‘విశాల్‌తో ఓకే’ | Vishal Ropes in Shraddha Srinath for Irumbuthirai Sequel | Sakshi
Sakshi News home page

‘విశాల్‌తో ఓకే’

Published Wed, May 15 2019 10:13 AM | Last Updated on Wed, May 15 2019 10:13 AM

Vishal Ropes in Shraddha Srinath for Irumbuthirai Sequel - Sakshi

విశాల్‌తో రొమాన్స్‌ చేసే అవకాశాన్ని నటి శ్రద్ధాశ్రీనాథ్‌ సొంతం చేసుకున్నారు‌. ఈ కన్నడ భామ కోలీవుడ్‌లో విక్రమ్‌వేదా చిత్రంతో ఎంట్రీ ఇచ్చి  తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ చిత్రం విజయంతో ఈ అమ్మడికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇటీవల అరుళ్‌నిధితో జతకట్టిన కే 13 చిత్రం కూడా సక్సెస్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం అజిత్‌తో కలిసి నేర్కొండ పార్వై చిత్రంలో నటిస్తున్నారు. ఇది హిందీలో సూపర్‌హిట్‌ అయిన పింక్‌ చిత్రానికి రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఆగస్ట్‌ 10న చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్య టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి నానీకి జంటగా జెర్సీ చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు.కాగా ఇప్పుడు నటుడు విశాల్‌తో నటించే అవకాశాన్ని అందుకుంది. విశాల్‌ నటించిన అయోగ్య చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ప్రస్తుతం ఆయన సుందర్‌.సీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో తమన్నా నాయకిగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో చిత్రానికి రెడీ అయిపోతున్నారు.

విశాల్‌ ఇంతకు ముందు కథానాయకుడిగా నటించి, నిర్మించిన ఇరుంబుతిరై చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. పీఎస్‌.మిత్రన్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నటి సమంత కథానాయకిగా నటించారు. దానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలోనే నటి శ్రద్ధాశ్రీనాథ్‌ విశాల్‌తో రొమాన్స్‌కుసై అన్నారు. ఈ విషయాన్ని తనే ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ చిత్రం ద్వారా ఆనంద్‌ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు ఎళిల్‌ శిష్యుడు.

ఇకపోతే నటుడు విశాల్‌ ఈ సినిమాలో పోలీస్‌అధికారిగా నటించబోతున్నట్లు, నటి శ్రద్ధాశ్రీనాథ్‌ కూడా పోలీస్‌అధికారిగా పవర్‌ఫుల్‌ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇందులో ఈ అమ్మడు పలు యాక్షన్‌ సన్నివేశాల్లోనూ నటించనుందని తెలిసింది. సుందర్‌.సీ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసి విశాల్‌ ఇరుంబుతిరై–2లో పాల్గొననున్నట్లు సమాచారం. ఆ తరువాత మిష్కిన్‌ దర్శకత్వంలో తుప్పరివాలన్‌–2 చిత్రం చేస్తారని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement