రెజీనా
ఈ మధ్య రెజీనా ఒకటి రెండు మూడు నాలుగు అని అంకెలు లెక్కేస్తూ ఏడు రాగానే ఆగిపోతున్నారు. ఎందుకిలా? ఏడు రెజీనా లక్కీ నెంబరా అంటే.. కాదట. విషయం ఏంటీ అంటే... ‘7’ ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా టైటిల్. అందుకే ఆ అంకెను అదే పనిగా పలుకుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకూ రెజీనా ‘ఏడు’ అంకె జపం చేస్తారేమో! ఇంతకీ కథలో 7కి లింక్ ఏంటి? అంటే సినిమా చూడాల్సిందే. కెమెరామేన్ నిజర్ షఫీ దర్శకుడిగా మారి, తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. రెహమాన్, హవీష్, రెజీనా, అనీషా ఆంబ్రోస్, పూజిత పొన్నాడ ముఖ్య పాత్రధారులు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment