యంగ్‌ హీరో శ్రీవిష్ణు కొత్త సినిమా షురూ | Sree Vishnu New Movie Launched With Pooja Ceremony | Sakshi
Sakshi News home page

Sree Vishnu : యంగ్‌ హీరో శ్రీవిష్ణు కొత్త సినిమా షురూ

Published Mon, Sep 26 2022 10:30 AM | Last Updated on Mon, Sep 26 2022 10:38 AM

Sree Vishnu New Movie Launched With Pooja Ceremony - Sakshi

శ్రీవిష్ణు హీరోగా నూతన సినిమా షురూ అయింది. ‘వివాహ భోజనంబు’(ఓటీటీ ప్రాజెక్ట్‌) ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్‌ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్య మూవీస్‌పై రాజేష్‌ దండా నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నారా రోహిత్‌ క్లాప్‌ ఇచ్చారు. ‘‘పూర్తి ఫన్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది.

త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ కార్యక్రమంలో నిర్మాత అనిల్‌ సుంకర, దర్శకులు వీఐ ఆనంద్, విజయ్‌ కనకమేడల, ఏఆర్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. సుదర్శన్, శ్రీకాంత్‌ అయ్యంగార్, దేవీ ప్రసాద్, ప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాంరెడ్డి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement