Ashu Reddy Reacts On Drugs Case Over KP Chowdary Phone Calls - Sakshi
Sakshi News home page

Ashu Reddy: డ్రగ్స్‌ కేసు విషయంలో వాస్తవం ఇదే..

Published Sat, Jun 24 2023 7:09 AM | Last Updated on Sat, Jun 24 2023 8:22 AM

Ashu Reddy React Drugs Case And Kp Chowdary Phone Calls - Sakshi

తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్‌ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. టాలీవుడ్‌కి చెందిన అషూరెడ్డి పేరు ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె పేరు ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా ఇదే విషయంపై ఆమెమ స్పందించింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ  అషూరెడ్డి ఫైర్ అయింది. డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది.  మీడియాలో పేర్కొన్నట్లు తనకు ఎవరితోనూ డ్రగ్స్‌ సంబంధాలు లేవని చెప్పింది. అవన్నీ తప్పుడు వార్తలని ఆమె కొట్టిపారేసింది.

అవసరమైతే విచారణ ఎదుర్కొంటానని,  సంబంధిత ఆధికారులకు వాస్తవమేమిటో తెలియచేస్తానని తెలిపింది.  కానీ తన ఫోన్ నంబర్‌ను అనుమతి లేకుండా బహిరంగంగా ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరికలు చేసింది.

(ఇదీ చదవండి: బోల్డ్‌ సీన్స్‌ అందరూ చూస్తున్నారు, ఎందుకు సిగ్గుపడటం?)

కానీ వందల ఫోన్‌ కాల్స్‌ కృష్ణ ప్రసాద్ చౌదరితో (కేపీ చౌదరి)  మాట్లాడడంతో అషూరెడ్డికి ఈ డ్రగ్స్ అమ్మకం గ్యాంగ్‌తో ఏమైనా పరిచయాలు ఉన్నాయా? అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ కోణంలో కూడా ప్రస్తుతానికి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కానీ అషూరెడ్డితో ఉన్న సంబంధంపై కేపీ చౌదరి నోరు విప్పడంలేదని తెలుస్తోంది. ఆధారాలు గనుక దొరికితే ఆమెను కూడా ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 


(ఇదీ చదవండి: KP Chowdary Drugs Case: అషూరెడ్డితో నిర్మాత వందల ఫోన్‌ కాల్స్‌, ఐటం సాంగ్‌ చేసిన హీరోయిన్‌తో కూడా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement