కష్టకాలంలో అవకాశం ఇచ్చారు
తమిళసినిమా: నిర్మాత జ్ఞానవేల్‌రాజా తనకు కష్టకాలంలో హరహర మహాదేవకీ చిత్రంలో నటిం చే అవకాశం ఇచ్చారని చిత్ర కథానాయకుడు గౌతమ్ కార్తీక్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటి నిక్కీగల్రాణి హీరోయిన్‌గా నటించింది. తంగం సినిమా పతాకంపై తంగరాజా నిర్మిసు ్తన్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను సంతోష్ పీ.జయకుమార్ నిర్వహిస్తున్నారు. బాలమురళీబాబు సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఆదివారం సాయంత్రం ట్రిప్లికేన్‌లోని కలైవాణర్ ఆవరణలో జరింగింది.
కార్యక్రమంలో చిత్ర హీరో గౌతమ్‌కార్తీక్ మాట్లాడుతూ హరహర మహాదేవకీ చిత్ర కథ చాలా మంది వద్దకు వెళ్లి ఆ తరువాత తనను వరించిందని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు సంతోష్ పీ.జయకుమార్ కథ చెప్పడానికి ముందు తనకు పాటలను వినిపించారని, ఆ పాటలను అసాంతం నవ్వుకుంటూనే విన్నానని తెలిపారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు నిర్మాత జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించి ఉత్సాహపరచారని అన్నారు. ఇదే చిత్ర యూనిట్‌తో కలిసి మరో చిత్రం కూడా చేయబోతున్నానని, ఆ చిత్రం గురించి దర్శకుడే వెల్లడిస్తారని గౌతమ్‌మీనన్ అన్నారు.
హీరోయిన్ నిక్కీగల్రాణి మాట్లాడుతూ తనకు డార్లింగ్ చిత్రం ద్వారా తమిళంలో అవకాశం ఇచ్చిన జ్ఞానవేల్‌రాజా, హరహర మహాదేవకీ చిత్ర కథ వినమని చెప్పారన్నారు. ఆ తరువాత దర్శకుడు తనకు కథ చెప్పారన్నారు. చిత్ర హీరో గౌతమ్‌కార్తీక్ తనకు మంచి ఫ్రెండ్ అని అంది. తమిళంలో సంభాషణలు చెప్పడం తనకు సరిగా రాకపోవడంతో తనే నేర్పించారని చెప్పారు. హరహర మహాదేవకీ చిత్ర టీమ్‌తోనే తాను స్టూడియో గ్రీన్ పతాకంపై త్వరలో ఇరట్టు అరైయిల్ మొరట్టు కత్తు అనే చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు నిర్మాత జ్ఞానవేల్‌రాజా ఈ సందర్భంగా వెల్లడించారు.