New Movie Launched
-
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
యంగ్ హీరో శ్రీవిష్ణు కొత్త సినిమా షురూ
శ్రీవిష్ణు హీరోగా నూతన సినిమా షురూ అయింది. ‘వివాహ భోజనంబు’(ఓటీటీ ప్రాజెక్ట్) ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నారా రోహిత్ క్లాప్ ఇచ్చారు. ‘‘పూర్తి ఫన్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో నిర్మాత అనిల్ సుంకర, దర్శకులు వీఐ ఆనంద్, విజయ్ కనకమేడల, ఏఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీ ప్రసాద్, ప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాంరెడ్డి. -
బర్త్‌డే సందర్భంగా రెండో సినిమాను ప్రకటించిన హీరో..
Bewars Actor Sanjosh New Movie Launched: మొదటి సినిమా ‘బేవర్స్’తో మంచి నటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో సంజోష్. ఈ చిత్రంలో ఆయన పర్ఫామెన్స్‌కు అందరూ ఆకర్షితులయ్యారు. నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన 'బేవర్స్' సినిమాలో సంజోష్ తన ఎమోషనల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నింట్లో సంజోష్ తన మార్క్ చూపించాడు. సంజోష్ తాజాగా తన రెండో సినిమాకు సంబంధించిన ప్రకటన చేశాడు. బుధవారం (జూలై 13) సంజోష్ పుట్టిన రోజు సందర్భంగా రెండో సినిమా ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సంజోష్ తన రెండో చిత్రాన్ని చేస్తున్నాడు. సంజోష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. మేకర్లు సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని, మరిన్ని పూర్తి వివరాలు తెలియజేస్తామని మేకర్లు తెలిపారు. చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ -
రవితేజ సమర్పణలో విష్ణు విశాల్ మరో సినిమా..
Ravi Teja Presenting Vishnu Vishal Movie Titled Matti Kusthi: కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ కథానాయకుడిగా మను ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్ఐఆర్'. విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఫిబ్రవరి 11న విడుదలై మంచి పాజిటివ్ టాక్ సంపాందించుకుంది. మాస్ మహారాజ రవితేజ సమర్పణలో అభిషేక్ నామా ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. అనేక వివాదాల నడుమ రిలీజైన ఈ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా రవితేజ సమర్పణలో విష్ణు విశాల్ మరో సినిమా రానుంది. రవితేజ సమర్పణలో విష్ణు విశాల్ 'మట్టి కుస్తీ' అంటూ క్రీడా నేపథ్యంలో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. చదవండి: రవితేజ లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు: విష్ణు విశాల్ ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై డైరెక్టర్ చెల్లా అయ్యావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌ను చిత్రబృందం మంగళవారం (ఏప్రిల్ 5) ప్రకటిస్తూ 'మట్టి కుస్తీ' మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే కుస్తీ ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విష్ణు విశాల్‌కు జోడిగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించనుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా.. 'మట్టి కుస్తీ' రెగ్యూలర్ షూటింగ్ బుధవారం (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. -
పొలిటికల్ థ్రిల్లర్‌గా కొత్త చిత్రం.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం
చెన్నై సినిమా: రాజకీయ నేపథ్యంలో మరో థ్రిల్లర్ రూపొందుతోంది. నటులు ప్రాజన్, అజిత్ నాయక్ హీరోలుగా నటిస్తున్న ఇందులో నటి ప్రఖ్యా నయన్, రష్మీ నాయికలుగా నటించనున్నారు. శ్రీకృష్ణ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి. సూర్యకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శంకర్, కెన్నడీ ద్వయం కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రం ఆదివారం ధర్మపురిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకు వినోద్‌కుమార్ ఛాయాగ్రహణం, విజయ్ యాట్లీ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ.. దుర్మార్గులైన రాజకీయ నాయకుల వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను కొత్తకోణంలో చూపించబోతున్నట్లు చెప్పారు. షూటింగ్ ధర్మపురి, కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్రారంభమైన ప్యాకప్ చిత్రం.. ముఖ్య అతిథిగా ఏయమ్ రత్నం
వాసం నరేశ్, ఆశ ప్రమీల హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ప్యాకప్’. జీవీఎస్ ప్రణీల్ దర్శకత్వంలో పానుగంటి శరత్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత ఏయమ్ రత్నం ముఖ్య అతిథిగా హాజరై తొలి సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రం గొప్ప విజయం సాధించి, చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలని ఏయమ్ రత్నం కోరారు. ‘‘ప్రేమలోని మరో కోణాన్ని ఈ సినిమాతో చెప్పాలనుకుంటున్నాం’’ అన్నారు జీవీఎస్ ప్రణీల్. ‘‘ఏకధాటిగా షూటింగ్ ప్లాన్ చేశాం’’ అన్నారు శరత్‌రెడ్డి. ఒక మంచి కథతో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందని వాసం నరేశ్ తెలిపాడు. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా శ్రీకృష్ణ గుళ్లపల్లి లైన్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. -
ఆటో రజిని హిట్ అవ్వాలి
‘‘ఆటో రజిని’ సినిమా మంచి విజయం సాధించి, మా జొన్నలగడ్డ శ్రీను కుటుంబానికి మంచి లాభాలు రావాలి. చిత్ర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కూడా మంచి పేరు రావాలి. హీరో, హీరోయిన్‌తో పాటు నటీనటులు పదికాలాలపాటు ఇండస్ట్రీలో వెలుగొందాలి’’ అని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా జొన్నలగడ్డ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆటో రజిని’. శ్రీనివాస్ జొన్నలగడ్డ ఫిలిమ్స్, శ్రీ మహాలక్ష్మి ఎంటర్ర్పైజెస్ పతాకాలపై జొన్నలగడ్డ సావిత్రి నిర్మిస్తున్న ‘ఆటో రజిని’ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మంత్రి కొడాలి నాని కెమెరా స్విచ్చాన్ చేయగా, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ క్లాప్ కొట్టారు. మధుసూదన్ రెడ్డి, సిద్ధార్థరెడ్డి, గౌతమ్ రెడ్డిలు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ– ‘‘ఆటో రజిని’ హరికృష్ణని మంచి హీరోగా నిలబెట్టే చిత్రం అవుతుంది’’ అన్నారు. జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఆటో రజిని’ సినిమాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి ఆశీస్సులు తీసుకొని వచ్చాను. లవ్ అండ్ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 15 నుంచి విజయవాడలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది’’ అన్నారు. ‘‘మంచి సందేశంతో ‘ఆటో రజిని’ రూపొందుతోంది’’ అన్నారు సావిత్రి.జె. ‘‘నా మొదటి చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’ ఆడియోకి వైఎస్ జగనన్న ఆశీస్సులు తీసుకున్నాను. ‘ఆటో రజిని’ ఒక మాస్ సినిమా’’ అన్నారు హరికృష్ణ. ‘‘నా మొదటి చిత్రాన్ని తెలుగులో చేయడం సంతోషం’’ అన్నారు ప్రీతి సేన్ గుప్తా. ఈ చిత్రానికి కెమెరా: ప్రభాకర్ రెడ్డి. -
విశాల్ ప్యాన్ ఇండియా మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
-
నవ్వుల రాజా
నటుడు శివాజీ రాజా తనయుడు, ‘ఏదైనా జరగొచ్చు’ ఫేమ్ విజయ్ రాజా హీరోగా రెండో సినిమా షురూ అయింది. రామ్స్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్నారు. జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. తమన్నా వ్యాస్ కథానాయిక. హీరో నాగశౌర్య ముహూర్తం సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ– ‘‘వినోద ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది. విజయ్ రాజాకి కరెక్ట్‌గా సరిపోతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రకథ విన్నాను.. బాగుంది’’ అన్నారు శివాజీ రాజా. ‘‘ఇందులో అయిదు పాటలుంటాయి. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, మున్నార్, గోవా.. వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరపనున్నాం’’ అన్నారు తూము నరసింహ పటేల్. ‘‘కథ చాలా బాగుంది. మంచి పాత్ర చేస్తున్నాను’’ అన్నారు విజయ్ రాజా. ఈ చిత్రానికి కెమెరా: కె బుజ్జి, సంగీతం: గ్యానీ సింగ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ. -
హీరో రామ్ ‘రెడ్’ చిత్రం ప్రారంభం
-
మహేశ్... సరిలేరు నీకెవ్వరు
అనుకున్న ముహూర్తానికే మహేశ్‌బాబు నెక్ట్స్ మూవీకి కొబ్బరికాయ కొట్టారు. సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు మహేశ్‌బాబు సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రష్మికా మండన్నా కథానాయిక. దాదాపు 13 ఏళ్ల తర్వాత సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమాతో మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా, నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. కె. రాఘవేంద్రరావు, ‘దిల్’ రాజు దర్శకుడు అనిల్ రావిపూడికి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘సూపర్‌స్టార్ కృష్ణగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ దర్శకుడు అనౌన్స్ చేశారు. సంక్రాంతికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అనిల్ రెడీ అయ్యారు’’ అన్నారు. ‘‘çకృష్ణగారి పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు మహేశ్ 26వ చిత్రం ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు అదిరిపోయే రేంజ్లో ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘నాతొలి చిత్రం ‘కిలాడి కృష్ణుడు’లో సూపర్‌స్టార్ కృష్ణ సరసన నటించే అవకాశం వచ్చింది. ఇప్పుడు 13ఏళ్ల తరవాత మళ్లీ సినిమాల్లోకి వస్తూ మహేశ్‌బాబు సినిమాలో నటించడం హ్యాపీ’’ అన్నారు విజయశాంతి. ‘‘నా జీవితంలో గుర్తుండిపోయే రోజు ఇది. అవకాశం ఇచ్చిన మహేశ్‌గారిని ఎప్పటికీ మర్చిపోలేను. కచ్చితంగా ఒక మంచి హిట్ ఫిల్మ్ ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటాను. మహేశ్‌గారి ఫ్యాన్స్ కోరుకునే అన్ని ఎలి మెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమాను మూడు బ్యానర్లు కలిసి చేయడం హ్యాపీ. ఇందులో మహేశ్‌బాబు ఆర్మీ మేజర్ క్యారెక్టర్లో కనిపిస్తారు. సబ్జెక్ట్ నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు విజయశాంతిగారు. జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘కృష్ణగారి పుట్టినరోజునే ఈ సినిమా ఓపెనింగ్ జరగడం హ్యాపీ. ‘మహర్షి’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే ఈ సినిమాలోకి అడుగుపెడుతున్నట్లుంది. అదిరిపోయే లెవల్లో ఓ మాస్ సాంగ్, ఓ లవ్‌సాంగ్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేయాలని నేను, అనిల్ డిసైడ్ అయ్యాం’’ అన్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. -
ప్రేమలో థ్రిల్
హర్షిత్ హీరోగా రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉపశీర్షిక. ఓ.యస్.యం విజన్, దివ్యాషిక క్రియేషన్స్ పతాకంపై సుక్రి కుమార్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ విడుదల చేశారు. రామ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం డీటీఎస్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. కథనం, సంగీతం, కెమెరావర్క్ మా సినిమాకు ప్రత్యేక ఎసెట్‌గా నిలుస్తాయి. ఈ నెలలోనే పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్, కెమెరా:ఎ. శ్రీకాంత్, సహ నిర్మాత: యాషిక. -
క్యూట్ లవ్‌స్టోరీ
‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, సిమ్రాన్ జంటగా పి.లక్ష్మీనారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నువ్వక్కడ నేనిక్కడ’. తాని గంగిరెడ్డి, కీర్తన వెంకటేష్ నిర్మాతలు. తొలి సన్నివేశానికి నిర్మాత కేకే రాధామోహన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత, పంపిణీదారుడు పారస్ జైన్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ఆర్బీ చౌదరి పూజలో పాల్గొన్నారు. పి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘చాలా గ్యాప్ తర్వాత నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యూత్‌ఫుల్ కథాంశంతో క్యూట్ లవ్‌స్టోరీగా రూపొందిస్తున్నాం. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. ‘‘నేను సోలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రమిది. కామెడీ హీరోగా మంచి పేరు వస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు పార్వతీశం. ‘‘డైరెక్టర్ని, కథను నమ్మి నిర్మిస్తున్నాం. ఈ సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆచంట రాంబాబు. ∙సిమ్రాన్, పార్వతీశం -
అందరూ మెచ్చేలా.. అందరికీ నచ్చేలా
నవీన్ చంద్ర, గాయత్రీ సురేశ్ హీరో హీరోయిన్లుగా ‘అడ్డా, ఓటర్’ చిత్రాల దర్శకుడు జి.యస్. కార్తీక్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్వాతి పిక్చర్స్ బ్యానర్లో భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ – ‘‘దర్శకుడు మంచి కథ చెప్పారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ చిత్రాన్ని అందిస్తాం అన్నారు. ‘‘ప్రేక్షకులకు కావల్సిన అంశాలన్నీ ఉంటాయి. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం. టీమ్ సహకారంతో అందరూ మెచ్చేలా, అందరికీ నచ్చేలా సినిమా తీయడానికి కృషి చేస్తాను’’ అన్నారు కార్తీక్. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ గంగాధరీ, సంగీతం: అనూప్ రూబెన్స్. -
మట్టి మనుషుల ప్రేమకథ
సూర్య భరత్‌చంద్ర, శ్రావ్యారావు జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సంత’. ‘మట్టి మనుషుల ప్రేమకథ’ అన్నది ఉపశీర్షిక. నెల్లుట్ల ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జైవర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తోన్న ఈ సినిమా వరంగల్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఎమ్మెల్యే రాజయ్య కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎంపీ పసునూరి దయాకర్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత శ్రీ జైవర్దన్ మాట్లాడుతూ– ‘‘సంత నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మా టీమ్ అందరికీ మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. కిన్నెర, మధుమణి, ‘తాగుబోతు’ రమేష్, రఘు కారుమంచి, ప్రసన్న, సాదయ్య, దుర్గేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఫణీంద్ర వర్మ అల్లూరి, కథ–కథనం –సంగీతం– దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్. -
నారా రోహిత్ కొత్త సినిమా