మట్టి మనుషుల ప్రేమకథ | Santha Movie Launch | Sakshi
Sakshi News home page

మట్టి మనుషుల ప్రేమకథ

Published Mon, Feb 19 2018 12:22 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

Santha Movie Launch - Sakshi

సూర్య భరత్‌చంద్ర, శ్రావ్యారావు, ఎమ్మెల్యే రాజయ్య,

సూర్య భరత్‌చంద్ర, శ్రావ్యారావు జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సంత’. ‘మట్టి మనుషుల ప్రేమకథ’ అన్నది ఉపశీర్షిక. నెల్లుట్ల ప్రవీణ్‌చందర్‌ దర్శకత్వంలో శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్‌ పతాకంపై శ్రీ జైవర్దన్‌ బోయెనేపల్లి నిర్మిస్తోన్న ఈ సినిమా వరంగల్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఎమ్మెల్యే రాజయ్య కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ఎంపీ పసునూరి దయాకర్‌ క్లాప్‌ ఇచ్చారు.

నిర్మాత శ్రీ జైవర్దన్‌ మాట్లాడుతూ– ‘‘సంత నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మా టీమ్‌ అందరికీ మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. కిన్నెర, మధుమణి, ‘తాగుబోతు’ రమేష్, రఘు కారుమంచి, ప్రసన్న, సాదయ్య, దుర్గేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఫణీంద్ర వర్మ అల్లూరి, కథ–కథనం –సంగీతం– దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement