మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఒక పల్లెటూరిలో జరిగిన కథతో రూపొందించిన హిస్టారికల్ మూవీ ‘ఆగస్ట్ 16, 1947’. గౌతమ్ కార్తీక్, రేవతి జంటగా ఎన్.ఎస్. పాన్‌కుమార్ దర్శకత్వంలో దర్శకుడు ఏఆర్ మురుగదాస్, ఓం ప్రకాష్ భట్, నర్సీరామ్ చౌదరి నిర్మించిన చిత్రం ఇది.
ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లిష్ భాషల్లో ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నట్లు బుధవారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘‘ప్రేక్షకులను ఈ సినిమా స్వాతంత్య్రం వచ్చిన రోజుల్లోకి తీసుకెళ్తుంది. మంచి అనుభూతినిస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సహనిర్మాత: ఆదిత్య జోషి.
Comments
Please login to add a commentAdd a comment