నాన్నకు మాదిరి నాకు గర్ల్‌ఫ్రెండ్స్ లేరు
నాన్నకు మాదిరి నాకు గర్ల్‌ఫ్రెండ్స్ లేరు
Published Mon, Dec 30 2013 4:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
నాన్నకు మాదిరి నాకు గర్ల్‌ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరంటున్నారు సీనియర్ నటుడు కార్తీక్ వారసుడు, కాదల్ హీరో గౌతమ్ కార్తీక్. తొలి చిత్రం కడల్ నిరాశ పరిచినా గౌతమ్ కార్తీక్‌కు పలు అవకాశాలు క్యూకట్టడం విశేషం ప్రస్తుతం ఈ వర్ధమాన నటుడి చేతిలో మూడు నాలుగు చిత్రాలున్నాయి. గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ.. కడల్ చిత్రం తరువాత అభిమానులు నన్ను గుర్తిస్తున్నారు. అయితే ఆ అభిమానం ఇతర రాష్ట్రాలకు పాకలేదు. ఇటీవల బెంగళూరు వెళ్లాను. అక్కడ నన్నెవరూ గుర్తుపట్టలేదు స్వేచ్ఛగా తిరిగి ఎంజాయ్ చేశాను. నాన్న నటించిన పలు చిత్రాలు చూశాను. నటుడిగా ఆయనంత స్థాయికి చేరుకోవడానికి నాకు చాలా కాలం పడుతుంది.
ఎన్నమో ఏదో చిత్రంలో సీనియర్ నటుడు ప్రభుతో కలిసి నటిస్తున్నాను. ఆయన నటనలో చాలా మెళకువలు నేర్పారు. ఆ విధంగా నటనలో కాస్త పరిణితి చెందాననే చెప్పాలి. ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో వై రాజా వై చిత్రంలో నటిస్తున్నాను. ఇది లవ్ థ్రిల్లర్. కాగా చిత్రం హీరోయిన్ ప్రియా ఆనంద్ చాలా స్నేహశీలి. ఇక సిపాయి చిత్రంలో లక్ష్మీ మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈమెకు పాత్రను అర్ధం చేసుకుని నటించాలనే ఆసక్తి అధికంగా ఉంది. ఇక నా తండ్రి కార్తీక్‌కు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నట్లుగా మీకూ ఉన్నారా? అని తరచూ చాలామంది అడుగుతున్నారు. నాకు గర్ల్‌ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే అని గౌతమ్ కార్తీక్ చాలా స్పష్టంగా తెలిపారు.
Advertisement
Advertisement