priyaanand
-
ఇక నటించకూడదనుకున్నా!
తమిళసినిమా: ఇక ఏ చిత్రంలోనూ నటించరాదని నిర్ణయించుకున్నానని నటి ప్రియాఆనంద్ పేర్కొంది. చాలా గ్యాప్ తరువాత ఈ అమ్మడు నటించిన చిత్రం కూటత్తిల్ ఒరుత్తన్. అశోక్ సెల్వ న్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రమణీయం టాకీస్ సంస్థ అధినేతలు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ద్వారా టీఎస్.జ్ఞానవేల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నివాస్.కే ప్రసన్న సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన డ్రీమ్‌వారియర్ పిక్చర్ అధినేత ఎస్ఆర్.ప్రభు మాట్లాడుతూ కూటత్తిల్ ఒరుత్తన్ వంటి చిత్రం ఇంత వరకూ తమిళ తెరపై రాలేదన్నారు. కథ వినగానే చిత్రాన్ని నిర్మించాలన్న ఆసక్తి కలిగిందన్నారు. ఇది మిడిల్ క్లాస్ బెంచ్ వ్యక్తుల గురించి ఇతివృత్తంతో కూడిన విభిన్న కథా చిత్రం అని తెలిపారు. ఇవాళ చిత్రాలను విడుదల చేయడానికి నిర్మాతలే పోట్లాడుకుంటున్నారు గానీ, సినిమాలు చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్నారు. పలు సమస్యలు, ఆటంకాలు ఎదుర్కొన్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు ఈ నెల 28న విడుదల చేయనున్నామని తెలిపారు. చిత్ర కథానాయకి ప్రియాఆనంద్ మాట్లాడుతూ తాను ఇకపై ఏ సినిమాలోనూ నటించకూడదని నిర్ణయించుకున్నానని, అలాంటిది కూటత్తిల్ ఒరుత్తన్ చిత్ర కథ వినగానే నటించాలనే ఆసక్తి కలిగిందన్నారు. చిత్ర కథ అలాంటిదన్నారు. మంచి చిత్రాలను నిర్మిస్తున్న డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రానికి వివాస్.కే ప్రసన్న సంగీతదర్శకుడు అనగానే తనకు మంచి లవబుల్ పాట ఉంటుందని ఆశించానన్నారు. ఆయన ఈ చిత్రం కోసం అంతకు మించిన మంచి పాటలను అందించారని చెప్పారు. కథానాయకుడు అశోక్‌సెల్వన్, దర్శకుడు టీఎస్.జ్ఞానవేల్ పాల్గొన్నారు. -
ప్రేమలో గౌతమ్‌కార్తీక్ ?
తమిళసినిమా: నటి ప్రియాఆనంద్‌తో యువ నటుడు గౌతమ్ కార్తీక్ ప్రేమకలాపాలు అంటూ సోషల్‌మీడియాలో చాలాకాలంగా వదంతులు వైరల్ అవుతున్నాయి. నటుడు కార్తీక్ వారసుడు గౌతమ్‌కార్తీక్. కడల్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన ఈయన తదిపరి చిత్రం వైరాజావై చిత్రంలో ప్రియాఆనంద్ నాయకిగా నటించింది. అప్పటి నుంచే ఈ జంట మధ్య ప్రేమ వ్యవహారం మొదలైందనేది కోడంబాక్కం వర్గాల ప్రచారం. అయితే ఈ విషయం గురించి వీరిద్దరూ పెద్దగా పట్టించుకోలేదు. అప్పట్లో గౌతమ్కార్తీక్గానీ, ప్రియాఆనంద్గానీ ప్రైమ్‌టైమ్‌లో లేరు. కాగా గౌతమ్ కార్తీక్‌కు ఇటీవల రంగూన్, ఇవన్ తందిరన్ చిత్రాలు వరుసగా హిట్‌గా నిలిచాయి. దీంతో ఆయన వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనది కచ్చితంగా ప్రేమ వివాహమే అవుతుందని చెప్పారు. దీంతో ప్రియాఆనంద్‌తో ప్రేమ వ్యవహారం మీడియాలో రచ్చగా మారింది. దీనికి స్పందించిన గౌతమ్‌కార్తీక్ ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి స్నేహంగా ఉండలేరని ప్రజలు నమ్మడం వల్లే ఇలాంటి వదంతులు పుట్టుకొస్తున్నాయన్నారు. నిజానికి తనకు నటి ప్రియాఆనంద్ మంచి స్నేహితురాలు మాత్రమే. అదీగాక తమ ఫ్యామిలిలోనూ స్నేహసంబంధాలు ఉన్నాయని చెప్పారు. అంతేగానీ మా మధ్య ప్రేమ, గీమ వంటిది లేదని స్పష్టం చేశారు. అయితే తనది ప్రేమ వివాహమే అంటున్న గౌతమ్‌కార్తీక్ అసలు ప్రేయసి ఎవరన్న ప్రశ్న ఇప్పుడు కోలీవుడ్‌లో ఉత్పన్నమవుతోంది. -
ఈ ప్రపంచాన్ని మార్చింది వారే!
ఈ ప్రపంచాన్ని మార్చిన వారిలో పలువురు మధ్య బెంచ్ విద్యార్థులేనని దర్శకుడు సీజే.జ్ఞానవేల్ పేర్కొన్నారు. నటుడు సూర్య అగరం ఫౌండేషన్‌లో ముఖ్య నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న ఈయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం కూటత్తిల్ ఒరుత్తన్. అశోక్ సెల్వన్, ప్రియాఆనంద్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం స్థానిక సత్యం సినిమా హాల్లో జరిగింది. చిత్ర ఆడియోను సీనియర్ నటుడు శివకుమార్ సమక్షంలో నటుడు సూర్య ఆవిష్కరించగా నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్ తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు జ్ఞానవేల్ నిరంతర శ్రమజీవి అని పేర్కొన్నారు. తన అగరం ఫౌండేషన్‌కు పేరును పెట్టింది ఈయనేనని తెలిపారు. ఈ ఫౌండేషన్ విజయంలో ఆయన పాత్ర చాలా ఉందని పేర్కొన్నారు. తనకు నటుడిని దాటి మంచి పేరు రావడానికి కారణం కూడా జ్ఞానవేలేనని నటుడు సూర్య చెప్పారు. అనంతరం చిత్ర దర్శకుడు జ్ఞానవేల్ మాట్లాడుతూ తాను పత్రికారంగం నుంచి వచ్చానని.. అందులో గడించిన అనుభవమే ఈ చిత్రం అని అన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ కథకు స్ఫూర్తి నటుడు కార్తీనేనని ఆయన తెలిపారు. తాను ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా తాను తన కుటుంబంలో మధ్యముడిగా పుట్టడం వల్ల ఎవరూ తనను పెద్దగా పట్టించుకోలేదని చెప్పారన్నారు. అన్నయ్య పెద్దవాడు కావడంతో అమ్మకు ఆయనంటే ప్రేమ అని, అందరి కంటే చిన్నది కావడంతో చెల్లెలంటే నాన్నకు ప్రేమ అని చెప్పారన్నారు. ఆయన చెప్పిన విషయాలనే ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం ఈ కూటత్తిల్ ఒరుత్తన్ అని దర్శకుడు తెలిపారు. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో గొప్ప వారంతా మధ్య బెంచ్‌లో కూర్చునే వాళ్లేనని, అరుుతే వారిని మనం పెద్దగా గుర్తించడం లేదని దర్శకుడు జ్ఞానవేల్ అన్నారు.