![Clashes Between Two Families In Vetlapalem Kakinada District](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/15/Clashes-Between.jpg.webp?itok=3boM8ooN)
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెంలో దారుణం జరిగింది. ఇంటి స్థలం విషయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిపై మరో కుటుంబం దాడి చేసింది. ఘర్షణలో కత్తులతో దాడి చేసుకోవడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఏం జరిగిందంటే?
గ్రామంలోని ఎస్సీపేట చెరువు సమీపంలో పండు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టారు. అదే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బచ్చల చక్రయ్య కుటుంబం ప్రయత్నించింది దీంతో ఇరువురి కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో ప్రకాశ్‌రావు అక్కడికక్కడే మృతి చెందగా.. చంద్రరావు, ఏసు ఆసుపత్రిలో మృతి చెందారు. తీవ్ర గాయాలైన సంజీవ్, పండు, దావీదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment