ఆట మొదలైంది | Vishal next Movie is Chakra first look released | Sakshi
Sakshi News home page

ఆట మొదలైంది

Published Tue, Jun 23 2020 12:53 AM | Last Updated on Tue, Jun 23 2020 12:53 AM

Vishal next Movie is Chakra first look released - Sakshi

విశాల్‌

విశాల్‌ హీరోగా ఎం.ఎస్‌. ఆనందన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా కీలక పాత్రలో రెజీనా నటిస్తున్నారు. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌  నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌ పోస్టర్‌ని సోమవారం విడుదల చేశారు. పవర్‌ఫుల్‌ లుక్‌లో విశాల్‌ ఉన్న ఈ పోస్టర్‌కి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం తెలిపింది.

‘చక్ర’ గ్లింప్స్‌ ఆఫ్‌ ట్రైలర్‌ పేరుతో ‘ఆట మొదలైంది’ అని విశాల్‌ చెప్పే డైలాగ్‌తో వీడియోను కూడా విడుదల చేశారు. ‘‘బ్యాంక్‌ దోపిడీ, సైబర్‌ క్రైమ్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో కొత్త కథా కథనాలతో ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. మనోబాలన్, రోబో శంకర్, కేఆర్‌ విజయ్, సృష్టి డాంగే తదితరులు  నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, కెమెరా: బాలసుబ్రమణ్యం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement