
నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా నటించిన చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. రామ్స్ రాథోడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా వ్యాస్ హీరోయిన్. జామి లక్ష్మీప్రసన్న సమర్పణలో తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు నిర్మించారు. ‘కత్తి ఖతర్నాక్..’ అంటూ సాగే ఈ చిత్రంలోని ప్రత్యేక పాటను శివాజీరాజా విడుదల చేశారు. రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ –‘‘మా చిత్రానికి గ్యానీ సింగ్ మంచి సంగీతం అందిచారు. ‘కత్తి ఖతర్నాక్..’ పాటకు స్పందన బావుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని దర్శకుడు బాగా తీశాడు.’’ అన్నారు తూము నరసింహ పటేల్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ.