
కోలీవుడ్ నటుడు ప్రేమ్‌గీ అమరేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ మూవీ ది గోట్ రిలీజ్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే 2026 ఎన్నికల్లో దళపతి విజయ్ తమిళనాడు సీఎం అవుతారని అమరేన్ జోస్యం చెప్పారు. నా ఓటు కూడా విజయ్‌కే వేస్తానని.. తప్పకుండా 2026లో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని హామీ ఇస్తున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కాగా.. దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)'ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రేమ్‌గీ స్నేహాకు సోదరుని పాత్రలో నటించినట్లు ఆయన తెలిపారు. తనకు తలైవా, సూపర్‌స్టార్ రజినీకాంత్ అంటే విపరీతమైన అభిమానం అని వెల్లడించారు. అజిత్, విజయ్‌లంటే అమితమైన ప్రేమ అని.. కానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్ స్టార్ మాత్రమేనన్నారు.

కాగా.. 'గోట్' చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అయితే విజయ్ ఇప్పటికే తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2026లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment