ప్రేమలో గౌతమ్‌కార్తీక్‌ ? | Gautham Karthik, love affair with PriyaAndad | Sakshi
Sakshi News home page

ప్రేమలో గౌతమ్‌కార్తీక్‌ ?

Published Thu, Jul 6 2017 1:30 AM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

ప్రేమలో గౌతమ్‌కార్తీక్‌ ?

ప్రేమలో గౌతమ్‌కార్తీక్‌ ?

తమిళసినిమా: నటి ప్రియాఆనంద్‌తో యువ నటుడు గౌతమ్‌ కార్తీక్‌ ప్రేమకలాపాలు అంటూ సోషల్‌మీడియాలో చాలాకాలంగా వదంతులు వైరల్‌ అవుతున్నాయి. నటుడు కార్తీక్‌ వారసుడు గౌతమ్‌కార్తీక్‌. కడల్‌ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన ఈయన తదిపరి చిత్రం వైరాజావై చిత్రంలో ప్రియాఆనంద్‌ నాయకిగా నటించింది.

అప్పటి నుంచే ఈ జంట మధ్య ప్రేమ వ్యవహారం మొదలైందనేది కోడంబాక్కం వర్గాల ప్రచారం. అయితే ఈ విషయం గురించి వీరిద్దరూ పెద్దగా పట్టించుకోలేదు. అప్పట్లో గౌతమ్‌కార్తీక్‌గానీ, ప్రియాఆనంద్‌గానీ ప్రైమ్‌టైమ్‌లో లేరు. కాగా గౌతమ్‌ కార్తీక్‌కు ఇటీవల రంగూన్, ఇవన్‌ తందిరన్‌ చిత్రాలు వరుసగా హిట్‌గా నిలిచాయి. దీంతో ఆయన వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనది కచ్చితంగా ప్రేమ వివాహమే అవుతుందని చెప్పారు.

దీంతో ప్రియాఆనంద్‌తో ప్రేమ వ్యవహారం మీడియాలో రచ్చగా మారింది. దీనికి స్పందించిన గౌతమ్‌కార్తీక్‌ ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి స్నేహంగా ఉండలేరని ప్రజలు నమ్మడం వల్లే ఇలాంటి వదంతులు పుట్టుకొస్తున్నాయన్నారు. నిజానికి తనకు నటి ప్రియాఆనంద్‌ మంచి స్నేహితురాలు మాత్రమే. అదీగాక తమ ఫ్యామిలిలోనూ స్నేహసంబంధాలు ఉన్నాయని చెప్పారు. అంతేగానీ మా మధ్య ప్రేమ, గీమ వంటిది లేదని స్పష్టం చేశారు. అయితే తనది ప్రేమ వివాహమే అంటున్న గౌతమ్‌కార్తీక్‌ అసలు ప్రేయసి ఎవరన్న ప్రశ్న ఇప్పుడు కోలీవుడ్‌లో ఉత్పన్నమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement