తమిళసినిమా: యువ నటుడు గౌతమ్ కార్తీక్ కేరీర్ ఫ్లాప్‌తో మొదలై స్లోగా సక్సెస్ గాడిలో పడింది. కడల్, ఎన్నమో ఏదో చిత్రాలు గౌతమ్‌కార్తీక్‌ను అపజయాల్లోకి నెట్టగా రంగూన్, ఇవన్‌తందిరన్ చిత్రాలు విజయాల బాట పట్టించాయి. ఇటీవల తెరపైకి వచ్చిన హరహర మహాదేవకీ చిత్రం అడల్ట్ చిత్రంగా టాక్ తెచ్చుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా అదే చిత్ర కాంబినేషన్‌లో మరో చిత్రం శనివారం పూజాకార్యక్రమాలతో మొదలైంది. దీనికి ఇరట్టు అరైయిల్ మురట్టు కుత్తు అనే టైటిల్ నిర్ణయించారు.
ఇరట్టు అరైయిల్ మురట్టు కుత్తు అంటే చీకటి గదిలో మొరట్టు గుద్దు అని అర్ధం. హరహర మహాదేవకీ చిత్రం తరువాత కేఇ.జ్ఞానవేల్‌రాజా బ్లూకోస్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో గౌతమ్ కార్తీక్‌కు జంటగా నటించడానికి ఒక ప్రముఖ హీరోయిన్‌తో చర్చలు జరుపుతున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ పీ.జయకుమార్ తెలిపారు. నటుడు రవిమరియ, మొట్ట రాజేంద్రన్, కరుణాకరన్ ముఖ్య పాత్రలను పోషించనున్న ఈ చిత్రానికి తరుణ్‌బాలాజీ ఛాయాగ్రహణం, బాలమురళీబాల సంగీతం అందిస్తున్నారు. ఇది కూడా అడల్ట్ హరర్ కామెడీ చిత్రంగా ఉంటుందని, చిత్ర షూటింగ్‌ను పూర్తిగా విదేశాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. చిత్ర సింగిల్ ట్రాక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment