![20 Year Young Man Ends Life love Affair](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11212.jpg.webp?itok=v_JUs8Hx)
ప్రేమ వ్యవహారమే కారణం
యువతి కుటుంబ సభ్యుల బెదిరింపులతో మనస్తాపం
ఆరుగురిపై కేసు నమోదు
కొవ్వూరు: వాడపల్లి గ్రామానికి చెందిన చిట్రా సూర్య (20) అనే యువకుడు మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని బలవర్మణానికి పాల్పడ్డాడు. రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సూర్యకు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నెల 9వ తేదీన యువకుడు యువతి చదువుతున్న కొవ్వూరులోని స్కూలుకి వెళ్లాడు. యువతిని పిలువమని అడుగగా ప్రిన్సిపాల్ ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. తాము ఎవరినీ పంపలేదని చెప్పడంతో యువతిని కలిసేందుకు పాఠశాల నిర్వాహకులు నిరాకరించారు. యువతి పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
ఈ వ్యవహారంపై యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడి ఇంటికి వెళ్లి నిలదీశారు. స్థానిక బ్యాంకులో యువకుడి సోదరుడు పనిచేస్తున్నారు. ఆ యువకుడి బ్యాంకు ఉద్యోగం తీయించి వేస్తామని యువతి తల్లిదండ్రులు హెచ్చరించారు. పైగా సూర్యని చంపుతామని బెదిరించడంతో మనస్థాపం చెంది సోమవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో పక్క గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు యువకుడి తండ్రి శివ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు యువతి కుటుంబ సభ్యులైన హరి, వరలక్ష్మీ , పార్వతీ, లాయర్ నరసింహరాజు, సూర్యచంద్రం, సత్యవతిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కె.జగన్‌మోహన్‌రావు తెలిపారు. సూర్య ఆ కుటుంబంలో రెండో సంతానం అన్నారు. ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారని అన్నారు. మృతుడి తండ్రి తాపీ పనిచేస్తాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment