టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు పెను దుమారం రేపుతుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు సినీ నిర్మాత కేపీ చౌదరి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. కోర్టు అనుమతితో పోలీసులు నిందితుడిని రెండు రోజులు కస్టడీకి తీసుకుని లోతుగా ప్రశ్నించారు. దీంతో అతని ఫోన్‌లోని కాల్స్ లిస్ట్ చూస్తే పోలీసులకే దిమ్మతిరిగే విషయాలు బటయకొస్తున్నాయి. అతని ఫోన్‌లో పలువురి సెలబ్రిటీల ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ వారందరికి అతను డ్రగ్స్ విక్రయించాడా..? అనే కోణంలో విచారణ జరుగుతుంది.
(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి)
తాజాగా ఇలాంటి సమయంలో సినీ నటి సురేఖావాణితో పాటు తన కూతురు సుప్రీత కూడా కేపీ చౌదరితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక పార్టీలో సురేఖా.. అతనికి ముద్దు పెడుతూ ఉన్న ఫోటో వైరల్ కాగా.. మరో ఫోటోలో సుప్రీత కూడా కేపీ చౌదరికి దగ్గరగా ఉంది. దీంతో తల్లీకూతుళ్లు ఇద్దరికీ ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే అతనితో వీరికున్న రిలేషన్ ఏంటి అనేది మిస్టరీగా ఉంది. కేపీ చౌదరి తప్పు చేసినంత మాత్రాన అతనితో ఫోటోలు దిగినవారు కూడా తప్పు చేసి ఉంటారని ఎలా చెబుతారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సురేఖావాణి రెస్పాండ్ అయితే కానీ అసలు విషయం తెలియదు.
(ఇదీ చదవండి: డ్రగ్స్ లిస్ట్‌లో అషూరెడ్డితో పాటు మరో సీనియర్ నటి కూడా..)
Comments
Please login to add a commentAdd a comment