ప్రేమించడం తెలియదట
సీనియర్ నటుడు కార్తీక్‌ను ఒకప్పుడు లవర్‌బాయ్ అనేవారు. అప్పట్లో హీరోయిన్లు ఆయన్ని పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తూ చుట్టూ తిరిగేవారు. అలాంటి ది ఆయన కొడుకు గౌతమ్ కార్తీక్‌కు ప్రేమించడమే తెలియదట. ఇది కొంచెం అతిగా అనిపించినా నటి రకుల్‌ప్రీతి మాత్రం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గౌతమ్‌కార్తీక్ కడల్ చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించికపోయినా ఈ నవ హీరో మాత్రం యమ ప్రాచుర్యం పొందారు. అంతేకాదు ఈయనకిప్పుడు చేతి నిండా చిత్రాలున్నాయి. ఇటీవల విడుదలైన ఎన్నమో ఏదో చిత్రంలో గౌతమ్ కార్తీక్ సరసన రకుల్ ప్రీతి ఒక హీరోయిన్‌గా నటించారు. ఈమె ఈ చిత్రంలో నటించిన విషయం గురించి గౌతమ్‌మీనన్‌తో నటించిన అనుభవం గురించి తెలుపుతూ అలా మొదలయ్యిందిలో నిత్యామీనన్ పోషించిన పాత్రను తమిళ రీమేక్‌లో నటించే అవకాశం తనకు లభించిందని చెప్పారు.
అలాగే ఈ చిత్ర హీరో యువకుడు గౌతమ్ కార్తీక్ కావడంతో ప్రేమ, దోమ అంటూ వెంటపడతాడని అనుకున్నానని అన్నారు. అలాంటిది ఆయన తనను టచ్ చేయడానికి కూడా భయపడ్డారని తెలిపారు. దీంతో తానే చొరవ తీసుకుని గౌతమ్‌కార్తీక్‌తో సన్నిహితంగా నటించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయనకు ప్రేమించడం ఎలానో తెలియదట. ఆ తరువాత తన తండ్రిని ప్రేమ సన్నివేశాల్లో నటించడం ఎలా? అని అడిగారట. ప్రేమ సన్నివేశాల్లో నటించడానికి భయపడకూడదన్న తండ్రి సలహాతో ఆ సన్నివేశాలలో నటించారని రకుల్ ప్రీతి తెలిపారు. కార్తీక్ ప్రేమ విషయాల గురించి చాలా విన్నానని అలాంటిది ఆయన వారసుడికి ప్రేమించడం తెలియదంటే నమ్మలేకపోయానని రకుల్ ప్రీతి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.