వాసం నరేశ్, ఆశ ప్రమీల హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ప్యాకప్’. జీవీఎస్ ప్రణీల్ దర్శకత్వంలో పానుగంటి శరత్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత ఏయమ్ రత్నం ముఖ్య అతిథిగా హాజరై తొలి సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రం గొప్ప విజయం సాధించి, చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలని ఏయమ్ రత్నం కోరారు.
‘‘ప్రేమలోని మరో కోణాన్ని ఈ సినిమాతో చెప్పాలనుకుంటున్నాం’’ అన్నారు జీవీఎస్ ప్రణీల్. ‘‘ఏకధాటిగా షూటింగ్ ప్లాన్ చేశాం’’ అన్నారు శరత్‌రెడ్డి. ఒక మంచి కథతో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందని వాసం నరేశ్ తెలిపాడు. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా శ్రీకృష్ణ గుళ్లపల్లి లైన్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తించారు.
Packup Movie: ప్రారంభమైన ప్యాకప్ చిత్రం.. ముఖ్య అతిథిగా ఏయమ్ రత్నం
Published Tue, Feb 22 2022 1:15 PM | Last Updated on Tue, Feb 22 2022 1:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment