
వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’ సినిమాలో సిక్స్‌ప్యాక్ దేహంతో కనిపించ నున్నారు. నారా రోహిత్, రెజీనా జంటగా రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో పవన్ మల్లెల దర్శకత్వంలో బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీవినోద్ నందమూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.
నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్, రొమాన్స్, మంచి పాటలతో ఆసక్తికరంగా సాగే చిత్రమిది. పవన్ మల్లెల పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కించారు. నారా రోహిత్ గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. పృధ్వీ, ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబు కామెడీ ట్రాక్ అలరిస్తుంది. రమ్యకృష్ణ ఇందులో పవర్‌ఫుల్ రోల్‌లో నటించారు. మణిశర్మగారి సంగీతం, నేపథ్య సంగీతం పెద్ద ఎసెట్. ఈ నెలాఖరులో పాటలు రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: డి.యోగానంద్.
Comments
Please login to add a commentAdd a comment