
సీనియర్ నటుడు రహమాన్ నటించిన తమిళ చిత్రం ‘ఒరు ముగత్తిరై’. సెంథిల్ నాథన్ దర్శకుడు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ బ్యానర్‌పై డి.వెంకటేశ్ ‘డాక్టర్ సత్యమూర్తి’ పేరుతో జూన్ 2న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా డి.వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియా నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. వాట్సప్, ఫేస్‌బుక్ ఐడీస్‌లో వేరే ఫొటోలు పెట్టి చాటింగ్‌లు చేసి చీట్ చెయ్యడం వంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కథ నడుస్తుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ. మంచి మెసేజ్ ఉంది. సినిమా అంతా ప్రస్తుత ట్రెండ్‌పై ఆధారపడి ఉంటుంది’’అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శరవణ పాండియన్, సంగీతం: పమ్ర్ కుమార్.