
విజయ్ రాజా, తమన్నా వ్యాస్
నటుడు శివాజీ రాజా తనయుడు, ‘ఏదైనా జరగొచ్చు’ ఫేమ్ విజయ్ రాజా హీరోగా రెండో సినిమా షురూ అయింది. రామ్స్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్నారు. జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. తమన్నా వ్యాస్ కథానాయిక. హీరో నాగశౌర్య ముహూర్తం సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ– ‘‘వినోద ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది.
విజయ్ రాజాకి కరెక్ట్‌గా సరిపోతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రకథ విన్నాను.. బాగుంది’’ అన్నారు శివాజీ రాజా. ‘‘ఇందులో అయిదు పాటలుంటాయి. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, మున్నార్, గోవా.. వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరపనున్నాం’’ అన్నారు తూము నరసింహ పటేల్. ‘‘కథ చాలా బాగుంది. మంచి పాత్ర చేస్తున్నాను’’ అన్నారు విజయ్ రాజా. ఈ చిత్రానికి కెమెరా: కె బుజ్జి, సంగీతం: గ్యానీ సింగ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ.
Comments
Please login to add a commentAdd a comment