‘‘నేనిప్పటి వరకూ చాలామంది కొత్త దర్శకులతో పనిచేశాను. నాకైతే ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. పవన్ మల్లెల మొదటి సిట్టింగ్‌లోనే కథ చెప్పిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకే ‘బాలకృష్ణుడు’ సినిమా చేశా’’ అని నారా రోహిత్ అన్నారు. నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో బి. మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి నిర్మించిన ‘బాలకృష్ణుడు’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. రోహిత్ మాట్లాడుతూ– ‘‘ఫుల్ కమర్షియల్ ఫార్మాట్ సినిమా చేస్తే బాగుంటుందనుకుంటున్న టైమ్‌లో ఈ చిత్రం కుదిరింది.
కథ మరీ కొత్తగా ఉండదు. కానీ, దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పిన విధానం కొత్తగా ఉంటుంది. నటుడు అజయ్ ద్వారా ఈ సినిమా నా దగ్గర వచ్చింది. ఇందులో ప్రధాన విలన్ అతనే. డబ్బు కోసం ఏమైనా చేసే బాలు పాత్రలో కనిపిస్తా. అయితే నెగెటివ్ షేడ్స్ ఉండవు. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే భిన్నమైనది. టైటిల్‌లోనే కమర్షియల్ సినిమా అని తెలిసిపోవాలని ‘బాలకృష్ణు్ణడు’ పెట్టాం. ‘జ్యో అచ్యుతానంద’కి, ఈ సినిమాకి దాదాపు 21 కిలోలు తగ్గాను. ఈ సినిమాలో పూర్తి స్థాయి సిక్స్ ప్యాక్ చేయలేదు. పరుచూరి మురళి దర్శకత్వంలో జగపతిబాబుగారితో కలిసి ‘ఆటగాళ్ళు’ సినిమా చేస్తున్నా. చైతన్య దంతులూరితో ఒక ప్రాజెక్ట్ ఉంది. లవ్‌స్టోరీలు కూడా వింటున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment