బిగ్‌బాస్ ఫేమ్ కెవిన్, బీస్ట్ చిత్రం ఫేమ్ అపర్ణ దాస్ జంటగా నటిస్తున్న చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఒలింపియా మూవీస్ పతాకంపై ఎస్.అంబేద్ కుమార్ నిర్మిస్తున్న 4వ చిత్రం ఇది. దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ శిష్యుడు. గణేశ్ కే.బాబు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిర్మాత మాట్లాడుతూ గణేష్ కె.బాబు ఈ చిత్ర కథ చెప్పగానే తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు.
ఇది నాగరిక యువత అభిరుచికి తగ్గట్టుగా ఉండే ప్రేమకథా చిత్రంగా ఉంటుందన్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతోపాటు, సామాజిక పరంగా ప్రశ్నించే విషయాలు ఉంటాయన్నారు. ప్రారంభ దశలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కవిన్ ఇందులో హీరోగా నటించడానికి అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు కథ చెప్పినప్పుడే ఇందులో కవిన్ నటిస్తే బాగుంటుందని భావించానన్నారు.దీనీకి ఎళిల్ అరసు.కే ఛాయాగ్రహణం, జెన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారని, చిత్ర షూటింగు చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment