తమిళసినిమా: నవరసనాయకుడుగా అభిమానులు పిలుచుకునే కార్తీక్, ఆయన కొడుకు యువ నటుడు గౌతమ్‌కార్తీక్ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. బహుభాషా నటుడు కార్తీక్ చాలా గ్యాప్ తరువాత అనేగన్ చిత్రంతో రీఎంట్రి అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత అడపాదడపా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్న కార్తీక్‌ను ఆయన వారసుడు గౌతమ్‌కార్తీక్‌ను కలిసి నటింపజేయడానికి చాలా మంది ప్రయత్నించినా మంచి కథ కోసం ఎదురు చూస్తున్నట్లు కార్తీ చెప్పారు.
ఇటీవల రంగూన్, ఇవన్ తందిరన్ చిత్రాల విజయాలతో ఫేమ్‌లోకి వచ్చిన గౌతమ్‌కార్తీక్‌ను ఆయన తండ్రితో కలిసి నటింపచేసే విషయంలో దర్శకుడు తిరు సఫలమయ్యారు. నాన్ సిగప్పుమనిదన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈయన తయారు చేసుకున్న కథ కార్తీక్‌కు తెగ నచ్చేయడంతో అందులో తన కొడుకు గౌతమ్‌కార్తీక్‌తో కలిసి నటించడానికి పచ్చ జెండా ఊపారట. ఈ విషయాన్ని క్రియేటివ్ ఎంటర్‌టెయినర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ అధినేత ధనుంజయన్ తెలిపారు.
ఈయన నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి తెలుపుతూ నవంబర్‌లో చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నామని చెప్పారు. చిత్రంలో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటించనున్నారని, వారితో పాటు మరి కొందరు నటీనటుల వివరాలను, చిత్ర టైటిల్‌ను త్వరలోనే వెల్లడించనున్నటు చెప్పారు. చిత్ర టైటిల్‌ను ఇప్పటికే రిజిస్టర్ చేశామని, అయితే అదేవిటో గెస్ చేయాల్సిందిగా ప్రేక్షకులకు పజిల్ పెట్టినట్లు తెలిపారు. కరెక్ట్‌గా గెస్ చేసిన వారిలో ఐదుగురిని (ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు)ఎంపిక చేసి చిత్రంలో రెండు మూడు సన్నివేశాల్లో నటించే అవకాశం కల్పిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment