రూ. 2వేల కోట్ల డ్రగ్స్‌ కేసులో సినీ నిర్మాత అరెస్ట్‌ | Movie Producer Arrested In Drugs Case | Sakshi
Sakshi News home page

రూ. 2వేల కోట్ల డ్రగ్స్‌ కేసులో సినీ నిర్మాత అరెస్ట్‌

Mar 9 2024 2:21 PM | Updated on Mar 9 2024 2:53 PM

Movie Producer Arrested In Drugs Case - Sakshi

డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసులో తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ సభ్యుడు జాఫర్‌ సాదిక్‌ అరెస్ట్‌ అయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన్ను తాజాగా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (NCB) అరెస్ట్‌ చేసింది. రూ. 2000 కోట్ల డ్రగ్స్ రాకెట్‌లో ఆయన ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ఈ డ్రగ్స్‌ నెట్‌వర్క్ భారతదేశం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలకు విస్తరించినట్లు పోలీసులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం తమిళనాడులో భారీ ఎత్తున డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని శ్రీలంకకు స్మగ్లింగ్‌ చేసేందుకు యత్నిస్తుండగా అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. అరెస్ట్‌ అయిన వారి నుంచి తీగ లాగితే ఈ అంతర్జాతీయ డ్రగ్స్‌ దందా బయటపడింది. వీరి వెనుక జాఫర్‌ సాదిక్‌ ఉన్నట్లు తేలడంతో ఆయనపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. దీంతో తాజాగా ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేశాడు.

సాదిక్‌ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన వ్యక్తి. డీఎంకే ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందని ఆఫీస్‌ బేరర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డ్రగ్స్‌ ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన్ను పార్టీ నుంచి తొలగించడం జరిగింది. కోలీవుడ్‌లో ఆయన ఇప్పటి వరకు నాలుగు సినిమాలు నిర్మించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement