మహేశ్‌... సరిలేరు నీకెవ్వరు | mahesh babu new movie Sarileru Neekevvaru launch | Sakshi
Sakshi News home page

మహేశ్‌... సరిలేరు నీకెవ్వరు

Published Sat, Jun 1 2019 2:45 AM | Last Updated on Sat, Jun 1 2019 2:45 AM

mahesh babu new movie Sarileru Neekevvaru launch - Sakshi

పి.కిరణ్, ‘దిల్‌’ రాజు, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, రష్మిక, రాఘవేంద్రరావు, అనిల్‌ రావిపూడి, లక్ష్మణ్, రామబ్రహ్మం సుంకర, అనిల్‌ సుంకర, శిరీష్‌

అనుకున్న ముహూర్తానికే మహేశ్‌బాబు నెక్ట్స్‌ మూవీకి కొబ్బరికాయ కొట్టారు. సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు మహేశ్‌బాబు సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రష్మికా మండన్నా కథానాయిక. దాదాపు 13 ఏళ్ల తర్వాత సీనియర్‌ నటి విజయశాంతి ఈ సినిమాతో మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్‌టైన్మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్‌ ఇవ్వగా, నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కె. రాఘవేంద్రరావు, ‘దిల్‌’ రాజు దర్శకుడు అనిల్‌ రావిపూడికి  స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘సూపర్‌స్టార్‌ కృష్ణగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు ఆల్రెడీ దర్శకుడు అనౌన్స్‌ చేశారు. సంక్రాంతికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడానికి అనిల్‌ రెడీ అయ్యారు’’ అన్నారు. ‘‘çకృష్ణగారి పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు మహేశ్‌ 26వ చిత్రం ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు అదిరిపోయే రేంజ్‌లో ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత అనిల్‌ సుంకర. ‘‘నాతొలి చిత్రం ‘కిలాడి కృష్ణుడు’లో సూపర్‌స్టార్‌ కృష్ణ సరసన నటించే అవకాశం వచ్చింది.

ఇప్పుడు 13ఏళ్ల తరవాత మళ్లీ సినిమాల్లోకి వస్తూ మహేశ్‌బాబు సినిమాలో నటించడం హ్యాపీ’’ అన్నారు విజయశాంతి. ‘‘నా జీవితంలో గుర్తుండిపోయే రోజు ఇది. అవకాశం ఇచ్చిన మహేశ్‌గారిని ఎప్పటికీ మర్చిపోలేను. కచ్చితంగా ఒక మంచి హిట్‌ ఫిల్మ్‌ ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటాను. మహేశ్‌గారి ఫ్యాన్స్‌ కోరుకునే అన్ని ఎలి మెంట్స్‌ ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమాను మూడు బ్యానర్‌లు కలిసి చేయడం హ్యాపీ.

ఇందులో మహేశ్‌బాబు ఆర్మీ మేజర్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. సబ్జెక్ట్‌ నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు విజయశాంతిగారు. జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు’’ అన్నారు అనిల్‌ రావిపూడి. ‘‘కృష్ణగారి పుట్టినరోజునే ఈ  సినిమా ఓపెనింగ్‌ జరగడం హ్యాపీ. ‘మహర్షి’ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తూనే ఈ సినిమాలోకి అడుగుపెడుతున్నట్లుంది. అదిరిపోయే లెవల్‌లో ఓ మాస్‌ సాంగ్, ఓ లవ్‌సాంగ్‌ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేయాలని నేను, అనిల్‌ డిసైడ్‌ అయ్యాం’’ అన్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement