
నవీన్ చంద్ర, గాయత్రీ సురేశ్
నవీన్ చంద్ర, గాయత్రీ సురేశ్ హీరో హీరోయిన్లుగా ‘అడ్డా, ఓటర్’ చిత్రాల దర్శకుడు జి.యస్. కార్తీక్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్వాతి పిక్చర్స్ బ్యానర్లో భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ – ‘‘దర్శకుడు మంచి కథ చెప్పారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు పుష్కలంగా ఉంటాయి.
మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ చిత్రాన్ని అందిస్తాం అన్నారు. ‘‘ప్రేక్షకులకు కావల్సిన అంశాలన్నీ ఉంటాయి. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం. టీమ్ సహకారంతో అందరూ మెచ్చేలా, అందరికీ నచ్చేలా సినిమా తీయడానికి కృషి చేస్తాను’’ అన్నారు కార్తీక్. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ గంగాధరీ, సంగీతం: అనూప్ రూబెన్స్.
Comments
Please login to add a commentAdd a comment