సారీ.. ఇంకాస్త టైమ్‌ ఉంది | Regina Cassandra to play the lead in Rana's film | Sakshi
Sakshi News home page

సారీ.. ఇంకాస్త టైమ్‌ ఉంది

Published Fri, Nov 24 2017 1:34 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

Regina Cassandra to play the lead in Rana's film - Sakshi

అవును. ఇంకాస్త టైమ్‌ ఉంది. ‘1945’ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌లో పాల్గొనడానికి రానాకు కొంచెం టైమ్‌ ఉంది. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేయడానికి కూడా ఇంకా టైమ్‌ ఉంది. అదేంటీ? నవంబర్‌లో తన లుక్‌ని రిలీజ్‌ చేస్తానని రానా గత నెల పేర్కొన్నారు కదా! ఈ నెల ఎండ్‌ కావడానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. మరి.. లుక్‌ ఎక్కడ? అంటే.. గురువారం ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు రానా.

‘వారం రోజులే ఉంది... నవంబర్‌ పూర్తి కావడానికి. 1945 సినిమాలోని లుక్‌ వస్తుందా?’ అని ఓ అభిమాని రానాను అడగ్గా.. ‘‘సారీ. ఇంకాస్త టైమ్‌ ఉంది. త్వరలో వివరాలు తెలియజేస్తాను’’ అని పేర్కొన్నారు రానా. సత్యశివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా కథానాయిక. నాజర్, సత్యరాజ్‌ కీలకపాత్రలు చేస్తున్నారు. తమిళంలో ఈ చిత్రానికి ‘మడై తిరందె’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రంలో రానా డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement