ఇక నటించకూడదనుకున్నా! | Koottailil Orutthan is planning to release on 28th of this month | Sakshi
Sakshi News home page

ఇక నటించకూడదనుకున్నా!

Published Wed, Jul 19 2017 2:03 AM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

ఇక నటించకూడదనుకున్నా!

ఇక నటించకూడదనుకున్నా!

తమిళసినిమా: ఇక ఏ చిత్రంలోనూ నటించరాదని నిర్ణయించుకున్నానని నటి ప్రియాఆనంద్‌ పేర్కొంది. చాలా గ్యాప్‌ తరువాత ఈ అమ్మడు నటించిన చిత్రం కూటత్తిల్‌ ఒరుత్తన్‌. అశోక్‌ సెల్వ న్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్, రమణీయం టాకీస్‌ సంస్థ అధినేతలు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ద్వారా టీఎస్‌.జ్ఞానవేల్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

నివాస్‌.కే ప్రసన్న సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన డ్రీమ్‌వారియర్‌ పిక్చర్‌ అధినేత ఎస్‌ఆర్‌.ప్రభు మాట్లాడుతూ కూటత్తిల్‌ ఒరుత్తన్‌ వంటి చిత్రం ఇంత వరకూ తమిళ తెరపై రాలేదన్నారు. కథ వినగానే చిత్రాన్ని నిర్మించాలన్న ఆసక్తి కలిగిందన్నారు. ఇది మిడిల్‌ క్లాస్‌ బెంచ్‌ వ్యక్తుల గురించి ఇతివృత్తంతో కూడిన విభిన్న కథా చిత్రం అని తెలిపారు. ఇవాళ చిత్రాలను విడుదల చేయడానికి నిర్మాతలే పోట్లాడుకుంటున్నారు గానీ, సినిమాలు చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్నారు. పలు సమస్యలు, ఆటంకాలు ఎదుర్కొన్న ఈ చిత్రాన్ని ఎట్టకేలకు ఈ నెల 28న విడుదల చేయనున్నామని తెలిపారు.

  చిత్ర కథానాయకి ప్రియాఆనంద్‌ మాట్లాడుతూ తాను ఇకపై ఏ సినిమాలోనూ నటించకూడదని నిర్ణయించుకున్నానని, అలాంటిది కూటత్తిల్‌ ఒరుత్తన్‌ చిత్ర కథ వినగానే నటించాలనే ఆసక్తి కలిగిందన్నారు. చిత్ర కథ అలాంటిదన్నారు. మంచి చిత్రాలను నిర్మిస్తున్న డ్రీమ్‌వారియర్‌ పిక్చర్స్‌ ఎస్‌ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రానికి వివాస్‌.కే ప్రసన్న సంగీతదర్శకుడు అనగానే తనకు మంచి లవబుల్‌ పాట ఉంటుందని ఆశించానన్నారు. ఆయన ఈ చిత్రం కోసం అంతకు మించిన మంచి పాటలను అందించారని చెప్పారు. కథానాయకుడు అశోక్‌సెల్వన్, దర్శకుడు టీఎస్‌.జ్ఞానవేల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement