rehaman
-
చంద్రబాబు విషం కక్కుతున్నారు: రెహమాన్
సాక్షి, విశాఖపట్నం: అధికారంలో ఉన్నపుడు విద్యార్థులు రోడ్డు ఎక్కితే అరెస్ట్ చేస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా విద్యార్థులను రోడ్డు ఎక్కిస్తున్నారని విశాఖపట్నం మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ అన్నారు. నాడు విద్యార్థి సంఘాలను రద్దు చేసిన ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు. ప్రస్తుతం ఐక్యకార్యాచరణ సమితి పేరిట పిలిచి విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయం కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. మంగళవారం చినకాకాని వద్ద ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆ దాడిలో నిజమైన రైతులు ఎవరూ లేరని.. అమాయక విద్యార్థులపై కేసులు పెట్టవద్దని రెహమాన్ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్నందుకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.(ప్రభుత్వ విప్ పిన్నెల్లిపై హత్యాయత్నం) చంద్రబాబు విషం కక్కుతున్నారు.. ‘గత ఐదేళ్లలో సమగ్రమైన ప్రణాళికలు రూపొందించి ఉంటే రాజధానికి ఇప్పటికే 60శాతం పనులు అయ్యుండేవి. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఇచ్చిన 33వేల ఎకరాలతో ఈ ప్రభుత్వానికి సంబంధం ఏమిటి?పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదం. రాజధాని ఎక్కడ ఉండాలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని బీజేపీ నేతలే చెబుతున్నారు. నాడు టీడీపీ రెండు కళ్ళ సిద్ధాంతంతో ఓ కన్ను కోల్పోయాం. చంద్రబాబు రెండు నాల్కల సిద్ధాంతం అమలు చేస్తున్నారు. ఆయన చపల చిత్త మనస్కులు అని రెహమాన్ చంద్రబాబు తీరును ఎండగట్టారు. అదే విధంగా... రాజధానిగా విశాఖపట్నానికి ఏమి తక్కువ అని ప్రశ్నించారు. ‘విశాఖ మినీ ఇండియా. రెడీమేడ్ క్యాపిటల్. అన్ని వనరులు ఉన్న మహా నగరం. ఉత్తరాంధ్రకు రాజధాని వస్తే చంద్రబాబు విషం కక్కుతున్నారు. సీనియర్ రాజకీయ నేతగా ఉత్తరాంధ్ర కు అన్యాయం చేయవద్దు’ చంద్రబాబుకు విఙ్ఞప్తి చేశారు. కాగా టీడీపీ విశాఖ అర్బన్ అధ్యక్షుడు, వుడా చైర్మన్‌గా పనిచేసిన ఎస్ఏ రెహమాన్ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించడానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. చదవండి: విశాఖలో టీడీపీకి షాక్! -
విశాఖలో టీడీపీ పంచాయితీ
సాక్షి, విశాఖపట్నం : సరైన అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా కట్టేసిన నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైఎలా చర్యలు తీసుకోవాలోనని అధికారులు ఓ పక్క మల్లగుల్లాలు పడుతున్నారు.మరోపక్క అదే తెలుగుదేశం కార్యాలయం వేదికగా ఆ పార్టీ నేతలు కుస్తీలు పడుతూ రచ్చకెక్కుతున్నారు.ఎన్నికల ముందు వరకు పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను తప్పించి నాలుగు నెలల కిందట మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్‌ను ఆ పదవిలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నియమించారు. రెహమాన్ నియామకాన్ని తట్టుకోలేని వాసుపల్లి గణేష్ అతను అధ్యక్షుడిగా ఉండగా తాను పార్టీ కార్యాలయంలో అడుగేపెట్టనని శపథం చేయడమే కాదు.. అప్పటినుంచి కార్యాలయంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.సరిగ్గా ఆదే అంశం ఆధారంగా ఎమ్మెల్యే వాసుపల్లితో తాడోపేడో తేల్చుకోవాలని పార్టీ నగర అధ్యక్షుడు రెహమాన్ భావిస్తున్నారు. ఆ మేరకు షోకాజ్ నోటీసులిచ్చేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది.మరోవైపు టీడీపీ హయాంలో మంత్రిగా అధికారం చెలాయించిన గంటా శ్రీనివాసరావు సైతం.. ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాలకు మొహం చాటేస్తున్నారు. పార్టీ వ్యవహారాలను అసలు పట్టించుకోవడమే మానేశారు. రాష్ట్రమంతటా చావుదెబ్బతిన్నా.. అప్పటి జీవీఎంసీ అధికారుల బ్లాక్మెయిల్ రాజకీయంతో విశాఖ నగరంలో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా బయటపడిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లకుంటే బాగోదని మొక్కుబడిగా హాజరవుతున్న శాసనసభ్యులు.. నగరంలో మాత్రం టీడీపీ కార్యాలయానికి సైతం వెళ్ళకపోవడం ఆ పార్టీ వర్గాల్లో చర్చకు తెరలేపింది. దాదాపు తొమ్మిదేళ్లు బుగ్గకారుకు అలవాటు పడిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికీ వాస్తవ పరిస్థితి జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అందుకే పార్టీ వ్యవహారాలకు దూరం దూరం.. అన్నట్లుంటున్నారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఆ మధ్య శ్రీలంక, ఇప్పుడు అమెరికా యాత్రలో ఉన్న ఆయన గురు, శుక్రవారాల్లో కీలకమైన బడ్జెట్ సమావేశాలకు కూడా డుమ్మా కొట్టేశారు. సోమవారం మాత్రం అసెంబ్లీ హాజరయ్యారు. ఇక ప్రతిపక్ష పార్టీకి కేటాయించే పీఏసీ చైర్మన్ పదవిపై కన్నేసిన ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ మాదేనని భావించే వెలగపూడి రామకృష్ణబాబులు పార్టీ కార్యాలయానికి అడపాదడపా వెళ్తున్నా... మరో సీనియర్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వ్యవహారశైలి మాత్రం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చాంశనీయమవుతోంది. పార్టీ కార్యాలయానికి వెళ్ళనంటే వెళ్ళను వాసుపల్లి గణేష్ విశాఖ అర్బన్ టీడీపీ అధ్యక్ష పదవిలో దాదాపు ఐదేళ్లు కొనసాగారు. సరిగ్గా ఎన్నికలకు ముందు వాసుపల్లిని తప్పించి మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ ఎస్ఎ రెహమాన్‌కు అర్బన్ టీడీపీ అధ్యక్ష పదవిని పార్టీ అధినేత చంద్రబాబు కట్టబెట్టారు. ప్రజారాజ్యంలో కొన్నాళ్ళు మినహా టీడీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలంగా కొనసాగుతున్న రెహమాన్ ఈసారి వాసుపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ నియోజకవర్గం సీటు ఆశించారు. ఒకవేళ తనకు ఇవ్వకున్నా చైతన్య స్రవంతి స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న తన సతీమణి షిరీన్ రెహమాన్‌కైనా ఇవ్వాలని రెహమాన్ పట్టుబట్టారు. అయితే చంద్రబాబు వాసుపల్లికే రెండోసారి టికెట్ కేటాయించి.. పార్టీ అర్బన్ అధ్యక్ష పదవిని తొలగించి రెహమాన్‌కు కట్టబెట్టారు. దీంతో వాసుపల్లి, రెహమాన్‌ల మధ్య మొదటి నుంచీ ఉన్న విభేదాలు మరింత ముదిరాయి. ఎన్నికల సమయంలో రెహమాన్ తనకు సహకరించలేదని వాసుపల్లి ఆరోపిస్తుంటే.. తన మద్దతు లేకుంటే దక్షిణంలో వాసుపల్లి గెలిచేవారా.. అని రెహమాన్ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత నుంచి వాసుపల్లి టీడీపీ కార్యాలయం మెట్లెక్కలేదు. జిల్లాలో పార్టీ ఘోరపరాభవం తర్వాత నగరంలోని పార్టీ కార్యాలయంలో ఐదారుసార్లు నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు ఎన్నికల ముందు సైకిలెక్కిన మాజీ ఎంపీ సబ్బం హరి సహా దాదాపు మిగిలిన నేతలు హాజరైనా వాసుపల్లి అటువైపు తొంగికూడా చూడలేదు. నోటీసులిచ్చేందుకు రెహమాన్ సిద్ధం? మూడు నెలలుగాపార్టీ కార్యాలయ మెట్లెక్కని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు పార్టీ నియమావళి ప్రకారం నోటీసులివ్వాలని అర్బన్ పార్టీ అధ్యక్షుడు రెహమాన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ నియమావళి ప్రకారం క్రియాశీలక సభ్యత్వం కలిగిన వారు వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే నోటీసులివ్వవచ్చని, ఆ క్రమంలో సంజాయిషీ అడగాలని రెహమాన్ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఇక్కడ వాసుపల్లి వ్యవహారంతో పాటు పార్టీ కార్యాలయ నిర్వహణ భారం, దుస్థితిపై పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లాలని, ఈలోగానే వాసుపల్లికి నోటీసులివ్వాలని రెహమాన్ యోచిస్తున్నట్టు చెబుతున్నారు. -
ముస్లిం నేతలను వాసుపల్లి పక్కన పెట్టారు
-
ఏడుతో లింకేంటి?
ఈ మధ్య రెజీనా ఒకటి రెండు మూడు నాలుగు అని అంకెలు లెక్కేస్తూ ఏడు రాగానే ఆగిపోతున్నారు. ఎందుకిలా? ఏడు రెజీనా లక్కీ నెంబరా అంటే.. కాదట. విషయం ఏంటీ అంటే... ‘7’ ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా టైటిల్. అందుకే ఆ అంకెను అదే పనిగా పలుకుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకూ రెజీనా ‘ఏడు’ అంకె జపం చేస్తారేమో! ఇంతకీ కథలో 7కి లింక్ ఏంటి? అంటే సినిమా చూడాల్సిందే. కెమెరామేన్ నిజర్ షఫీ దర్శకుడిగా మారి, తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. రెహమాన్, హవీష్, రెజీనా, అనీషా ఆంబ్రోస్, పూజిత పొన్నాడ ముఖ్య పాత్రధారులు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. -
సైకాలజిస్ట్ కథ
ప్రముఖ నటుడు రహమాన్ నటించిన తమిళ చిత్రం ‘ఒరు ముగత్తిరై’. సెంథిల్ నాథన్ దర్శకుడు. తమిళంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని ‘డాక్టర్ సత్యమూర్తి’ పేరుతో డి. వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటి జనరేషన్‌కు కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. ఫేస్బుక్లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి టీనేజ్ అమ్మాయిలను లోబర్చుకొని ఓ డాక్టర్ చేసే వికృత చేష్టలకు ప్రతిరూపం ఈ చిత్రం. మధ్యవయస్కుడైన సైకాలజిస్ట్ టీనేజీ అమ్మాయిలను ఎలా మభ్యపెడుతున్నాడు? ఎలా లోబర్చుకున్నాడు? అనే కథాంశం ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యూనివర్శల్ సబ్జెక్ట్ ఇది. ఇప్పటి పరిస్థితుల్లో తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలంటే మినిమమ్ రూ.3 కోట్లు నుంచి రూ. 10 కోట్లు కావాల్సిందే. డబ్బింగ్ చిత్రమైతే తక్కువ మొత్తంలో రైట్స్ తీసుకొని విడుదల చేసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో పెద్ద హీరో కాల్షీట్లు దొరికిన తర్వాతే స్ట్రయిట్ సినిమా చేస్తా. ‘తారామణి’ని ఈ నెల 8న, ‘పిజ్జా –2’ని ఈ నెలాఖరులో విడుదల చేస్తా’’ అన్నారు. -
సత్యమూర్తి ఏం చేశాడు?
సీనియర్ నటుడు రహమాన్ నటించిన తమిళ చిత్రం ‘ఒరు ముగత్తిరై’. సెంథిల్ నాథన్ దర్శకుడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ బ్యానర్‌పై డి.వెంకటేశ్ ‘డాక్టర్ సత్యమూర్తి’ పేరుతో జూన్ 2న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా డి.వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియా నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. వాట్సప్, ఫేస్బుక్ ఐడీస్లో వేరే ఫొటోలు పెట్టి చాటింగ్‌లు చేసి చీట్ చెయ్యడం వంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కథ నడుస్తుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ. మంచి మెసేజ్ ఉంది. సినిమా అంతా ప్రస్తుత ట్రెండ్‌పై ఆధారపడి ఉంటుంది’’అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శరవణ పాండియన్, సంగీతం: పమ్ర్ కుమార్. -
కొంగున ముడేసుకోవాలని చూసే 'భార్యలు జాగ్రత్త'
చెరిసగం అన్నారు పెద్దలు.నువ్వో సగం నేనో సగం అన్నాడు ఆత్రేయ.ఫిఫ్టీ పర్సెంట్ అడగడం న్యాయం.కాని పూర్తిగా కావాల్సిందే అని పట్టుబడితే భర్త తనకు తాను ఏం మిగులుతాడు... గుండు సున్నా.భర్త ఆఫీసరై ఉంటాడు. భార్యకు ఇన్సెక్యూరిటీ. అందంగా ఉంటాడు. భార్యకు ఇన్సెక్యూరిటీ. మంచి మాటకారి. ఇన్సెక్యూరిటీ. ఫేమ్ ఉంది. ఇన్సెక్యూరిటీ. హోదా.. అంతస్తు...అన్నింటికీ ఇన్సెక్యూరిటే.కాని భర్తలందరికీ ఇదే పనా? వేరొక స్త్రీ కోసం వేచి చూడటమే వాళ్ల పనా. వేరొక స్త్రీని వెతకడమే వారి పనా? ఆఫీసుకెళ్లి పని చేసుకోవాలనుకునేవారు, ఎంచుకున్న రంగంలోరాణించాలని కష్టపడేవాళ్లు, ఎంత ఎత్తుకు ఎదిగినా భార్యా పిల్లలు కుటుంబమూ ముఖ్యం అనుకునేవారు ఉండరా?ఉంటారు... కాని వాళ్లను వల్లో వేసుకునేవారు కూడా ఉంటారు అంటుంది ఈ సినిమాలో గీత.ఆమె మంచి అందగత్తె. డబ్బున్నవాళ్ల అమ్మాయి. ఫేమస్ సినీ గాయకుడైన రహెమాన్ భార్య. ఆమెకు భర్త అంటే ఇష్టం. చాలా ప్రేమ. ఎంత ప్రేమంటే అతడి ప్యాంటూ షర్టులా అతణ్ణి ఇరవైనాలుగ్గంటలూ అంటి పెట్టుకోవాలనుకునేంత. ఎక్కడికీ వెళ్లనివ్వదు. ఎవ్వరితో మాట్లాడనివ్వదు. ఎవరినీ కలవనివ్వదు. ముఖ్యంగా ఆడవాళ్ల పక్కన కూర్చున్నా నచ్చదు.తను హ్యాండిల్ చేయలేని పెన్నిధి ఏదో తన దగ్గర ఉంది అని సతమతమైపోతూ ఉంటుంది ఆమె.రహెమాన్‌కు భార్య అంటే అభిమానమే. ఆమె ప్రవర్తన విసుగ్గా ఉన్నా అతడికి మరో స్త్రీ పట్ల ఆసక్తి లేదు. పాటలు, ఇల్లు ఇవే అతని ప్రపంచం. కాని భార్య అతణ్ణి నమ్మదు. కాదు కాదు.. లోకాన్ని నమ్మదు. వల వేసే ఎర వేసే లోకం అంటే ఆమెకు భయం. అంత మాత్రం చేత ఊపిరి ఆడనివ్వకుండా చేయొచ్చా?ఈ వ్యవస్థలో కొన్ని సెటిల్ అయి ఉన్నాయి. మగాడు సాయంత్రం షికార్లు కొట్టాలి. ఫ్రెండ్స్‌తో తిరగాలి. అడపా దడపా పార్టీలు చేసుకోవాలి. రిలాక్స్‌కావాలి. ఆ మేరకు భార్య అతడిని వదిలిపెట్టాలి. ఆడది తీరిక ఉన్నప్పుడు పక్కింటి పిన్ని దగ్గరకు వెళ్లాలి. ఏవో వ్రతాలు నోములు చేసుకోవాలి. నలుగురితో కలిసి షాపింగ్‌కు వెళ్లాలి. బ్యూటీ పార్లల్‌కు వెళ్లాలి.పుట్టింటివాళ్లతో ఫోన్లు మాట్లాడుకోవాలి. ఇల్లు బోరు కొడుతుందని ఉద్యోగం చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి. ఆ మేరకు భర్త ఆమెను వదిలిపెట్టాలి.భార్య అలా వదిలిపెట్టకపోయినా భర్త ఇలా విడువకపోయినా గొడవలు వస్తాయి.ఈ సినిమాలో కూడా గొడవ అదే.నా స్పేస్‌ను నాకు వదిలిపెట్టు అంటాడు భర్త. భార్య వినదు. అతడి కచేరీలకి, పార్టీలకి, ఆఖరకు ఫ్రెండ్స్ ఇళ్లకు వెళితే అక్కడకూ తయారవుతూ ఉంటుంది. చివరకు ఒక దశలో ‘నువ్వు నలుగురి కళ్లల్లో పడటం నాకు ఇష్టం లేదు పాడటం మానెయ్’ అని అల్టిమేటం జారీ చేస్తుంది.అతడు పుట్టిందే పాడటానికి.పాడటం మానేయమంటే?ఇక విసిగిపోతాడు. చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి పారిపోతాడు.గతంలో ఇలాంటి మగవాళ్లు సన్యాసుల్లో కలిసేవాళ్లని అంటారు.రహెమాన్ మాత్రం గోవా బస్సెక్కుతాడు. విముక్తి కోరుకునేవారు, స్వేచ్ఛను ఆశించేవారు వెళ్లేది అక్కడికే కదా. ఒక తోడు వదిలిపెడితే ఇంకో జోడి ఉండనే ఉంటుంది లోకంలో.అదే బస్‌లో ఇంటి నుంచి పారిపోయిన సితార ఎక్కుతుంది. ఆమెది రెగ్యులర్ కథే. దుర్మార్గుడైన మొగుడు. డబ్బు కోసం ఆమెను ఎవరి దగ్గరికైనా పంపడానికి వెనుకాడని వెధవ. ఇలాంటి వాడు వద్దు అని పారిపోయింది. ఇద్దరూ ఈ బస్‌లో పరిచయమయ్యారు. గోవాలో షికార్లు చేశారు. ఆకర్షణ చాలా సులభం. స్త్రీ, పురుషుడు ఒక చోట ఉంటే దప్పికా వెంటనే వెక్కిళ్లూ వచ్చేస్తాయి.కాని ఇద్దరూ కంట్రోల్లో ఉంటారు.కోరికను దాటగలిగిన బంధం కోసం చూస్తారు.అయితే వారికి అదే గోవాలో ఒక వృద్ధ దంపతుల జంట పరిచయం అవుతుంది. వారు దాంపత్య జీవితానికి అసలు సిసలు ఉదాహరణ. ఇద్దరూ పరస్పరం గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ ఒకరి చేయి ఒకరు విడవకుండా... వివాహబంధంలో భార్యాభర్తలు ఇలా ఉండాలి. కాని వీరిద్దరూ? వివాహానికి న్యాయం చేస్తున్నారా?చివరకు వీళ్ల వ్యవహారం తెలియాల్సినవాళ్లకు తెలుస్తుంది. గోవా నుంచి సిటీకి చేరుకుంటారు. గీత రహెమాన్‌కు విడాకులు ఇవ్వాలని నిశ్చయించుకుంటుంది. విడాకులు అయిపోతాయి కూడా. రోషంతో ఇంకొకరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. కాని ఆ పెళ్లి జరగదు. అసలు ఆ పెళ్లి జరగాలని ఆమెకు ఉంటే కదా. ఆమె మనసు తన భర్త దగ్గరే ఉంది. అతడు దూరమయ్యాక తాను కోల్పోయిందేమిటో అర్థమైంది. దుఃఖం, వేదన, కలత... మెల్లగా గీత పిచ్చిదైపోతుంది.ఒక ప్రాణాన్ని క్షోభకు గురి చేసి తాము బావుకున్నది ఏముంది అనుకుంటారు రహెమాన్, సితారలు.సితార రహెమాన్‌ను వదిలి పశ్చాత్తాపంతో తన కోసం ఎదురు చూస్తున్న భర్త దగ్గరకు వెళ్లిపోతుంది.రహెమాన్ గీతను తిరిగి స్వీకరించడంతో కథ ముగుస్తుంది.అర్ధనారీశ్వరంలో పార్వతి సగం, శివుడు సగం.దైవం కూడా నిర్ణయించిన పర్సెంటేజీ అది.మనలో సగం మన జీవిత భాగస్వామికి. మిగిలిన సగం మనకు. ఇది అర్థం కాని దంపతులూ జాగ్రత్త! పుదు పుదు అర్థంగళ్ 1998లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన నిర్మించిన సినిమా ‘పుదు పుదు అర్థంగళ్’. అంటే ‘కొత్తకొత్త అర్థాలు’ అని అర్థం. మనిషి మానసిక బంధాలను, వివాహం ద్వారా నియమబద్ధం చేసే భౌతిక బంధాలను పరిపరి విధాలుగా అర్థం చేసుకోవాలని చెప్పే సినిమా ఇది. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రహెమాన్, గీత, సితార... ఈ సినిమాలో పోటీ పడి నటించారు. అప్పటికి సినిమాల్లో ఒక హీరోయిన్ ‘నంబర్ టూ’ వస్తుందని బస్సు దిగడం, అది అయ్యాక నీళ్లలో చేయి కడుక్కుంటూ కనిపించడం లేదు. ఈ సినిమాలో అదో మామూలు విషయంగా బాలచందర్ చేయించగలిగాడు. ఉప కథలు ఉండటం వల్ల కొన్ని కథల కథ చూస్తున్న భావన కలుగుతుంది. ఆ తర్వాతి కాలంలో పెద్ద కమెడియన్ అయిన వివేక్‌కు ఇది గుర్తింపు తెచ్చిన తొలి సినిమా. ఇళయరాజా, బాలచందర్ కలిసి పని చేసిన చివరి సినిమా ఇది. ఇందులో పాటలు పెద్ద హిట్ అయ్యాయి– తెలుగులో కూడా. ఇందులో పనివాడు ‘నేను కాబోయే ముఖ్యమంత్రిని’ అంటుంటాడు. ప్రతివాడూ రాజకీయాల్లో దిగి ముఖ్యమంత్రి కావాలనుకునే తమిళుల ధోరణి మీద బాలచందర్ పంచ్ కావచ్చు అది. కాని ఆశ్చర్యమేమంటే ఇవాళ ఆయన ఇద్దరు శిష్యులు– రజనీ, కమల్ ముఖ్యమంత్రులు కావడానికి పెద్ద మంత్రాంగం చేస్తున్నారు. – కె -
రెండు ఆస్కార్లు చేతబట్టిన నిగర్వి ఆయన...
భారతీయ సంగీత పరిశ్రమ ప్రస్తావన వస్తే రెహమాన్ పేరు తప్పక వినిపిస్తుంది. భారతీయ సంగీతం.. ఆ మాటకొస్తే ప్రపంచ సంగీతంపై ఆయన వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. దాదాపు పాతికేళ్లుగా ఆయన సృష్టించని సరికొత్త సంగీత ఒరవడి లేదు. ఆయన పాటలు విని మైమరిచిపోని శ్రోతలు లేరు. ఆయన అందుకోని అవార్డులు, సాధించని ఘనతలూ ఏమీ మిగిలి లేవు. రెండు ఆస్కార్లు చేతబట్టి భారతీయుల్ని తలెత్తుకునేలా చేసినా.. కించిత్ గర్వాన్ని కూడా తలకెక్కించుకోనివ్వని నిగర్వి రెహమాన్..! బాల్యం.. రెహమాన్ పూర్తిపేరు అల్లా రఖా రెహమాన్. అసలు పేరు ఎ.ఎస్.దిలీప్ కుమార్. 1967 జనవరి 6 ఆయన పుట్టినరోజు. చెన్నైలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. రెహమాన్ తండ్రి ఆర్.కె.శేఖర్ మలయాళ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసేవారు. అయితే, ఆయన ఆకస్మిక మరణం రెహమాన్‌ను కుటుంబ బాధ్యతలు తీసుకునేలా చేసింది. తండ్రి సంపాదించి పెట్టిన కీబోర్డులను అద్దెకు ఇస్తూ తొమ్మిదేళ్ల రెహమాన్ తల్లితో పాటు కుటుంబాన్ని ముందుకు నడిపించాడు. పదకొండేళ్ల వయసులో కీబోర్డు, గిటార్ ప్లేయర్‌గా ఇళయరాజా ట్రూపులో చేరాడు. అలా బాల్యంలోనే సంగీతాభిరుచిని అలవరచుకున్నాడు. సంగీత ప్రస్థానం.. రాజ్-కోటి లాంటి సంగీత దర్శకుల వద్ద అసిస్టెంటుగా చేరి సినీ సంగీత ప్రయాణాన్ని ప్రారంభించాడు. కెరీర్ ఆరంభంలో వాణిజ్య ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చేవాడు. తర్వాతి కాలంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన ‘యోధ’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. అయితే, అంతకుముందే మణిరత్నం సినిమా ‘రోజా’ (1992) చిత్రం విడుదల కావడంతో దేశవ్యాప్తంగా రెహమాన్ పేరు మార్మోగింది. ఆ చిత్రానికి గానూ తొలి చిత్రానికే జాతీయ అవార్డు అందుకున్న ఘనతను సాధించాడు. నాటి నుంచీ నేటివరకూ ఎన్నో సూపర్‌హిట్ సినిమాలకు పనిచేశాడు. భారతీయ అగ్రగామి స్వరకర్తగా పేరు గడించాడు. ఆయన సంగీతమందించిన చిత్రాలు కొన్ని విఫలమైనా.. రెహమాన్ మాత్రం ఏనాడూ సంగీత దర్శకుడిగా విఫలం కాలేదు. ఆస్కార్.. ఎన్నో అద్భుతమైన పాటలు రెహమాన్ సృష్టించినా.. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి లభించిన గౌరవం మాత్రం మరే చిత్రానికీ దక్కలేదు. 2009లో విడుదలైన ఈ చిత్రం రెహమాన్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. ఈ చిత్రానికి గానూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో రెండు ఆస్కార్లు సాధించాడు. దీంతో ప్రపంచం దృష్టి ఒక్కసారిగా ఈ భారతీయ సంగీత సంచలనంపై పడింది. ఇదే చిత్రానికి ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు బాఫ్టా అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. గౌరవాలు.. టైమ్ మ్యాగజైన్ రెహమాన్‌కు ‘మొజార్ట్ ఆఫ్ మద్రాస్’ బిరుదు ఇచ్చింది. జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు. హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలింఫేర్ అవార్డులు, తమిళనాడు ప్రభుత్వ అవార్డులు గెలుచుకున్నాడు. బర్ల్కీ సంగీత కళాశాల సహా పలు విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేశాయి. 2012 క్రిస్మస్ వేడుకలకు అమెరికా అధ్యక్షుడి నుంచి రెహమాన్‌కు ఆహ్వానం అందింది. వైట్‌హౌస్‌లో డిన్నర్‌కు కూడా పిలుపు వచ్చింది. కెనడాలోని ఒంటారియో రాష్ట్రం మర్ఖామ్ నగరంలో రెహమాన్ పేరిట ఓ వీధిని సైతం ఏర్పాటు చేశారు. కుటుంబం.. రెహమాన్ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో అమీన్, ఖతీజాలు ఇప్పటికే సినిమాలకు తమ గాత్రాన్ని దానం చేశారు. రహీమా సైతం అదే పనిలో ఉంది. ఇక, ప్రముఖ యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ రెహమాన్‌కు స్వయానా మేనల్లుడు. ఆయన సోదరి ఎ.ఆర్.రెహానా ఇప్పటికే అనేక సినిమాలకు సంగీత దర్శకురాలిగా, గాయనిగా పనిచేశారు. -
ముసలం
తెలుగుదేశంలో చేరికలు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. వెనకాముందూ చూడకుండా పార్టీలో అందరికీ గేట్లు తెరిచేయడంతో నాయకులు కార్యకర్తలు కంగు తింటున్నారు. అధినేత ధోరణితో వీరంతా మండిపడుతున్నారు. మాజీ మంత్రి గంటా చేరికతో భగ్గుమన్న తెలుగుదేశంలో వుడా మాజీ వీసీ రెహమాన్ తాజాప్రవేశం ఆ పార్టీ నగరనేతవాసుపల్లికి గట్టిషాకే ఇచ్చింది. విశాఖపట్నం : అర్బన్ తెలుగుదేశం పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. గంటా చేరికతో ఓ పక్క అయ్యన్న ఆగ్రహంతో రగిలిపోతుంటే తాజాగా వుడా మాజీ చైర్మన్ రెహమాన్ తెలుగుదేశంలో చేరడంతో ఆ పార్టీలో కలకలం రేగింది. సాక్షాత్తూ ఆ పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌కు ఈ చేరిక షాకిచ్చినట్టయింది. దక్షిణ నియోజక వర్గంలో మత్స్యకార నేతగా ముద్రపడి పనిచేసుకుపోతున్న ఈయనకు రెహమాన్ చేరిక మింగుడు పడటం లేదు. అధినేత చంద్రబాబునాయుడు తీరుపై వాసుపల్లి వర్గీయులంతా గుర్రుగా ఉన్నారు.