‘విశాల్‌ చక్ర’ ట్రైలర్‌ మామూలుగా లేదుగా! | Vishal Chakra Movie Official Telugu Trailer Launched By Rana | Sakshi
Sakshi News home page

విశాల్‌ చక్ర ట్రైలర్‌ విడుదల

Published Sat, Jun 27 2020 8:20 PM | Last Updated on Sat, Jun 27 2020 8:20 PM

Vishal Chakra Movie Official Telugu Trailer Launched By Rana - Sakshi

యాక్షన్‌ హీరో విశాల్‌, జెర్సీ ఫేమ్‌ శ్రద్దా శ్రీనాథ్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘చక్ర’. ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌తో చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్నడ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్ర తెలుగు వర్షన్‌ ట్రైల‌ర్‌ను రానా ద‌గ్గుబాటి సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. (తప్పుడు వార్తలపై రకుల్‌ గరం)

బ్యాంక్ అండ్ హౌజ్‌ రాబ‌రీ, ఫోన్ హ్యాకింగ్‌, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్తమ టెక్నాలజీతో రూపొందించిన ఈ చిత్రం ‘అభిమన్యుడు’ తరహాలో ఆకట్టుకునే విధంగా ఉంది. అంతేకాకుండా ఈ ట్రైలర్‌ను కూడా ఇంట్రెస్టింగ్‌గా రూపొందించారు. మిలటరీ ఆఫీసర్‌గా విశాల్‌ కనిపించడం, యాక్షన్‌ సీన్లు ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, మనోబాలా, రోబో శంకర్‌, విజయ, సృష్టిడాంగే తదితరులు నటిస్తున్నారు. (ఉదయభాను ఛాలెంజ్‌ స్వీకరించిన బ్రహ్మీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement