Vijay Raja
-
ఆహాలో అదరగొడుతున్న 'వేయి శుభములు కలుగు నీకు'
శివాజీ రాజా తనయుడిగా 'వేయి శుభములు కలుగు నీకు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్ రాజా. జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. విజయ్ రాజాకు జోడిగా తమన్నా వ్యాస్ నటించారు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. థియేటర్లలో అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో సినీ ప్రియులను అలరిస్తోంది. లవ్, కామెడీ, హారర్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రంలో విజయ్ రాజా నటన మెప్పిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఓటీటీ ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటోంది. మిలియన్ల వ్యూస్‌తో ఆహాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో మాస్టర్ జయదేవ్, శివాజీ రాజా, ఢీ ఫేం ఫాల్గుణి, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, అపూర్వ, మీనా, అనంత్, షాయాజి షిండే, శ్రీకాంత్ అయంగార్, రోహిణి, జబర్దస్త్ అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ ముఖ్య పాత్రలు పోషించారు. -
అదరగొడుతన్న ‘కత్తి ఖతర్నాక్’ పాట
నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా నటించిన చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. రామ్స్ రాథోడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా వ్యాస్ హీరోయిన్. జామి లక్ష్మీప్రసన్న సమర్పణలో తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు నిర్మించారు. ‘కత్తి ఖతర్నాక్..’ అంటూ సాగే ఈ చిత్రంలోని ప్రత్యేక పాటను శివాజీరాజా విడుదల చేశారు. రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ –‘‘మా చిత్రానికి గ్యానీ సింగ్ మంచి సంగీతం అందిచారు. ‘కత్తి ఖతర్నాక్..’ పాటకు స్పందన బావుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని దర్శకుడు బాగా తీశాడు.’’ అన్నారు తూము నరసింహ పటేల్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ. -
వేసవిలో శుభములు
నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా, తమన్నా వ్యాస్ హీరోయిన్గా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా అవకాశం ఇచ్చిన నరసింహ పటేల్, శ్రీనివాస రావుగార్లకు థ్యాంక్స్. వారు ఎక్కడా రాజీ పడకపోవడంతో సినిమా చాలా బాగా వచ్చింది. అందమైన లొకేషన్స్‌లో అద్భుతమైన నటీనటులతో మా సినిమాని చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘ఇటీవలే గోవాలో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకున్న మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నరసింహ పటేల్. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు జామి శ్రీనివాస రావు. శివాజీ రాజా, ‘సత్యం’ రాజేష్, సన, అనంత్, షాయాజీ షిండే, రోహిణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: కె. బుజ్జి, సంగీతం: గ్యాని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ. -
యాక్షన్ జెమ్
నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా నటించిన తాజా చిత్రం ‘జెమ్’. రాశీ సింగ్, నక్షత్ర హీరోయిన్లుగా నటించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో మహాలక్ష్మీ మూవీ మేకర్స్ పతాకంపై పత్తికొండ కుమారస్వామి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ని హీరో రవితేజ విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ రాజా మాట్లాడుతూ– ‘‘యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. రెండేళ్లు శ్రమించి సిద్ధం చేసిన కథను అంతే బాగా తెరకెక్కించారు సుబ్రహ్మణ్యంగారు’’ అన్నారు. ‘‘అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించాం’’ అన్నారు సుశీల సుబ్రహ్మణ్యం. ‘‘అవుట్‌పుట్ సంతృప్తికరంగా వచ్చింది’’ అన్నారు పత్తికొండ కుమారస్వామి. ‘‘తమిళ, కన్నడలో సినిమాలు చేసిన కుమారస్వామిగారు తెలుగులో మా అబ్బాయితో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు శివాజీ రాజా. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్. -
ఇదే టీమ్‌తో మరో సినిమా ఉంటుంది
నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. రామ్స్ రాథోడ్ దర్శకత్వం వహించారు. తమన్నా వ్యాస్, జ్ఞాన ప్రియ కథానాయికలుగా నటించారు. జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై తూము నరసింహ పటేల్ నిర్మించారు. విజయ్ రాజా పుట్టినరోజు (శుక్రవారం) సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను నటుడు సునీల్ విడుదల చేసి, యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ‘వేయి శుభములు కలుగు నీకు’ టీమ్‌తోనే మరో సినిమా త్వరలోనే స్టార్ట్ చేస్తాం’’ అన్నారు విజయ్ రాజా. ‘‘మా సినిమాకి మంచి టైటిల్ దొరికింది. నాకు మంచి నిర్మాత కుదిరారు’’ అన్నారు రామ్స్ రాథోడ్. ‘‘మా సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు తూము నరసింహ పటేల్. తమన్నా వ్యాస్, జ్ఞాన ప్రియ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: కె బుజ్జి, సంగీతం: గ్యాని సింగ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ. -
నవ్వుల రాజా
నటుడు శివాజీ రాజా తనయుడు, ‘ఏదైనా జరగొచ్చు’ ఫేమ్ విజయ్ రాజా హీరోగా రెండో సినిమా షురూ అయింది. రామ్స్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్నారు. జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. తమన్నా వ్యాస్ కథానాయిక. హీరో నాగశౌర్య ముహూర్తం సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ– ‘‘వినోద ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది. విజయ్ రాజాకి కరెక్ట్‌గా సరిపోతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రకథ విన్నాను.. బాగుంది’’ అన్నారు శివాజీ రాజా. ‘‘ఇందులో అయిదు పాటలుంటాయి. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, మున్నార్, గోవా.. వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరపనున్నాం’’ అన్నారు తూము నరసింహ పటేల్. ‘‘కథ చాలా బాగుంది. మంచి పాత్ర చేస్తున్నాను’’ అన్నారు విజయ్ రాజా. ఈ చిత్రానికి కెమెరా: కె బుజ్జి, సంగీతం: గ్యానీ సింగ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ. -
‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏదైనా జరగొచ్చు జానర్ : డార్క్ కామెడీ హారర్ నటీనటులు : విజయ్ రాజా, బాబీ సింహా, పూజా సోలంకి, సాషా సింగ్, వెన్నెల కిశోర్ సంగీతం : శ్రీకాంత్ పెండ్యాల నిర్మాత : సుదర్శన్ హనగోడు దర్శకత్వం : రమాకాంత్ టాలీవుడ్లో విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసిన సీనియర్ నటుడు శివాజీ రాజా తనయుడు.. విజయ్ రాజాను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ఏదైనా జరగొచ్చు. తమిళ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో దర్శకుడిగా రమాకాంత్, సంగీత దర్శకుడిగా శ్రీకాంత్ పెండ్యాలలు పరిచయం అయ్యారు. మరి వీరందరికీ ఈ సినిమా బ్రేక్ ఇచ్చిందా..? కథ : జై (విజయ్ రాజా) తన స్నేహితులతో కలిసి ఈజీగా డబ్బు సంపాదించేందుకు ప్లాన్ చేస్తుంటాడు. ఓ ప్రైవేట్ సంస్థలో రికవరీ ఏజెంట్‌గా చేరిన జైకి శశిరేఖ(పూజ సోలంకి) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే శశితో ప్రేమలో పడ్డ జై, ఆమె ఇబ్బందుల గురించి తెలుసుకొని ఎలాగైన సాయం చేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా కాళీ(బాబీ సింహా) అనే రౌడీ దగ్గర క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బు పెట్టి సమస్యల్లో చిక్కుకుంటాడు. కాళీ జీవితంలో ఎవరికీ తెలియని ఓ రహస్యం జై అతని స్నేహితులకు తెలుస్తుంది. జైకి తెలిసిన ఆ రహస్యం ఏంటి..? కాళీ నుంచి జై అతని స్నేహితులు ఎలా తప్పించుకున్నారు? అన్నదే మిగతా కథ. నటీనటులు: ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్ రాజా పరవాలేదనిపించాడు. కామెడీ, లవ్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. కాళీ పాత్రకు బాబీ సింహా సరిగ్గా సరిపోయాడు. సీరియస్ లుక్‌లో మంచి విలనిజం చూపించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంటుంది. బేబీ పాత్రలో నటించిన సాషా సింగ్ నటన కాస్త అతిగా అనిపిస్తుంది. హీరోయిన్గా పూజా సోలంకి లుక్స్ పరంగా ఆకట్టుకున్నా నటనతో మెప్పించలేకపోయింది. సెకండ్ హాఫ్‌లో వెన్నెల కిశోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సూపర్ నేచురల్ పాయింట్‌తో కథను రెడీ చేసుకున్న దర్శకుడు ఆ స్థాయిలో సినిమాను తెరకెక్కించటంలో తడబడ్డాడు. ఆసక్తికరంగా సినిమాను ప్రారంభించినా తరువాత రొటీన్ సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. హీరో, అతని ఫ్రెండ్స్ డబ్బు కోసం చేసే ప్రయత్నాలు, లవ్ ట్రాక్ అంత ఆసక్తికరంగా అనిపించవు. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ద్వితీయార్థంపై ఆసక్తికలిగేలా చేసినా, ఆ టెంపోను కంటిన్యూ చేయలేకపోయాడు. అసలు ట్విస్ట్ రివీల్ అయిన తరువాత కూడా కథనం నెమ్మదిగా సాగుతూ విసిగిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో వెన్నెల కిశోర్ కామెడీ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. హారర్ సినిమాలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ తొలి ప్రయత్నంలో శ్రీకాంత్ పెండ్యాల తన మార్క్ చూపించలేకపోయాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్ : బాబీ సింహా వెన్నెల కిశోర్ కామెడీ మైనస్ పాయింట్స్ : కథా కథనం సంగీతం లాజిక్ లేని సన్నివేశాలు సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్.