
డి. వెంకటేశ్
ప్రముఖ నటుడు రహమాన్ నటించిన తమిళ చిత్రం ‘ఒరు ముగత్తిరై’. సెంథిల్ నాథన్ దర్శకుడు. తమిళంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని ‘డాక్టర్ సత్యమూర్తి’ పేరుతో డి. వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటి జనరేషన్‌కు కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి టీనేజ్ అమ్మాయిలను లోబర్చుకొని ఓ డాక్టర్ చేసే వికృత చేష్టలకు ప్రతిరూపం ఈ చిత్రం.
మధ్యవయస్కుడైన సైకాలజిస్ట్ టీనేజీ అమ్మాయిలను ఎలా మభ్యపెడుతున్నాడు? ఎలా లోబర్చుకున్నాడు? అనే కథాంశం ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. యూనివర్శల్ సబ్జెక్ట్ ఇది. ఇప్పటి పరిస్థితుల్లో తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలంటే మినిమమ్ రూ.3 కోట్లు నుంచి రూ. 10 కోట్లు కావాల్సిందే. డబ్బింగ్ చిత్రమైతే తక్కువ మొత్తంలో రైట్స్ తీసుకొని విడుదల చేసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో పెద్ద హీరో కాల్షీట్లు దొరికిన తర్వాతే స్ట్రయిట్ సినిమా చేస్తా. ‘తారామణి’ని ఈ నెల 8న, ‘పిజ్జా –2’ని ఈ నెలాఖరులో విడుదల చేస్తా’’ అన్నారు.