
Bewars Actor Sanjosh New Movie Launched: మొదటి సినిమా ‘బేవర్స్’తో మంచి నటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో సంజోష్. ఈ చిత్రంలో ఆయన పర్ఫామెన్స్‌కు అందరూ ఆకర్షితులయ్యారు. నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన 'బేవర్స్' సినిమాలో సంజోష్ తన ఎమోషనల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నింట్లో సంజోష్ తన మార్క్ చూపించాడు. సంజోష్ తాజాగా తన రెండో సినిమాకు సంబంధించిన ప్రకటన చేశాడు.
బుధవారం (జూలై 13) సంజోష్ పుట్టిన రోజు సందర్భంగా రెండో సినిమా ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సంజోష్ తన రెండో చిత్రాన్ని చేస్తున్నాడు. సంజోష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. మేకర్లు సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని, మరిన్ని పూర్తి వివరాలు తెలియజేస్తామని మేకర్లు తెలిపారు.
చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?..
నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment