డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అరెస్ట్ | Abhishek Telugu Actor Arrested In Drugs Case, Know Full Details About This Case In 2012 | Sakshi
Sakshi News home page

Abhishek Drugs Case: ఇన్నాళ్లకు దొరికాడు.. అరెస్ట్ చేశారు

Published Fri, Sep 27 2024 7:40 AM | Last Updated on Fri, Sep 27 2024 9:16 AM

Abhishek Telugu Actor Arrested In Drugs Case

డ్రగ్స్ కేసు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. కొన్నిరోజుల క్రితం బెంగళూరులో రేవ్  పార్టీలో నటి హేమ దొరికింది. ఈమెని పోలీసులు అరెస్ట్ చేసి కొన్నిరోజులు జైల్లో కూడా ఉంచారు. ఈమె కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చారు. గతంలో పలుమార్లు ఇండస్ట్రీలో డ్రగ్స్ విషయమై ఎప్పటికప్పుడు కేసులు నడిచాయి. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)

కేసు ఏంటి?
ఐతే, నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కాళిదాసు తదితర సినిమాల్లో నటించిన అభిషేక్.. 2012 డిసెంబరులో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. శ్రీనివాసులు అనే వ్యక్తితో కలిసి కారులో వెళ్తున్న సమయంలో పోలీసులు చెక్ చేయగా 10 ప్యాకెట్ల కొకైన్ దొరికింది. దీంతో అరెస్ట్ చేశారు. ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. అప్పట్లోనే బెయిల్ వచ్చింది కానీ బయటకొచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి గోవాకు మకాం మార్చాడు. రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టారు.

అంతా బాగానే ఉంది కానీ డ్రగ్స్ కేసులో కోర్టు విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన తెలంగాణ న్యాబ్ పోలీసులు.. గోవాలో అభిషేక్‌ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇతడి స్వస్థలం ఉత్తరప్రదేశ్. కానీ తెలుగు సినిమాల్లో నటుడిగా బాగా ఫేమస్ అయ్యాడు.

(ఇదీ చదవండి: హీరో పునీత్‌కు గుడి కట్టిన వీరాభిమాని)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement