Gautam Karthik
-
మీటూ ఆరోపణలపై నమ్మకం లేదు : హీరోయిన్
అచ్చం ఎంబదు మడమయడా చిత్రంతో కోలీవుడ్, టాలీవుడ్ (తెలుగులో సాహసమే శ్వాసగా)లో ఒకే సారి పరిచయమైంది మంజిమా . ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించినా మంజిమామోహన్ కెరీర్ మాత్రం వేగం పుంజుకోలేదనే చెప్పాలి. హిందీ చిత్రం క్వీన్ మలయాళ రీమేక్‌లో కంగనారావత్ పాత్రలో నటించింది. జామ్జామ్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ చిత్ర విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జామ్ జామ్ పాటు మరో మలయాళ చిత్రంలోనూ నటిస్తోంది. ఇక తమిళంలో ప్రస్తుతం ఈ బ్యూటీ గౌతమ్‌కార్తీక్‌తో జత కట్టిన దేవాట్టం చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తాజాగా జీవా, అరుళ్‌నిధి కలిసి నటిస్తున్న చిత్రంలో నాయకిగా నటించబోతోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న మీటూ గురించి ప్రస్తావన తీసుకురాగా, మీటూ కారణంగా చిత్ర పరిశ్రమలో ఏదో మార్పు వచ్చిందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మంజిమామోహన్ బదులిస్తూ దాని గురించి తనకు తెలియదంది. అలాంటి అనుభవం తనకు ఎదురు కాలేదని పేర్కొంది. మీటూ వ్యవహారంలో కొందరి అనుభవాలు నమ్మదగ్గవిగానూ, మరి కొందరి ఆరోపణలు నమ్మశక్యంగానివిగానూ ఉన్నాయని చెప్పింది. చెప్పాలంటే మీటూ ఆరోపణలపై నమ్మకం లేదని పేర్కొంది. తాను షూటింగ్‌కు వచ్చానా, పేకప్ అయ్యిందా, ఇంటికి వెళ్లానా అన్నట్టుగా తన దిన చర్య ఉంటుందని మంజిమామోహన్ అంది. అయినా ఎదిగే దశలో ఉన్న ఈ అమ్మడు ఇంత కంటే ఏం చెబుతుంది. -
మేలో ‘మిస్టర్ చంద్రమౌళి’
తమిళసినిమా: సీనియర్ నటుడు కార్తీక్, ఆయన కుమారుడు గౌతమ్‌కార్తీక్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ చంద్రమౌళి. ఈ సినిమా మేలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. వరలక్ష్మీశరత్‌కుమార్, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తిరు దర్శకత్వంలో, బాప్టా మీడియా వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో క్రియేటీవ్ ఎంటర్టెయినర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం గురించి నిర్మాత ధనుంజయన్ తెలుపుతూ షెడ్యూల్ ప్రకారమే చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిందన్నారు. నాలుగు పాటల్లో ఇప్పటికే రెండు పాటలను చిత్రీకరించామన్నారు. మరో రెండు పాటల కోసం చిత్ర యూనిట్ థాయ్‌ల్యాండ్‌కు వెళ్లిందన్నారు. కాగా ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుగుతున్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్ర ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్ సంస్థ సొంతంచేసుకుందన్నారు. ఏప్రిల్ రెండో వారంలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నామని, మేలో చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్ల డించారు. ఈ చిత్రానికి శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
చంద్రమౌళి మనిషి కాదు!
కార్తీక్ ఒకప్పటి లవర్‌బాయ్. ‘అభినందన’ సినిమా ఒక్కటి చాలు.. కార్తీక్‌ని గుర్తు చేయడానికి. ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న కార్తీక్ ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. మణిరత్నం ‘కడలి’ చిత్రం ద్వారా ఆయన తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా పరిచయమయ్యాడు. విశేషం ఏంటంటే.. ఈ తండ్రీ కొడుకులిద్దరూ ‘మిస్టర్ చంద్రమౌళి’ అనే సినిమాలో నటిస్తున్నారు. టైటిల్ రోల్ తండ్రి చేశారా? కొడుకా? అన్నది ఏప్రిల్‌లో తెలిసిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే.. అసలు చంద్రమౌళి మనిషి కాదనే వార్త కూడా హల్చల్ చేస్తోంది. రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ పోస్టర్లో టైటిల్ లోగో కింద కారు సింబల్ ఉండటంతో ఈ సినిమా కథ అంతా కారు చూట్టూ తిరుగుతుందనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఆ కారు పేరు చంద్రమౌళి అన్నది కొందరి ఊహ. అన్ని ఊహలకు ఏప్రిల్ 27న సమాధానం దొరికేస్తుంది. ఆ రోజే ఈ సినిమా విడుదల కానుంది. తిరు కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రెజీనా, వరలక్ష్మీ శరత్‌కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. -
చంద్రమౌళి ఎవరు?
రాజమౌళి అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుసు. కానీ, తమిళ సినిమాల్లో హూ ఈజ్ మిస్టర్ చంద్రమౌళి? స్క్రీన్‌పై అతని కథ ఏంటి? అంటే.. ఇప్పుడే చెబితే కిక్ ఏముంటుంది? సినిమాకు ఇప్పుడేగా కొబ్బరికాయ కొట్టాం. గుమ్మడికాయ కొట్టి, దిష్టి తీసి థియేటర్లో బొమ్మ వేసేంత వరకూ ఆగండి అంటున్నారు రెజీనా. అయినా చంద్రమౌళితో రెజీనాకు రిలేషన్ ఏంటి? అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. తిరుకృష్ణమూర్తి దర్శకత్వంలో తండ్రి కార్తీక్, తనయుడు గౌతమ్ కార్తీక్, రెజీనా ముఖ్య పాత్రల్లో చేస్తున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ సినిమాకు ‘మిస్టర్ చంద్రమౌళి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని కోలీవుడ్ ఖబర్. -
ఇరట్టు అరైయిల్ మురట్టు కుత్తు ప్రారంభం
తమిళసినిమా: యువ నటుడు గౌతమ్ కార్తీక్ కేరీర్ ఫ్లాప్‌తో మొదలై స్లోగా సక్సెస్ గాడిలో పడింది. కడల్, ఎన్నమో ఏదో చిత్రాలు గౌతమ్కార్తీక్ను అపజయాల్లోకి నెట్టగా రంగూన్, ఇవన్తందిరన్ చిత్రాలు విజయాల బాట పట్టించాయి. ఇటీవల తెరపైకి వచ్చిన హరహర మహాదేవకీ చిత్రం అడల్ట్ చిత్రంగా టాక్ తెచ్చుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా అదే చిత్ర కాంబినేషన్లో మరో చిత్రం శనివారం పూజాకార్యక్రమాలతో మొదలైంది. దీనికి ఇరట్టు అరైయిల్ మురట్టు కుత్తు అనే టైటిల్ నిర్ణయించారు. ఇరట్టు అరైయిల్ మురట్టు కుత్తు అంటే చీకటి గదిలో మొరట్టు గుద్దు అని అర్ధం. హరహర మహాదేవకీ చిత్రం తరువాత కేఇ.జ్ఞానవేల్‌రాజా బ్లూకోస్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో గౌతమ్ కార్తీక్‌కు జంటగా నటించడానికి ఒక ప్రముఖ హీరోయిన్‌తో చర్చలు జరుపుతున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ పీ.జయకుమార్ తెలిపారు. నటుడు రవిమరియ, మొట్ట రాజేంద్రన్, కరుణాకరన్ ముఖ్య పాత్రలను పోషించనున్న ఈ చిత్రానికి తరుణ్బాలాజీ ఛాయాగ్రహణం, బాలమురళీబాల సంగీతం అందిస్తున్నారు. ఇది కూడా అడల్ట్ హరర్ కామెడీ చిత్రంగా ఉంటుందని, చిత్ర షూటింగ్‌ను పూర్తిగా విదేశాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. చిత్ర సింగిల్ ట్రాక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. -
కలిసి వస్తున్నారు!
తమిళసినిమా: నవరసనాయకుడుగా అభిమానులు పిలుచుకునే కార్తీక్, ఆయన కొడుకు యువ నటుడు గౌతమ్‌కార్తీక్ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. బహుభాషా నటుడు కార్తీక్ చాలా గ్యాప్ తరువాత అనేగన్ చిత్రంతో రీఎంట్రి అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత అడపాదడపా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్న కార్తీక్‌ను ఆయన వారసుడు గౌతమ్కార్తీక్ను కలిసి నటింపజేయడానికి చాలా మంది ప్రయత్నించినా మంచి కథ కోసం ఎదురు చూస్తున్నట్లు కార్తీ చెప్పారు. ఇటీవల రంగూన్, ఇవన్ తందిరన్ చిత్రాల విజయాలతో ఫేమ్‌లోకి వచ్చిన గౌతమ్కార్తీక్ను ఆయన తండ్రితో కలిసి నటింపచేసే విషయంలో దర్శకుడు తిరు సఫలమయ్యారు. నాన్ సిగప్పుమనిదన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈయన తయారు చేసుకున్న కథ కార్తీక్‌కు తెగ నచ్చేయడంతో అందులో తన కొడుకు గౌతమ్‌కార్తీక్‌తో కలిసి నటించడానికి పచ్చ జెండా ఊపారట. ఈ విషయాన్ని క్రియేటివ్ ఎంటర్టెయినర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ అధినేత ధనుంజయన్ తెలిపారు. ఈయన నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి తెలుపుతూ నవంబర్‌లో చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నామని చెప్పారు. చిత్రంలో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటించనున్నారని, వారితో పాటు మరి కొందరు నటీనటుల వివరాలను, చిత్ర టైటిల్‌ను త్వరలోనే వెల్లడించనున్నటు చెప్పారు. చిత్ర టైటిల్‌ను ఇప్పటికే రిజిస్టర్ చేశామని, అయితే అదేవిటో గెస్ చేయాల్సిందిగా ప్రేక్షకులకు పజిల్ పెట్టినట్లు తెలిపారు. కరెక్ట్‌గా గెస్ చేసిన వారిలో ఐదుగురిని (ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు)ఎంపిక చేసి చిత్రంలో రెండు మూడు సన్నివేశాల్లో నటించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. -
కష్టకాలంలో అవకాశం ఇచ్చారు
తమిళసినిమా: నిర్మాత జ్ఞానవేల్‌రాజా తనకు కష్టకాలంలో హరహర మహాదేవకీ చిత్రంలో నటిం చే అవకాశం ఇచ్చారని చిత్ర కథానాయకుడు గౌతమ్ కార్తీక్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటి నిక్కీగల్రాణి హీరోయిన్గా నటించింది. తంగం సినిమా పతాకంపై తంగరాజా నిర్మిసు ్తన్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను సంతోష్ పీ.జయకుమార్ నిర్వహిస్తున్నారు. బాలమురళీబాబు సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఆదివారం సాయంత్రం ట్రిప్లికేన్‌లోని కలైవాణర్ ఆవరణలో జరింగింది. కార్యక్రమంలో చిత్ర హీరో గౌతమ్‌కార్తీక్ మాట్లాడుతూ హరహర మహాదేవకీ చిత్ర కథ చాలా మంది వద్దకు వెళ్లి ఆ తరువాత తనను వరించిందని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు సంతోష్ పీ.జయకుమార్ కథ చెప్పడానికి ముందు తనకు పాటలను వినిపించారని, ఆ పాటలను అసాంతం నవ్వుకుంటూనే విన్నానని తెలిపారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు నిర్మాత జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించి ఉత్సాహపరచారని అన్నారు. ఇదే చిత్ర యూనిట్‌తో కలిసి మరో చిత్రం కూడా చేయబోతున్నానని, ఆ చిత్రం గురించి దర్శకుడే వెల్లడిస్తారని గౌతమ్‌మీనన్ అన్నారు. హీరోయిన్ నిక్కీగల్రాణి మాట్లాడుతూ తనకు డార్లింగ్ చిత్రం ద్వారా తమిళంలో అవకాశం ఇచ్చిన జ్ఞానవేల్‌రాజా, హరహర మహాదేవకీ చిత్ర కథ వినమని చెప్పారన్నారు. ఆ తరువాత దర్శకుడు తనకు కథ చెప్పారన్నారు. చిత్ర హీరో గౌతమ్‌కార్తీక్ తనకు మంచి ఫ్రెండ్ అని అంది. తమిళంలో సంభాషణలు చెప్పడం తనకు సరిగా రాకపోవడంతో తనే నేర్పించారని చెప్పారు. హరహర మహాదేవకీ చిత్ర టీమ్‌తోనే తాను స్టూడియో గ్రీన్ పతాకంపై త్వరలో ఇరట్టు అరైయిల్ మొరట్టు కత్తు అనే చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు నిర్మాత జ్ఞానవేల్‌రాజా ఈ సందర్భంగా వెల్లడించారు. -
ప్రేమలో గౌతమ్‌కార్తీక్ ?
తమిళసినిమా: నటి ప్రియాఆనంద్‌తో యువ నటుడు గౌతమ్ కార్తీక్ ప్రేమకలాపాలు అంటూ సోషల్‌మీడియాలో చాలాకాలంగా వదంతులు వైరల్ అవుతున్నాయి. నటుడు కార్తీక్ వారసుడు గౌతమ్‌కార్తీక్. కడల్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన ఈయన తదిపరి చిత్రం వైరాజావై చిత్రంలో ప్రియాఆనంద్ నాయకిగా నటించింది. అప్పటి నుంచే ఈ జంట మధ్య ప్రేమ వ్యవహారం మొదలైందనేది కోడంబాక్కం వర్గాల ప్రచారం. అయితే ఈ విషయం గురించి వీరిద్దరూ పెద్దగా పట్టించుకోలేదు. అప్పట్లో గౌతమ్కార్తీక్గానీ, ప్రియాఆనంద్గానీ ప్రైమ్‌టైమ్‌లో లేరు. కాగా గౌతమ్ కార్తీక్‌కు ఇటీవల రంగూన్, ఇవన్ తందిరన్ చిత్రాలు వరుసగా హిట్‌గా నిలిచాయి. దీంతో ఆయన వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనది కచ్చితంగా ప్రేమ వివాహమే అవుతుందని చెప్పారు. దీంతో ప్రియాఆనంద్‌తో ప్రేమ వ్యవహారం మీడియాలో రచ్చగా మారింది. దీనికి స్పందించిన గౌతమ్‌కార్తీక్ ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి స్నేహంగా ఉండలేరని ప్రజలు నమ్మడం వల్లే ఇలాంటి వదంతులు పుట్టుకొస్తున్నాయన్నారు. నిజానికి తనకు నటి ప్రియాఆనంద్ మంచి స్నేహితురాలు మాత్రమే. అదీగాక తమ ఫ్యామిలిలోనూ స్నేహసంబంధాలు ఉన్నాయని చెప్పారు. అంతేగానీ మా మధ్య ప్రేమ, గీమ వంటిది లేదని స్పష్టం చేశారు. అయితే తనది ప్రేమ వివాహమే అంటున్న గౌతమ్‌కార్తీక్ అసలు ప్రేయసి ఎవరన్న ప్రశ్న ఇప్పుడు కోలీవుడ్‌లో ఉత్పన్నమవుతోంది. -
మణి చిత్రంలో అలియా భట్?
మణిరత్నం... భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఇది. దర్శకుడిగా ఆయన సాధించిన ఘనత అది. సూపర్ స్టార్ రజనీకాంత్, పద్మభూషణ్ కమల్ హాసన్ నుంచి ఈ తరం యువ నటుడు గౌతమ్ కార్తీక్ వరకు ఈయన దర్శకత్వంలో నటించారు. అంతేకాదు టాలీవుడ్, బాలీవుడ్‌లలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన దర్శకరత్నం తాజా చిత్రం ఏమిటన్నది కొంత కాలంగా కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం కడల్. విడుదలై ఏడాదిన్నర దాటింది. గత ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన కడల్ చిత్రం తెరపైకొచ్చింది. అంతే ఇప్పటి వరకు మణిరత్నం తన తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టలేదు. ఇందుకు కారణం ఇటీవల ఆయనకు సరైన విజయం లేకపోవడమేనన్నది ఒక వర్గం భావన. అయితే మణిరత్నం ప్రయత్నాలు కార్యరూపం దాల్చడంలేదన్నది నిజం. ఆ మధ్య టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ నాగార్జున, మహేశ్ బాబు, ఐశ్వర్య రాయ్ బచ్చన్, శృతిహాసన్‌లతో ఒక భారీ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కారణాలేమయినా ఆ చిత్రం సెట్‌పైకి రాలేదు. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్, శ్రుతిహాసన్‌లతో అలైపాయుదే చిత్రం తరహాలో ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం కోసం దుల్కర్ సల్మాన్ నుంచి బల్క్ కాల్షీట్స్ను పొందినట్లు సమాచారం. ఇప్పుడు ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌కు బదులు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను ఎంపిక చేయూలనుకుంటున్నట్టు ప్రచారం జోరందుకుంది. ఇటీవల మణిరత్నం వర్గం ఈ సంచలన నటిని సంప్రదించినట్టు సమాచారం. అయితే అలియాభట్ మేనేజర్ ఈ విషయమై నోరు మెదపడానికి నిరాకరిస్తున్నారు. నటుడు దుల్కర్ సల్మాన్ కూడా ఈ చిత్రానికి సంబంధించిన ఏ విషయాన్నయినా దర్శకుడే వెల్లడించాల్సి ఉంటుందంటున్నారు. చిత్రానికి ఎ.ఆర్.రెహ్మాన్ సంగీత దర్శకుడిగా ఖరారయినట్లు తెలిసింది. ఇతర విషయాల గురించి అధికారిక వార్త ఏమీ లేదు. దుల్కర్ సల్మాన్ అన్నట్లు మణిరత్నం పెదవి విప్పే వరకు ఇలాంటి పసలేని ప్రచారం జరుగుతూనే ఉంటుంది. -
మెగాఫోన్‌పై పట్టు ఏదీ?
తమిళ సినిమా : ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా ఎదుగుతున్నారు. అయితే సినిమా రంగంలో ప్రధాన శాఖ అయిన దర్శకత్వంలో మహిళ ప్రతిభ మెరుగు పడాల్సి ఉంది. మెగాఫోన్ పట్టడంలో ప్రతిభను కనబరచలేకపోతున్నారు. అయితే ఈ శాఖలో సాధించిన వారు కూడా కొందరు ఉన్నారు. ప్రఖ్యాత దివంగత నటీమణులు టి.పి.రాజ్యలక్ష్మి, అష్ఠావధాని పి.భానుమతి రామకృష్ణ, మహానటి సావిత్రి, గిన్నిస్ రికార్డు సాధించిన విజయ నిర్మల వంటి వారు దర్శకులుగా ఎంతగానో సాధించి నేటితరం మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఆ తరువాత తరం మహిళా దర్శకులు మాత్రం అంతగా రాణించలేకపోతున్నారు. సీనియర్ నటీమణులు లక్ష్మీ, శ్రీప్రియ, జయదేవి తదితరులు దర్శకత్వ రంగంలో సాధించడానికి కృషి చేస్తూనే ఉన్నారు. కొందరు మాత్రం ఊహించిన విజయాలు అందకపోవడంతో మెగాఫోన్‌కు దూరమయ్యారు. మరి కొందరు మాత్రం అందులో సక్సెస్ కోసం పోరాడుతూనే ఉన్నారు. సీనియర్ నటీమణులు సుహాసిని ఇందిరా చిత్రంతో, రేవతి మిత్రామై ఫ్రెండ్‌తో, సుష్మా అహుజా ఉయిరుక్కు ఉయిరాగ చిత్రాలతో దర్శకత్వ రంగంలోకి ప్రవేశించినా ఆ చిత్రాలు అంతగా విజయం సాధించకపోవడంతో దర్శకత్వానికి స్వస్తి చెప్పారు. మరి కొందరు మహిళలు కూడా ఇలాంటి నిరాశకు గురయ్యారు. అనితా ఉదిప్ (కుళిర్ 100 డిగ్రీ), రేవతి ఆరు, (జూన్ ఆరు), జానకి విశ్వనాథన్ (కుట్టి), శారదా రామనాథన్ (సింగారం), ప్రియ.వి (కండనాళ్ ముదల్), మధుమిత (వల్లమైతారాయో), సుధ (ద్రోహి), అంజనా (వెప్పం), జె.ఎస్. నందిని (తిరు తిరు తురు తురు) వంటి దర్శకుల్లో చాలా మంది మరో ప్రయత్నం చెయ్యలేకపోయారు. కార ణం ఆ చిత్రాలు విజయాలకు చేరువకాలేకపోవడమే. శారదా విశ్వనాథన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం పుదియ తిరుపుంగళ్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలం అయినా విడుదలకాలేదు. కన్నామూచ్చి ఏనడా చిత్రం తరువాత ప్రియ.వి, కొలకొలయా ముం దిరికా చిత్రం తరువాత మధుమిత తదుపరి ప్రయత్నం చెయ్యలేదు. అదే విధంగా తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ నాన్ ఎన్నుళ్ ఇల్లై చిత్రాన్ని తెరకెక్కించిన సీనియర్ నటి జయచిత్ర ఇప్పటి వరకు మరో చిత్రం చెయ్యలేదు. అలాగే నందకి చిత్ర దర్శకురాలు విజయ పద్మ, చట్టం ఒరు ఇరుట్టరై (రీమేక్) దర్శకురాలు స్నేహ ప్రింటో, చంద్ర చిత్ర దర్శకురాలు రూపా అయ్యర్ తొలి ప్రయత్నంతోనే సరిపెట్టుకున్నారు. మరో ప్రయత్నం కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న లక్ష్మీ రామకృష్ణన్ ఆరోహణం చిత్రంతో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టారు. ఆ చిత్రం పలువురి ప్రశంసలు పొందడంతో ప్రస్తుతం నెరింగి వా ముత్తమిడాదే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 3 చిత్రంతో మెగా ఫోన్ పట్టిన రజనీకాంత్ పెద్దకూతురు నటుడు ధనుష్ భార్య ఐశ్వర్య ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా అనూహ్య ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం గౌతమ్ కార్తిక్ హీరోగా వై రాజా వై చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఆమె సోదరి సౌందర్య తన తండ్రి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కోచ్చడయాన్ చిత్రాన్ని తెరకెక్కించారు. మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డి ఫార్మెట్లో రూపొందిన ఈచిత్రం సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తానంటున్నారామే. అలాగే యువ నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్, భార్య కృతిక తొలి ప్రయత్నంగా వడ చెన్నై చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారు. ఈ చిత్రం మంచి రిజల్ట్‌నే సాధించడంతో ఆమె మరో ప్రయత్నం చేయడానికి సిద్ధం అవుతున్నారు. నటి అంబికా కూడా మలయాళంలో ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడా చిత్రాన్ని నిళరు పేరుతో తమిళంలోకి అనువాదం చేస్తున్నారు. సక్సెస్ కోసం.. దర్శకురాలిగా అవతారమెత్తి సక్సెస్ కోసం వేచి ఉన్న నటీమణుల్లో నటి రోహిణి, బృందా దాస్, షకిల్ తదితరులు ఉన్నారు. నటి రోహిణి అప్పావిన్ మీసై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బృందాదాస్ హాయ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శృంగార తార షకీలా తెలుగు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్ నృత్య దర్శకురాలు, నటుడు ప్రకాష్ రాజ్ భార్య అయిన బోనివర్మ, నటి ఐశ్వర్య, నటుడు విష్ణువిశాల్ అర్ధాంగి రజిని నటుడు పార్తిపన్ కూతురు కీర్తన, నటి సిమ్రాన్, బేబి షాలిని తదితరులు త్వరలో మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారు. ఇలా పలువురు మహిళలు దర్శకత్వంపై ఆసక్తి చూపుతున్నా, సరైన సక్సెస్‌లను రాబట్టుకోలేకపోతున్నారు. అం దుకు కారణం ప్రస్తుతం సినిమా ఖర్చు కోట్లు దాటింది. అలా పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవాలంటే కమర్షియల్ చిత్రాల వల్లే సాధ్యం అవుతుంది. అలాంటి ఫార్ములా చిత్రాలను మహిళా దర్శకత్వంలో సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోందని ఎవరయినా ఆ విధంగా చిత్రం చేసి విజయం సాధిస్తే మహిళా దర్శకుల సంఖ్య మరింత పెరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రేమించడం తెలియదట
సీనియర్ నటుడు కార్తీక్‌ను ఒకప్పుడు లవర్‌బాయ్ అనేవారు. అప్పట్లో హీరోయిన్లు ఆయన్ని పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తూ చుట్టూ తిరిగేవారు. అలాంటి ది ఆయన కొడుకు గౌతమ్ కార్తీక్‌కు ప్రేమించడమే తెలియదట. ఇది కొంచెం అతిగా అనిపించినా నటి రకుల్‌ప్రీతి మాత్రం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గౌతమ్‌కార్తీక్ కడల్ చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించికపోయినా ఈ నవ హీరో మాత్రం యమ ప్రాచుర్యం పొందారు. అంతేకాదు ఈయనకిప్పుడు చేతి నిండా చిత్రాలున్నాయి. ఇటీవల విడుదలైన ఎన్నమో ఏదో చిత్రంలో గౌతమ్ కార్తీక్ సరసన రకుల్ ప్రీతి ఒక హీరోయిన్గా నటించారు. ఈమె ఈ చిత్రంలో నటించిన విషయం గురించి గౌతమ్‌మీనన్‌తో నటించిన అనుభవం గురించి తెలుపుతూ అలా మొదలయ్యిందిలో నిత్యామీనన్ పోషించిన పాత్రను తమిళ రీమేక్‌లో నటించే అవకాశం తనకు లభించిందని చెప్పారు. అలాగే ఈ చిత్ర హీరో యువకుడు గౌతమ్ కార్తీక్ కావడంతో ప్రేమ, దోమ అంటూ వెంటపడతాడని అనుకున్నానని అన్నారు. అలాంటిది ఆయన తనను టచ్ చేయడానికి కూడా భయపడ్డారని తెలిపారు. దీంతో తానే చొరవ తీసుకుని గౌతమ్‌కార్తీక్‌తో సన్నిహితంగా నటించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయనకు ప్రేమించడం ఎలానో తెలియదట. ఆ తరువాత తన తండ్రిని ప్రేమ సన్నివేశాల్లో నటించడం ఎలా? అని అడిగారట. ప్రేమ సన్నివేశాల్లో నటించడానికి భయపడకూడదన్న తండ్రి సలహాతో ఆ సన్నివేశాలలో నటించారని రకుల్ ప్రీతి తెలిపారు. కార్తీక్ ప్రేమ విషయాల గురించి చాలా విన్నానని అలాంటిది ఆయన వారసుడికి ప్రేమించడం తెలియదంటే నమ్మలేకపోయానని రకుల్ ప్రీతి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
గౌతమ్ కార్తీక్‌తో లావణ్య త్రిపాది
మాజీ మిస్ ఉత్తరాఖండ్ లావణ్య త్రిపాదికి కోలీవుడ్‌లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్లో పాగా వేసిన ఈ సుందరికి తమిళంలో శశికుమార్ సరసన బ్రహ్మన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల కాకముందే ఈ బ్యూటీకి మరో అవకాశం తలుపుతట్టింది. పోడాపోడి దర్శకుడు విఘ్నేష్ శివన్ తాజాగా యువ క్రేజీ నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగా చిత్రం చేయనున్నారు. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నానుమ్ రౌడీదాన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించనున్న ఈ చిత్రంలో గౌతం కార్తీక్ సరసన లావణ్య త్రిపాది నటించనున్నారు. ఇందులో ఈ భామ బధిర (వినికిడి శక్తిని కోల్పోయిన) యువతి పాత్రలో నటించనున్నారట. దీని గురించి ఈ పూర్వ మిస్ ఉత్తారాఖండ్ తెలుపుతూ చిత్ర కథ వినగానే ఎంతగానో నచ్చేసిందన్నారు. ఇందులో తాను బధిర యువతిగా నటించనున్నట్లు చెప్పారు. నటనకు అవకాశం ఉన్న పాత్ర అని తెలిపారు. అందులోనూ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించనున్న చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళంలో తన తొలి చిత్రం బ్రహ్మన్ నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయని లావణ్య త్రిపాది చెప్పారు -
నాన్నకు మాదిరి నాకు గర్ల్‌ఫ్రెండ్స్ లేరు
నాన్నకు మాదిరి నాకు గర్ల్‌ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరంటున్నారు సీనియర్ నటుడు కార్తీక్ వారసుడు, కాదల్ హీరో గౌతమ్ కార్తీక్. తొలి చిత్రం కడల్ నిరాశ పరిచినా గౌతమ్ కార్తీక్‌కు పలు అవకాశాలు క్యూకట్టడం విశేషం ప్రస్తుతం ఈ వర్ధమాన నటుడి చేతిలో మూడు నాలుగు చిత్రాలున్నాయి. గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ.. కడల్ చిత్రం తరువాత అభిమానులు నన్ను గుర్తిస్తున్నారు. అయితే ఆ అభిమానం ఇతర రాష్ట్రాలకు పాకలేదు. ఇటీవల బెంగళూరు వెళ్లాను. అక్కడ నన్నెవరూ గుర్తుపట్టలేదు స్వేచ్ఛగా తిరిగి ఎంజాయ్ చేశాను. నాన్న నటించిన పలు చిత్రాలు చూశాను. నటుడిగా ఆయనంత స్థాయికి చేరుకోవడానికి నాకు చాలా కాలం పడుతుంది. ఎన్నమో ఏదో చిత్రంలో సీనియర్ నటుడు ప్రభుతో కలిసి నటిస్తున్నాను. ఆయన నటనలో చాలా మెళకువలు నేర్పారు. ఆ విధంగా నటనలో కాస్త పరిణితి చెందాననే చెప్పాలి. ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో వై రాజా వై చిత్రంలో నటిస్తున్నాను. ఇది లవ్ థ్రిల్లర్. కాగా చిత్రం హీరోయిన్ ప్రియా ఆనంద్ చాలా స్నేహశీలి. ఇక సిపాయి చిత్రంలో లక్ష్మీ మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈమెకు పాత్రను అర్ధం చేసుకుని నటించాలనే ఆసక్తి అధికంగా ఉంది. ఇక నా తండ్రి కార్తీక్‌కు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నట్లుగా మీకూ ఉన్నారా? అని తరచూ చాలామంది అడుగుతున్నారు. నాకు గర్ల్‌ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే అని గౌతమ్ కార్తీక్ చాలా స్పష్టంగా తెలిపారు.