Tamil movie shooting
-
Bigg Boss: కవిన్, అపర్ణ దాస్ జంటగా నూతన చిత్రం
బిగ్‌బాస్ ఫేమ్ కెవిన్, బీస్ట్ చిత్రం ఫేమ్ అపర్ణ దాస్ జంటగా నటిస్తున్న చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఒలింపియా మూవీస్ పతాకంపై ఎస్.అంబేద్ కుమార్ నిర్మిస్తున్న 4వ చిత్రం ఇది. దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ శిష్యుడు. గణేశ్ కే.బాబు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిర్మాత మాట్లాడుతూ గణేష్ కె.బాబు ఈ చిత్ర కథ చెప్పగానే తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఇది నాగరిక యువత అభిరుచికి తగ్గట్టుగా ఉండే ప్రేమకథా చిత్రంగా ఉంటుందన్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతోపాటు, సామాజిక పరంగా ప్రశ్నించే విషయాలు ఉంటాయన్నారు. ప్రారంభ దశలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కవిన్ ఇందులో హీరోగా నటించడానికి అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు కథ చెప్పినప్పుడే ఇందులో కవిన్ నటిస్తే బాగుంటుందని భావించానన్నారు.దీనీకి ఎళిల్ అరసు.కే ఛాయాగ్రహణం, జెన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారని, చిత్ర షూటింగు చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
ఇరట్టు అరైయిల్ మురట్టు కుత్తు ప్రారంభం
తమిళసినిమా: యువ నటుడు గౌతమ్ కార్తీక్ కేరీర్ ఫ్లాప్‌తో మొదలై స్లోగా సక్సెస్ గాడిలో పడింది. కడల్, ఎన్నమో ఏదో చిత్రాలు గౌతమ్కార్తీక్ను అపజయాల్లోకి నెట్టగా రంగూన్, ఇవన్తందిరన్ చిత్రాలు విజయాల బాట పట్టించాయి. ఇటీవల తెరపైకి వచ్చిన హరహర మహాదేవకీ చిత్రం అడల్ట్ చిత్రంగా టాక్ తెచ్చుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా అదే చిత్ర కాంబినేషన్లో మరో చిత్రం శనివారం పూజాకార్యక్రమాలతో మొదలైంది. దీనికి ఇరట్టు అరైయిల్ మురట్టు కుత్తు అనే టైటిల్ నిర్ణయించారు. ఇరట్టు అరైయిల్ మురట్టు కుత్తు అంటే చీకటి గదిలో మొరట్టు గుద్దు అని అర్ధం. హరహర మహాదేవకీ చిత్రం తరువాత కేఇ.జ్ఞానవేల్‌రాజా బ్లూకోస్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో గౌతమ్ కార్తీక్‌కు జంటగా నటించడానికి ఒక ప్రముఖ హీరోయిన్‌తో చర్చలు జరుపుతున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ పీ.జయకుమార్ తెలిపారు. నటుడు రవిమరియ, మొట్ట రాజేంద్రన్, కరుణాకరన్ ముఖ్య పాత్రలను పోషించనున్న ఈ చిత్రానికి తరుణ్బాలాజీ ఛాయాగ్రహణం, బాలమురళీబాల సంగీతం అందిస్తున్నారు. ఇది కూడా అడల్ట్ హరర్ కామెడీ చిత్రంగా ఉంటుందని, చిత్ర షూటింగ్‌ను పూర్తిగా విదేశాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. చిత్ర సింగిల్ ట్రాక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. -
సినిమా షూటింగ్‌కు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరి మృతి
తంజావూరు: తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సినిమా షూటింగ్ బృందానికి చెందిన ఓ వ్యక్తితో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. తంజావూరు జిల్లా కుంభకోణం వద్ద సినిమా షూటింగ్ బృందం వెళ్తున్న వ్యాన్, ఎదురు వస్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కుంభకోణం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. గత 15 రోజులుగా కుంభకోణం పరిసర ప్రాంతాల్లో ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా నటిస్తున్న 'యంగ్ మంగ్ సంగ్' అనే తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది. శుక్రవారం తిరువాయరులోని అయ్యరప్పర్ దేవాలయంలో షూటింగ్ జరిగింది. ఈ సినిమా యూనిట్‌కు సంబంధించిన కొందరు వ్యాన్‌లో భోజనాలు తీసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. వ్యాన్ డ్రైవర్ విజయ్ కుమార్, సినిమా యూనిట్‌కు చెందిన అరుముగం అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.