ఒప్పుకున్నాను. నా పాత్రకు ఎటువంటి విమర్శలు రాలేదు. ఈ సినిమాలో నటించడం నాకో మంచి అనుభవం’’ అని అవార్డును అందుకున్న తర్వాత మాట్లాడారు సమంత. ఇదిగో ఇక్కడ లేత గులాబీ రంగు చీరలో సమంత కనిపిస్తున్నారు కదా. ఈ డిజైనర్ శారీలోనే ఆమె వేడుకకు హాజరయ్యారు. ఫంక్షన్లో సమంత చీర ఓ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ చీర బాగా నచ్చిందేమో ఆమె స్పెషల్‌గా ఫొటోషూట్ చేయించుకున్నారు. చై (భర్త నాగచైతన్యను సమంత ‘చై’ అనే అంటారు) ట్యాటూ కనపడేట్టు ఆమె ఫొటోలు దిగారు. ఫొటోను క్లియర్‌గా గమనిస్తే ‘చై’ ట్యాటూని మీరూ చూడొచ్చు. -
వేసవిలో భయపెడతా
విలన్ పాత్రలు చేయడానికి హీరోయిన్లు ఆసక్తి చూపుతున్న ట్రెండ్ ఇప్పుడు సౌత్‌లోనూ మొదలైంది. నయనతార, త్రిష, రెజీనా, తమన్నా.. ఇలా కొందరు హీరోయిన్లు ఆల్రెడీ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో తన పేరును కూడా లిఖించుకున్నారు హీరోయిన్ హన్సిక. హరి–హరీష్ ద్వయం దర్శకత్వం వహించబోయే ఓ హారర్ కామెడీ సినిమాలో లీడ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్æఇచ్చారీ బ్యూటీ. ఈ చిత్రంలో హన్సిక పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. ఇండియన్ టీమ్ మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. డిసెంబరులో చిత్రీకరణ ప్రారంభించి వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు చిత్రబృందం. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చిత్రీకరణలో భాగంగా ముంబైలో ఉన్నారట హన్సిక. ‘పిల్ల జమీందార్’, ‘భాగమతి’ చిత్రాల దర్శకుడు జి. అశోక్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకుడని తెలిసింది. -
డబుల్ యాక్షన్
‘జీన్స్’ సినిమాలో ఐశ్వర్యా రాయ్ ద్విపాత్రాభినయం చేశారు. అయితే నటించింది ఒక్క పాత్రలోనే. రెండు పాత్రలూ చేసినట్టు కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో మ్యాజిక్ చేశారు. కానీ ఈసారి నిజంగానే ద్విపాత్రాభినయం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వమ్’. తమిళ ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వమ్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్ నెగటివ్ షేడ్స్‌లో కనిపిస్తారని తెలిసిందే. తాజాగా ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలిసింది. చోళుల నాశనాన్ని కోరుకునే రాణి నందినిగా ఐష్ నటిస్తారు. అలానే నందిని తల్లి మందాకిని అనే మూగ పాత్రలోనూ కనిపిస్తారట. ‘నా కెరీర్లోనే చాలెంజింగ్ సినిమా ఇది’ అంటూ ఐష్ ఈ సినిమా గురించి ఆల్రెడీ పేర్కొన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, నయనతార, కీర్తీ సురేశ్, అనుష్క, అమలా పాల్, పార్తిబన్ ముఖ్య పాత్రల్లో నటిస్తారని సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. -
మరోసారి విలన్‌గా..
ఇటీవల తెలుగులో విడుదలైన ‘ఎవరు’ సినిమాలో సమీర పాత్రలో రెచ్చిపోయారు రెజీనా. నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో రెజీనా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా మరోసారి అలాంటి పాత్రనే రెజీనా చేస్తున్నారని తెలిసింది. విశాల్ హీరోగా ఆనంద్ అనే కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. మిలటరీ ఆఫీసర్ పాత్రలో విశాల్, పోలీసాఫీసర్ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కోయంబత్తూరులో జరుగుతోంది. ఈ షెడ్యూల్ దాదాపు ఇరవై రోజులు జరుగుతుంది. నెక్ట్స్ షెడ్యూల్‌ను చెన్నైలో ప్లాన్ చేశారు. -
సుమంత్‌కి మరోవైపు...
సుమంత్ సాఫ్ట్ హీరో. ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్స్ సుమంత్‌కి అలాంటి ఇమేజ్‌నే తెచ్చాయి. ఇప్పుడు తనలో మరో కోణం చూపించడానికి రెడీ అయ్యారు. సుమంత్‌ని నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో మనం చూడబోతున్నాం. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనిల్ శ్రీ కంఠం దర్శకత్వంలో సుమంత్ హీరోగా ‘ఇదం జగత్’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుమంత్ నెగటివ్ షేడ్ రోల్లో కనిపించనున్నారు. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ తన కెరీర్లో చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో సుమంత్ కనిపించనున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఈ పాత్ర ఉంటుంది. ఆడియన్స్ కచ్చితంగా థ్రిల్ అవుతారు. సుమంత్ క్యారెక్టర్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఆగస్ట్ ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. అంజు కురియన్ కథానాయికగా పరిచయం కానున్న ఈ చిత్రంలో శివాజీ రాజా, ‘ఛలో’ ఫేమ్ సత్య, ఆదిత్యా మీనన్, కల్యాణ్, షఫీ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, కో–ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి. -
అలా ఎవరూ చేయలేదు!
నాపై అలా ఎవరూ ఒత్తిడి చేయలేదని అంటోంది నటి ప్రణిత. అమ్మో బాపుగారి బొమ్మో పాట వర్ణణకు పేటెంట్ ఈ సుందరి. గుండరాల్లాంటి కళ్లతో కుర్రకారును ఇట్టే ఆకర్షించే ప్రణితను కథానాయకి పాత్రలు మాత్రం పెద్దగా దరి చేరడం లేదు. తెలుగు చిత్రం అత్తారింటికి దారేదితో సహా చాలా చిత్రాల్లో రెండవ కథానాయకి పాత్రలకే పరిమితం అవుతోంది. తమిళంలో ఉదయన్ చిత్రంలో నాయకిగా పరిచయమైన ప్రణిత ఆ తరువాత శకుని, మాస్ లాంటి కొన్ని చిత్రాల్లో నటించింది. ఇటీవల విడుదలైన ఎనక్కు వాయ్‌ంద అడిమైగళ్ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను చేసింది. ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఒక్కో చిత్రం చేతిలో ఉన్న ప్రణితతో చిట్‌చాట్. ప్ర: తమిళంలో అవకాశాలు తగ్గినట్లున్నాయే? జ: అధిక చిత్రాల్లో నటించాలన్న కోరిక, ఏడాది మొత్తం నటిస్తూ బిజీగా ఉండాలన్న ఆశ నాకు లేవు. నా తల్లిదండ్రులు డాక్టర్లు. వారి కలలు, లక్ష్యం నెరవేర్చే మంచి కూతురిగా ఉండాలనే ఆశిస్తున్నాను. తెలుగు, కన్నడ భాషల్లో నాకు నటిగా మంచి ఆదరణే లభిస్తోంది. అక్కడి చిత్రాలు పూర్తి చేయడానికే టైమ్ సరిపోతోంది. ప్ర: బాలీవుడ్ ఆశ లేదా? అలాంటి ప్రయత్నాలేమైనా చేస్తున్నారా? జ: హిందీ చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి లేదు. అక్కడి వరకూ ఎందుకు మాలీవుడ్ చిత్రాలే చేయలేదు. ప్ర: రోజుకో భాషలో పూటకో కథానాయకి అంటూ కొత్త వారు వస్తున్నారు. వారితో పోటీని ఎలా ఎదుర్కొంటున్నారు? జ: నిజమే పలు భాషల్లో పలువురు నటీమణులు, సాంకేతిక కళాకారులు పరిచ యం అవుతున్నారు. అయితే వాళ్లను ఎం దుకు పోటీగా భావించాలి? ఇక్కడ ఎవరికి ఎవరూ పోటీ కాదు. వారి వారి ప్రతి భ, శ్రమనే ఉన్నతి స్థాయికి చేరుస్తాయి. ప్ర: తెలుగు చిత్రాల్లో గ్లామర్‌కు గేట్లు తెరిచారట? జ: తెలుగులో అధిక గ్లామర్‌ను ఆశిస్తారనే ప్రచారం ఉన్న మాట నిజమే. నాకక్కడ హోమ్లీ ఇమేజ్ ఉంది. గ్లామరస్‌గా నటించమని ఇప్పటి వరకూ నన్నెవరూ ఒత్తిడి చేయలేదు. ప్ర: ఇంకా ఎంత కాలం నటిగా కొనసాగుతారు? జ: అది నా చేతిలో లేదు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలంటూ ఏమీ లేవు. ఈ రోజు మంచిగా గడిచిపోయిందా? అన్నదాని గురించే ఆలోచిస్తాను. ఇక నటిగా అంటారా అభిమానులు ఆదరించే వరకూ నటిస్తాను. ప్ర: ఎలాంటి పాత్రలు చేయాలని కోరుకుంటున్నారు? జ: బాహుబలి చిత్రంలో నటించిన కథానాయికలందరూ నాకిష్టమైన వారే. అదే విధంగా హిందీ చిత్రం బాజీరావ్ మస్తానీలో దీపికాపదుకొణె నటన చాలా నచ్చింది. అలాంటి పాత్రలో నటించాలని కోరుకుంటున్నాను. ప్ర: అవార్డులను ఆశిస్తున్నారా? జ: నాకు అభిమానుల చప్పట్లు, ప్రశంసలు, మంచి విమర్శలే ముఖ్యం. ఉత్తమ నటి అవార్డు లభిస్తే సంతోషమే. అంతే గానీ అవార్డుల కోసమే నటించాలనుకోవడం లేదు. ప్ర: చివరి ప్రశ్న. పెళ్లెప్పుడు చేసుకుంటారు? జ: ఇప్పటి వరకూ పెళ్లి గురించి ఆలోచించలేదు. ఎవరినీ ప్రేమించలేదు. అలాంటి ఆలోచన కూడా లేదు. అమ్మానాన్నలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటాను.