వేసవిలో శుభములు | Veyi Shubhamulu Kalugu Neeku Movie Starts Post Productions | Sakshi
Sakshi News home page

వేసవిలో శుభములు

Published Tue, Jan 12 2021 6:02 AM | Last Updated on Tue, Jan 12 2021 6:02 AM

Veyi Shubhamulu Kalugu Neeku Movie Starts Post Productions - Sakshi

నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్‌ రాజా హీరోగా, తమన్నా వ్యాస్‌ హీరోయిన్‌గా రామ్స్‌ రాథోడ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రామ్స్‌ రాథోడ్‌ మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా అవకాశం ఇచ్చిన నరసింహ పటేల్, శ్రీనివాస రావుగార్లకు థ్యాంక్స్‌. వారు ఎక్కడా రాజీ పడకపోవడంతో సినిమా చాలా బాగా వచ్చింది.

అందమైన లొకేషన్స్‌లో అద్భుతమైన నటీనటులతో మా సినిమాని చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘ఇటీవలే గోవాలో చివరి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న మా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నరసింహ పటేల్‌.  ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు జామి శ్రీనివాస రావు. శివాజీ రాజా, ‘సత్యం’ రాజేష్, సన, అనంత్, షాయాజీ షిండే, రోహిణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: కె. బుజ్జి, సంగీతం: గ్యాని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విక్రమ్‌ రమణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement