Regina Cassandra Chakra, ‘అలా నటించడం ఆనందంగా ఉంది’ | Regina Cassandra As Villain In Chakra Movie - Sakshi

‘అలా నటించడం ఆనందంగా ఉంది’

Feb 23 2021 6:33 AM | Updated on Feb 23 2021 11:27 AM

Actress Regina About Chakra Movie - Sakshi

తమిళ సినిమా: అలా నటించడం చాలా ఆనందంగా ఉందని అంటోంది నటి రెజీనా. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించడమే కాకుండా విలనిజాన్ని కూడా ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా రెజీనా ప్రతినాయకిగా నటించిన చిత్రం చక్ర. విశాల్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో రెజీనా ప్రతినాయకిగా జీవించారనే చెప్పాలి. ఈ సందర్భంగా చక్ర చిత్రంలో నటించిన అనుభూతిని రెజీనా సోమవారం మీడియాతో పంచుకున్నారు. లాలా పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు ఆనందన్‌ తనను రెండుసార్లు కలిసి కథను వినిపించారన్నారు.

ఆ తరువాత ఛాయాగ్రాహకుడు బాలసుబ్రమణ్యన్‌ ఫోన్‌ చేసి ప్రతినాయకి పాత్రలో మీరు నటిస్తే బాగుంటుందని చెప్పారన్నారు. అలా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించానని తెలిపారు. పాత్ర, కథ నచ్చితే వైవిధ్యభరిత పాత్రల్లో నటించడానికి సిద్ధమేనని తెలిపారు. ప్రస్తుతం తమిళంలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఒక వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తున్నానని చెప్పారు. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నెంజం మరప్పదిల్‌లై చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన తెలుగు చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు.

చదవండి:
'సర్కారు వారి పాట' నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఎక్కడంటే..
పంచేంద్రియాల నేపథ్యంలో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement