సౌత్ ఇండియా ప్రముఖ నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి (కే.పీ చౌదరి) ఆత్మహత్య చేసుకున్నాడు. ‘కబాలి’ తెలుగు వర్షన్‌కు నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, గతేడాదిలో డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు ఆయన్ను పట్టుకున్నారు. దీంతో చిత్ర పరిశ్రమలో కూడా తీవ్రమైన అలజడి నెలకొంది. ఆ సమయంలో టాలీవుడ్‌కు చెందిన పలువురి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. 2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి కబాలి చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ క్రమంలో సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కే.పీ చౌదరి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాడని, అప్పులు ఇచ్చిన వారి నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. మూడున్నరేళ్ల పాటు సినీమా రంగంలో ఉన్నాడు. ఇందులో నష్టాలు రావడంతో డ్రగ్స్ సరఫరాను ఆయన ఎంచుకున్నారు. గోవాలో ఓహెచ్ఎం పబ్‌ను ప్రారంభించిన కేపీ చౌదరీ సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. హైదరాబాద్ నుంచి గోవా వచ్చే స్నేహితులు, సెలెబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేశారు.
అయితే, పబ్బులో నష్టాలు రావడంతో హైదరాబాద్ తిరిగొచ్చారు. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా బొనకల్ మండలంగా గతంలో పోలీసులు తెలిపారు. బీటెక్ చదివిన చౌదరి గతంలో పూణె ఏరోనాటికల్‌లో డైరెక్టర్ ఆపరేషన్స్‌గా పనిచేశారు. సినీ ప్రముఖలతో సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరికి సంబంధాలు ఉన్నాయి. గోవాలో నైజీరియన్లతో ఉన్న పరిచయాలతో డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment