మేలో ‘మిస్టర్‌ చంద్రమౌళి’ | Mr Chandramouli team in Thailand for a song shoot | Sakshi
Sakshi News home page

మేలో ‘మిస్టర్‌ చంద్రమౌళి’

Published Tue, Mar 20 2018 4:59 AM | Last Updated on Tue, Mar 20 2018 4:59 AM

Mr Chandramouli team in Thailand for a song shoot - Sakshi

థాయ్‌ల్యాండ్‌లో చిత్ర యూనిట్‌

తమిళసినిమా: సీనియర్‌ నటుడు కార్తీక్, ఆయన కుమారుడు గౌతమ్‌కార్తీక్‌ కలిసి నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్‌ చంద్రమౌళి. ఈ సినిమా మేలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. వరలక్ష్మీశరత్‌కుమార్, రెజీనా  హీరోయిన్లుగా నటిస్తున్నారు.  తిరు దర్శకత్వంలో, బాప్టా మీడియా వర్క్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సమర్పణలో క్రియేటీవ్‌ ఎంటర్‌టెయినర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం గురించి నిర్మాత ధనుంజయన్‌ తెలుపుతూ షెడ్యూల్‌ ప్రకారమే చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిందన్నారు.

నాలుగు పాటల్లో ఇప్పటికే రెండు పాటలను చిత్రీకరించామన్నారు. మరో రెండు పాటల  కోసం చిత్ర యూనిట్‌ థాయ్‌ల్యాండ్‌కు వెళ్లిందన్నారు. కాగా ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుగుతున్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్ర ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్‌ సంస్థ సొంతంచేసుకుందన్నారు. ఏప్రిల్‌ రెండో వారంలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నామని, మేలో చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్ల డించారు. ఈ చిత్రానికి శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement