కార్తీక్, రెజీనా, గౌతమ్ కార్తీక్
కార్తీక్ ఒకప్పటి లవర్‌బాయ్. ‘అభినందన’ సినిమా ఒక్కటి చాలు.. కార్తీక్‌ని గుర్తు చేయడానికి. ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న కార్తీక్ ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. మణిరత్నం ‘కడలి’ చిత్రం ద్వారా ఆయన తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా పరిచయమయ్యాడు. విశేషం ఏంటంటే.. ఈ తండ్రీ కొడుకులిద్దరూ ‘మిస్టర్ చంద్రమౌళి’ అనే సినిమాలో నటిస్తున్నారు. టైటిల్ రోల్ తండ్రి చేశారా? కొడుకా? అన్నది ఏప్రిల్‌లో తెలిసిపోతుంది.
ఇంకో విషయం ఏంటంటే.. అసలు చంద్రమౌళి మనిషి కాదనే వార్త కూడా హల్‌చల్ చేస్తోంది. రిలీజ్ డేట్ ఎనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో టైటిల్ లోగో కింద కారు సింబల్ ఉండటంతో ఈ సినిమా కథ అంతా కారు చూట్టూ తిరుగుతుందనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఆ కారు పేరు చంద్రమౌళి అన్నది కొందరి ఊహ. అన్ని ఊహలకు ఏప్రిల్ 27న సమాధానం దొరికేస్తుంది. ఆ రోజే ఈ సినిమా విడుదల కానుంది. తిరు కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రెజీనా, వరలక్ష్మీ శరత్‌కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment