chakra
-
‘అలా నటించడం ఆనందంగా ఉంది’
తమిళ సినిమా: అలా నటించడం చాలా ఆనందంగా ఉందని అంటోంది నటి రెజీనా. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ హీరోయిన్గా నటించడమే కాకుండా విలనిజాన్ని కూడా ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా రెజీనా ప్రతినాయకిగా నటించిన చిత్రం చక్ర. విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రెజీనా ప్రతినాయకిగా జీవించారనే చెప్పాలి. ఈ సందర్భంగా చక్ర చిత్రంలో నటించిన అనుభూతిని రెజీనా సోమవారం మీడియాతో పంచుకున్నారు. లాలా పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు ఆనందన్ తనను రెండుసార్లు కలిసి కథను వినిపించారన్నారు. ఆ తరువాత ఛాయాగ్రాహకుడు బాలసుబ్రమణ్యన్ ఫోన్ చేసి ప్రతినాయకి పాత్రలో మీరు నటిస్తే బాగుంటుందని చెప్పారన్నారు. అలా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించానని తెలిపారు. పాత్ర, కథ నచ్చితే వైవిధ్యభరిత పాత్రల్లో నటించడానికి సిద్ధమేనని తెలిపారు. ప్రస్తుతం తమిళంలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఒక వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తున్నానని చెప్పారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో నెంజం మరప్పదిల్లై చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన తెలుగు చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. చదవండి: 'సర్కారు వారి పాట' నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడంటే.. పంచేంద్రియాల నేపథ్యంలో... -
'చక్ర' మూవీ రివ్యూ!
చిత్రం: ‘విశాల్ చక్ర’; తారాగణం: విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసండ్రా, కె.ఆర్. విజయ, మనోబాల; మాటలు: రాజేశ్ ఎ. మూర్తి; సంగీతం: యువన్ శంకర్ రాజా; కెమేరా: కె.టి. బాలసుబ్రమణ్యం; ఎడిటింగ్: త్యాగు; నిర్మాణం: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ; రచన – దర్శకత్వం: ఎం.ఎస్. ఆనందన్; నిడివి: 131 నిమిషాలు; రిలీజ్: ఫిబ్రవరి 19. కొనుగోళ్ళ దగ్గర నుంచి ఇంటి సర్వీసుల దాకా ప్రతీదీ ఆన్లైన్, ఇంటర్నెట్ బేస్డ్ అయిపోయాక డిజిటల్ ప్రపంచంలో మన సమాచారం అంతా ఇట్టే లీకయ్యే ప్రమాదం తలెత్తింది. వైరస్ కన్నా వైర్లెస్ నెట్వర్క్ ప్రమాదమైందనే అంశాన్ని తీసుకొని, హ్యాకింగ్‌ను జతచేసి, క్రైమ్నూ, ఇన్వెస్టిగేషన్నూ కలిపితే? ఇలాæ చాలా లెక్కలు వేసుకొని కథ వండి, వడ్డిస్తే – అది ‘విశాల్ చక్ర’. కథేమిటంటే..: మిలటరీ ఆఫీసర్ సుభాష్ చంద్రబోస్ అలియాస్ చంద్రు (విశాల్) కుటుంబం మూడు తరాలుగా దేశం కోసం రక్తం ధారపోసిన కుటుంబం. అతని తండ్రి దివంగత మిలటరీ అధికారి. అశోక చక్ర పతకం పొందిన వీర జవాను. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే నగరంలో కాసేపట్లో 50 చోరీలు జరిగి, దాదాపు రూ. 7 కోట్ల విలువైన నగలు, డబ్బు పోతాయి. చంద్రు ఇంట్లో అతని నాయనమ్మ (కె.ఆర్. విజయ)ను కొట్టి, అశోక చక్ర పతకం కూడా దోచుకుపోతారు – ఇద్దరు ముసుగు దొంగలు. ఆ పతకాన్ని ప్రాణానికి ప్రాణంగా భావించే హీరో ఢిల్లీలోని మిలిటరీ ఆఫీసు నుంచి ఎకాయెకిన హైదరాబాద్ వచ్చేస్తాడు. ఆ కేసును పోలీసాఫీసరైన హీరో ప్రేయసి (శ్రద్ధా శ్రీనాథ్) డీల్ చేస్తుంటుంది. ఆ ఇద్దరూ కలసి, ఆ డిజిటల్ హ్యాకింగ్, సైబర్ క్రైమ్ స్టోరీని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. ఇంతకీ, ఆ నేరాలకు పాల్పడింది ఎవరు? ఎందుకు చేశారు? ఎలా చేశారు? అన్నది మిగతా కథ. ఎలా చేశారంటే..: నటన కన్నా విశాల్ ఎప్పటిలానే యాక్షన్ సీన్ల మీద, హీరోయిజమ్ మీద ఆధారపడ్డారు. వాటికే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రత్యర్థిగా రెజీనా కసండ్రా విలక్షణంగా కనిపించారు. కానీ, ఆ పాత్రకు కథలో కొంత బిల్డప్పూ ఎక్కువే ఇచ్చారు. పోలీసు అధికారిగా శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర కూడా అంతే. సీనియర్ నటి కె.ఆర్. విజయది చాలా చిన్న పాత్ర. ఎలా తీశారంటే..: డిజిటల్ క్రైమ్‌గా మొదలై, చివరకు ఆర్డినరీ విలన్ – హీరో ఎత్తులు పైయెత్తుల క్రైమ్ స్టోరీగా మారిపోతుందీ సినిమా. తొలి చిత్ర దర్శకుడైన ఎం.ఎస్. ఆనందన్ ఈ చిత్ర కథ, దానికి ప్రాతిపదిక బలంగా రాసుకున్నట్టు కనిపించదు. దానివల్ల సినిమా మొదట్లో కాసేపు – ఆ తరువాత ఛేజింగులు, హీరో విలన్ల మధ్య ఇంటెలిజెంట్ గేమ్ మరికాసేపు – ఆసక్తిగానే ఉన్నా, ఆ తరువాత రిపీట్ సీన్లు చూస్తున్న ఫీలింగ్ ఆడియన్స్‌కు వస్తుంది. నిజానికి, ఫస్టాఫ్ కాస్తంత వేగంగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది. కానీ, సెకండాఫ్ లో సినిమా వేగం తగ్గింది. కథ అక్కడక్కడే తిరుగుతుంది. విలన్ ఎందుకు ఈ దొంగతనాలు, దోపిడీలు చేయిస్తోందన్నదానికి సరైన ప్రాతిపదిక ఉన్నట్టు కనిపించదు. అలాగే, ఇంట్లోవాళ్ళ మీద కోపం సరే... సమాజం మీద విలన్ ఆగ్రహానికి లాజిక్ చూపలేదు. సవతి తమ్ముళ్ళను అలా మార్చడమూ అంతే. ఇక, విలన్ ఎత్తులు పైయెత్తులు వేస్తుందనడం కోసమో ఏమో కానీ – చదరంగం ఆటను బలవంతంగా తెర మీదకు తెచ్చారు. తమిళనాట నటుడు విశాల్‌కు ఉన్న రాజకీయ ఉద్దేశాల ప్రకటన కోసమో ఏమో, పొలిటికల్ పంచ్ డైలాగ్స్ కూడా విస్తతంగా సన్నివేశాల్లో ఇరికించారు. అంతా అయిపోయాక, గేమ్ జస్ట్ బిగిన్స్ అంటూ సీక్వెల్ వస్తుందనే భయమూ పెట్టారు. పోలీసు వ్యవస్థకూ, మిలటరీ అధికారి తెలివితెటలకూ ముడిపెడుతూ, హద్దులు చెరిపేసే కథగా ‘విశాల్ చక్ర’ గుర్తుండిపోతుంది. అధికారికంగా ప్రకటించకపోయినా, గతంలో బాగా ఆడిన విశాల్ ‘అభిమన్యుడు’ (తమిళంలో ‘ఇరుంబు తిరై’ – 2018)తో ఈ సినిమాకూ, కథకూ పోలికలు కనిపిస్తాయి. అయితే, ఆదరణలోనూ మళ్ళీ ఆ ఛాయలు కనపడతాయా అన్నది అనుమానమే! కొసమెరుపు: ఆగక సాగే ఛేజులు, ఛాలెంజ్‌లతో (బుర్ర) గిర్రున తిరిగే చక్రం! బలాలు: ♦గత హిట్టయిన ‘అభిమన్యుడు’ (2018) చిత్ర ఫార్ములా ఛాయలు ♦చకచకా సాగే ఫస్టాఫ్ ♦నేపథ్యగీతం మినహా పాటలు లేకపోవడం బలహీనతలు: ∙ ♦వీక్ అండ్ ప్రిడిక్టబుల్ స్టోరీ ♦సెకండాఫ్ ♦కథనంలో లోపాలు ♦కథకు అడ్డుపడే పొలిటికల్ పంచ్‌లు రివ్యూ: రెంటాల జయదేవ -
అప్పుడే విజిల్ వేయాలనిపించింది: విశాల్
‘‘చక్ర’ సినిమాలో హీరో ఫాదర్‌కి కేంద్ర ప్రభుత్వం అశోక చక్ర అవార్డు ఇస్తుంది.. కొంత మంది దుండగులు దాన్ని దొంగలిస్తారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఒక సైనికుడు దాన్ని ఎలా చేధించాడు? అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. అందుకే ‘చక్ర’ టైటిల్ పెట్టాం’’ అని హీరో విశాల్ అన్నారు. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా రెజీనా కీలకపాత్రలో నటించిన చిత్రం ‘చక్ర’. విశాల్ నటించి, నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ– ‘‘చక్ర’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజువల్స్ చూస్తుంటే ‘అభిమన్యుడు’ సినిమాలాగా అనిపిస్తుంది.. కానీ రెండిటికీ సంబంధం లేదు. ఆనందన్ కథ చెబుతున్నప్పుడే విజిల్స్ వేయాలనిపించింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజెప్పే చిత్రమిది. యువన్ శంకర్‌రాజాతో నా 10వ సినిమా ‘చక్ర’. నా తర్వాతి రెండు చిత్రాలకు కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం ఆర్యతో కలిసి ‘ఎనిమీ’ అనే సినిమా చేస్తున్నాను. నా డైరెక్షన్లో ‘అభిమన్యుడు–2’ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత శరవణన్ అనే ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్‌తో ఓ సినిమా చేస్తా’’ అన్నారు. చదవండి: హీరో విలన్, విలన్ హీరో అయ్యాడు స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్! -
‘విశాల్ చక్ర’ ట్రైలర్ మామూలుగా లేదుగా!
యాక్షన్ హీరో విశాల్, జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘చక్ర’. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్‌తో చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్ర తెలుగు వర్షన్ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (తప్పుడు వార్తలపై రకుల్ గరం) బ్యాంక్ అండ్ హౌజ్ రాబరీ, ఫోన్ హ్యాకింగ్, సైబర్ క్రైమ్ నేపథ్యంలో అత్యుత్తమ టెక్నాలజీతో రూపొందించిన ఈ చిత్రం ‘అభిమన్యుడు’ తరహాలో ఆకట్టుకునే విధంగా ఉంది. అంతేకాకుండా ఈ ట్రైలర్‌ను కూడా ఇంట్రెస్టింగ్గా రూపొందించారు. మిలటరీ ఆఫీసర్‌గా విశాల్ కనిపించడం, యాక్షన్ సీన్లు ఈ ట్రైలర్లో హైలైట్‌గా నిలిచాయి. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, మనోబాలా, రోబో శంకర్, విజయ, సృష్టిడాంగే తదితరులు నటిస్తున్నారు. (ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మీ) Happy to Launch Trailer of @VishalKOfficial’s #Chakra#ChakraTrailer#WelcomeToDigitalIndia https://t.co/ncxiCu2iWr@ReginaCassandra @ShraddhaSrinath @thisisysr @manobalam @srushtiDange @AnandanMS15— Rana Daggubati (@RanaDaggubati) June 27, 2020 -
చక్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
హీరో విశాల్ ఇటీవల సైబర్ క్రైం కథా చిత్రాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు కోలివుడ్ కోడై కూస్తోంది. విశాల్ గతంలో పీస్ మిత్రన్ దర్శకత్వంలో నటించిన ఇరుంబుతిరై చిత్రం మంచి విజయాన్ని సాధించింది. నటి సమంత కథానాయకిగా నటించిన ఈ చిత్రం సైబర్ క్రైం ఇతివృత్తంతో రూపొందిందన్నది తెలిసిందే. కాగా తాజాగా విశాల్ చక్ర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయ నే నిర్మాత. నటి శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎంఎస్ ఆనందన్ దర్శకుడిగా అవుతున్నారు. కాగా ఇది సైబర్ క్రైం రూపొందుతున్న చిత్రం తెలుస్తోంది. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. చదవండి: నన్ను చాలా టార్చర్ చేశారు దీనికి ప్రేక్షకుల మంచి స్పందన వస్తుంది. త్వరలోనే చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు విశాల్ తెలిపారు. కాగా ఆయన చక్ర చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విశాల్ మంగళవారం విడుదల చేశారు. చిత్రాన్ని లాక్డౌన్ ముగిసిన తర్వా త తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా తుప్పరివాలన్ 2 చి త్రం లోనూ విశాల్ నటిస్తూ సొంతంగా నిర్మిస్తున్నారు. మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. కాగా షూటింగ్ మధ్యలో దర్శకుడు మిష్కిన్, విశాల్‌కు మధ్య విభేదాలు తలెత్తడంతో తుప్పరివాలన్ 2 చిత్రాని కి సమస్యలు తలెత్తాయి. అయితే ఇ ప్పుడు ఈ చిత్ర దర్శకత్వం బాధ్యతలు కూడా విశాల్ చేపట్టి పూర్తి చేయడానికి సిద్ధం అయ్యారు. ఇది 2017 విశాల్ న టించిన తుప్పరివాలన్ చిత్రానికి సీక్వెల్. చదవండి: బాలీవుడ్‌కు సూర్య చిత్రం? -
ఆట మొదలైంది
విశాల్ హీరోగా ఎం.ఎస్. ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా కీలక పాత్రలో రెజీనా నటిస్తున్నారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ పోస్టర్ని సోమవారం విడుదల చేశారు. పవర్ఫుల్ లుక్‌లో విశాల్ ఉన్న ఈ పోస్టర్‌కి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం తెలిపింది. ‘చక్ర’ గ్లింప్స్ ఆఫ్ ట్రైలర్ పేరుతో ‘ఆట మొదలైంది’ అని విశాల్ చెప్పే డైలాగ్‌తో వీడియోను కూడా విడుదల చేశారు. ‘‘బ్యాంక్ దోపిడీ, సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో కొత్త కథా కథనాలతో ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. మనోబాలన్, రోబో శంకర్, కేఆర్ విజయ్, సృష్టి డాంగే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: బాలసుబ్రమణ్యం. -
భక్తిప్రపత్తులతో చక్రతీర్థం
కోరుకొండ : కోరుకొండ దేవుని కోనేరులో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ చక్రపెరుమాళ్ళ స్వామిల చక్రతీర్థం వందలాది మంది భక్తుల సమక్షంలో ఆదివారం వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించాక రెండు పల్లకీలలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ పద్మనాభ స్వామి వార్లను, శ్రీ చక్రపెరుమాళ్ళు స్వామిని మంగళవాయిద్యాలతో వేలాది మంది భక్తులు అనుసరించగా గిరి ప్రదక్షణ చేస్తూ కోనేరు వద్దకు తీసుకెళ్ళారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం జరిపి చక్రతీర్థం నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్పీ రంగరాజభట్టర్, ఎస్పీ శ్రీ వాత్సవభట్టర్ స్వామి, అర్చకులు పెద్దింటి రంగాప్రసాద్, వాడపల్లి కిరణ్‌చక్రవర్తి, పాణింగిపల్లి సత్యపవన్‌ఆచార్య, డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, ఎస్ఐ ఆర్.మురళీమోహన్, సర్పంచ్ కటకం అన్నపూర్ణచలం, అన్నవరం దేవస్థానం అధికారులు జగన్నాథరాజు, ప్రసాద్, తులారాం, టీఎన్ రాంజీ, ఎన్వీ రమణ తదితరులు పాల్గొన్నారు. చక్రతీర్థంలో ఉపయోగించిన నీటిలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామి వార్లను ఆలయానికి పల్లకీలలో తీసుకువస్తుండగా గ్రామస్తులు రోడ్డును పసుపునీళ్ళతో కడిగి, ముగ్గులు వేసి స్వామిని దర్శించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.